Aadavallu Meeku Johaarlu Collections: మొదటి రోజే ఊహించని కలెక్షన్లు.. 16 కోట్లు వచ్చింది ఎంతంటే!

స్వయంకృషితో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా విలక్షణమైన నటన, విభిన్నమై చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు టాలెంటెడ్ హీరో శర్వానంద్. సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా ప్రతి దాంట్లో సహజ సిద్ధమైన నటనను కనబరిచే అతడు.. ప్రేక్షకులను ఫిదా చేస్తున్నాడు. ఇలా కెరీర్ ఆరంభం నుంచి ఎన్నో చిత్రాలతో ప్రేక్షకులను అలరించాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు 'ఆడవాళ్లు మీకు జోహార్లు' అనే సినిమాతో శర్వానంద్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

ఈ సినిమాకు ఆరంభం నుంచే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. దీంతో కలెక్షన్లపై ఆ ప్రభావం పడిపోయింది. ఈ నేపథ్యంలో 'ఆడవాళ్లు మీకు జోహార్లు' మొదటి రోజు బాక్సాఫీస్ రిపోర్టును చూద్దాం పదండి!

ఆడవాళ్లుకు జోహార్లు చెప్పిన హీరో

ఆడవాళ్లుకు జోహార్లు చెప్పిన హీరో

శర్వానంద్ - కిశోర్ తిరుమల కాంబినేషన్‌లో వచ్చిన చిత్రమే ‘ఆడవాళ్లు మీకు జోహార్లు'. రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. దేవీ శ్రీ ప్రసాద్ ఈ మూవీకి సంగీతం అందించాడు. ఇందులో కుస్భూ, రాధిక శరత్‌కుమార్, ఊర్వశి, వెన్నెల కిశోర్ కీలక పాత్రల్లో నటించారు.

థియేట్రికల్ బిజినెస్ డీటేల్స్ ఇవే

థియేట్రికల్ బిజినెస్ డీటేల్స్ ఇవే

తెలుగు రాష్ట్రాల్లో శర్వానంద్‌కు పెద్దగా మార్కెట్ లేదు. అయినా ‘ఆడవాళ్లు మీకు జోహార్లు' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో రూ. 13.90 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లలో కలిపి రూ. 1.60 కోట్లు వ్యాపారం జరిగింది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 15.50 కోట్ల బిజినెస్ జరుపుకుని ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదలైంది.

 మిక్స్‌డ్ టాక్... ఆదరణ అంతంతే

మిక్స్‌డ్ టాక్... ఆదరణ అంతంతే

భారీ అంచనాలతో ‘ఆడవాళ్లు మీకు జోహార్లు' మూవీ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రానికి ఓవరాల్‌గా ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. దీంతో మ్యాట్నీలు అంతంతగానే సాగాయి. అయితే, సాయంత్రం నుంచి మళ్లీ పుంజుకుంది. దీంతో ఈ మూవీకి కలెక్షన్లు బాగానే వస్తాయని అందరూ అంచనా వేశారు.

తొలి రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?

తొలి రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?

‘ఆడవాళ్లు మీకు జోహార్లు'కి ఏపీ, తెలంగాణలో మొదటి రోజు కలెక్షన్లు ఇలా ఉన్నాయి. నైజాంలో రూ. 72 లక్షలు, సీడెడ్‌లో రూ. 18 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 20 లక్షలు, ఈస్ట్‌లో రూ. 9 లక్షలు, వెస్ట్‌లో రూ. 8 లక్షలు, గుంటూరులో రూ. 12 లక్షలు, కృష్ణాలో రూ. 11 లక్షలు, నెల్లూరులో రూ. 7 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 1.57 కోట్లు షేర్, రూ. 2.90 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రూ. 1.57 కోట్లు మాత్రమే వసూలు చేసిన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు' మూవీ మిగిలిన ప్రాంతాల్లోనూ అంతగా రాణించలేదు. ఫలితంగా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండయాలో రూ. 12 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 23 లక్షలు మాత్రమే కలెక్ట్ చేసింది. దీంతో తొలి రోజు ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 1.92 కోట్లు షేర్‌, రూ. 3.60 కోట్ల గ్రాస్ దక్కింది.

Recommended Video

Aadavaallu Meeku Johaarlu Is A Great Tribute To Women | Filmibeat Telugu
 బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

శర్వానంద్ హీరోగా కిశోర్ తిరుమల తెరకెక్కించిన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 15.50 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 16 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా మొదటి రోజే రూ. 1.92 కోట్లు వసూలు చేసింది. అంటే మరో రూ. 14.08 కోట్లు వస్తేనే ఇది హిట్ అవుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X