Aadavallu Meeku Johaarlu Collections: 4వ రోజు కూడా డౌన్.. శర్వా లిస్టులో మరో డిజాస్టర్..?

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో చాలా కాలంగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న హీరోలలో శర్వానంద్ అయితే నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు అని చెప్పవచ్చు. ఇటీవల కాలంలో ఎలాంటి సినిమాలు చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద తీవ్రస్థాయిలో నిరాశ పరుస్తున్నాయి. ఇక ఈ సారి ఎలాగైనా మంచి విజయాన్ని అందుకోవాలని కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఆడవాళ్లు మీకు జోహార్లు అనే సినిమా చేశాడు.

కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి వారాంతంలో మంచి కలెక్షన్స్ అందుకున్నప్పటికీ సోమవారం నుంచి వసూలు ఒక్కసారిగా తగ్గి పోయాయి. ఇక నాలుగవ రోజు వచ్చిన కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అని వివరాల్లోకి వెళితే..

వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్

వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్

'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రావడంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా మంచి బిజినెస్ చేసింది. ఇక రెండు రాష్ట్రాల్లో సినిమా రూ. 13.90 కోట్లు బిజినెస్ చేయగా.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో అలాగే ఓవర్సీస్‌లలో రూ. 1.60 కోట్ల వరకు బిజినెస్ చేసింది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ రూ. 15.50 కోట్ల మేర బిజినెస్ చేసినట్లు సమాచారం.

రెండు రాష్ట్రాల్లో 4వ రోజు కలెక్షన్స్

రెండు రాష్ట్రాల్లో 4వ రోజు కలెక్షన్స్

నాలుగవ రోజు 'ఆడవాళ్లు మీకు జోహార్లు' కలెక్షన్స్ తగ్గాయి. ఏపీ, తెలంగాణలో ఏరియాల వారిగా వచ్చిన కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. నైజాంలో రూ. 31 లక్షలు, సీడెడ్‌లో రూ. 8 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 10 లక్షలు, ఈస్ట్‌లో రూ. 7 లక్షలు, వెస్ట్‌లో రూ. 5 లక్షలు, గుంటూరులో రూ. 6 లక్షలు, కృష్ణాలో రూ. 5 లక్షలు, నెల్లూరులో రూ. 3 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో మొత్తంగా రూ. 0.75 కోట్లు షేర్, రూ. 1.20 కోట్లు గ్రాస్ వచ్చింది.

ఏపీ తెలంగాణ 4 రోజుల కలెక్షన్స్

ఏపీ తెలంగాణ 4 రోజుల కలెక్షన్స్

మొత్తంగా నాలుగు రోజుల్లో 'ఆడవాళ్లు మీకు జోహార్లు' రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏరియాల వారిగా ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంది అనే వివరాల్లోకి వెళితే.. నైజాంలో రూ. 2.24 కోట్లు, సీడెడ్‌లో రూ. 65 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 69 లక్షలు, ఈస్ట్‌లో రూ. 40 లక్షలు, వెస్ట్‌లో రూ. 31 లక్షలు, గుంటూరులో రూ. 41 లక్షలు, కృష్ణాలో రూ. 38 లక్షలు, నెల్లూరులో రూ. 24 లక్షలతో కలుపుకుని ఫైనల్ గా ఏపీ తెలంగాణలో రూ. 5.32 కోట్లు షేర్, రూ. 8.95 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచవ్యాప్తంగా..

ప్రపంచవ్యాప్తంగా..

ప్రపంచ వ్యాప్తంగా సోమవారం నాటికి ఆంధ్రా, తెలంగాణలో రూ. 5.32 కోట్లు కలెక్ట్ చేసిన 'ఆడవాళ్లు మీకు జోహార్లు' కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండయాలో రూ. 33 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 84 లక్షల షేర్ మాత్రమే కలెక్ట్ చేసింది. ఇక 4 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 6.49 కోట్లు షేర్‌, రూ. 10.50 కోట్ల గ్రాస్ దక్కింది.

ఇంకా ఎంత రావాలంటే..?

ఇంకా ఎంత రావాలంటే..?

గతకొన్నాళ్ల నుంచి వరుస అపజయాలు ఎదుర్కొంటున్న శర్వానంద్ ఈసారి ఎలాగైనా శర్వానంద్ 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమాతో మంచి విజయాన్ని అందుకోవాలని అనుకున్నాడు. ఇక వారి రేంజ్ కు తగ్గట్టుగా రూ. 15.50 కోట్లు మేర బిజినెస్ చేసిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రూ. 16 కోట్లకు నమోదైంది. ఇక, అయితే 4 రోజుల్లో రూ. 6.49 కోట్లు మాత్రమే వసూలు చేసిన ఈ సినిమా మరో రూ. 9.51బ్కోట్లు వస్తేనే సక్సెస్ అయినట్లు లెక్క.

శర్వా.. మరో డిజాస్టర్?

శర్వా.. మరో డిజాస్టర్?

హీరో శర్వానంద్ సక్సెస్ చూసి చాలా కాలం అయ్యింది. శతమానం భవతి సినిమాతో ఒక్క సారిగా తన మార్కెట్ను పెంచుకున్న ఈ హీరో ఆ తర్వాత 2017 లో మహానుభావుడు అనే సినిమా చేశాడు. ఆ సినిమా తర్వాత మళ్లీ మరో సినిమా సక్సెస్ అవ్వలేదు. పడి పడి లేచే మనసు, రణరంగం, శ్రీకారం, మహాసముద్రం ఇలా వరుసగా అపజయాలు వచ్చాయి. ఈసారి ఎలాగైనా ఆడవాళ్లు మీకు జోహార్లు అనే సినిమాతో సక్సెస్ కొట్టాలని అనుకున్నప్పటికీ ఈ సినిమా కూడా తీవ్రంగా నిరాశపరిచింది.

పోనీ రానున్న రెండు మూడు రోజుల్లో ఆయన కలెక్షన్స్ వస్తాయి అనుకుంటే అప్పుడు రాధేశ్యామ్ సినిమా పూర్తిగా డామినేట్ చేస్తుంది అని చెప్పవచ్చు. మరి సినిమా మొత్తంగా రాబోయే రెండు మూడు రోజుల్లో ఏ స్థాయిలో వసూళ్లను అందుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X