Aadavallu Meeku Johaarlu Collections: రెండో రోజూ తప్పని నిరాశ.. వీకెండ్‌లో ఇలాంటి కలెక్షన్లా!
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్న టాలెంటెడ్ హీరోల్లో శర్వానంద్ ఒకడు. బ్యాగ్రౌండ్ లేకుండానే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అతడు.. తనదైన శైలి నటనతో పాటు హావభావాలతో ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్నాడు. అంతేకాదు, కెరీర్ ఆరంభంలోనే కొన్ని సక్సెస్‌లను కూడా సొంతం చేసుకున్నాడు. దీంతో స్టార్‌డమ్‌ను అందుకున్నాడు. అయితే, కొంత కాలంగా సరైన హిట్ లేక శర్వానంద్ ఇబ్బందులు పడుతున్నాడు.
ఇలాంటి పరిస్థితుల్లో గత శుక్రవారమే అతడు 'ఆడవాళ్లు మీకు జోహార్లు' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మిక్స్‌డ్ టాక్‌ను తెచ్చుకున్న ఈ చిత్రం కలెక్షన్లను భారీగా రాబట్టలేకపోతోంది. ఈ నేపథ్యంలో శర్వానంద్ సినిమా రెండు రోజుల్లో ఎంత వసూలు చేసిందో చూద్దాం పదండి!

వాళ్లతో కలిసి వచ్చేసిన శర్వానంద్
శర్వానంద్ హీరోగా కిశోర్ తిరుమల తెరకెక్కించిన చిత్రమే 'ఆడవాళ్లు మీకు జోహార్లు'. ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించింది. దీన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చాడు. ఇందులో కుస్భూ, రాధిక శరత్‌కుమార్, ఊర్వశి, వెన్నెల కిశోర్ కీలక పాత్రలు పోషించారు.

థియేట్రికల్ బిజినెస్ డీటేల్స్ ఇవే
శర్వానంద్‌కు తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా మార్కెట్ లేదు. కానీ, 'ఆడవాళ్లు మీకు జోహార్లు' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో రూ. 13.90 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లలో కలిపి రూ. 1.60 కోట్లు వ్యాపారం జరిగింది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా శర్వానంద్ నటించిన ఈ సినిమా రూ. 15.50 కోట్ల బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

2వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?
ఏపీ, తెలంగాణలో 'ఆడవాళ్లు మీకు జోహార్లు'కి రెండో రోజు కలెక్షన్లు తగ్గాయి. ఫలితంగా నైజాంలో రూ. 56 లక్షలు, సీడెడ్‌లో రూ. 17 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 19 లక్షలు, ఈస్ట్‌లో రూ. 9 లక్షలు, వెస్ట్‌లో రూ. 7 లక్షలు, గుంటూరులో రూ. 9 లక్షలు, కృష్ణాలో రూ. 9 లక్షలు, నెల్లూరులో రూ. 6 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 1.32 కోట్లు షేర్, రూ. 2 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

2 రోజులకు కలిపి ఎంత వచ్చింది?
2 రోజుల్లో 'ఆడవాళ్లు మీకు జోహార్లు'కి తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు అంతగా రాలేదు. దీంతో నైజాంలో రూ. 1.28 కోట్లు, సీడెడ్‌లో రూ. 35 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 39 లక్షలు, ఈస్ట్‌లో రూ. 18 లక్షలు, వెస్ట్‌లో రూ. 15 లక్షలు, గుంటూరులో రూ. 21 లక్షలు, కృష్ణాలో రూ. 20 లక్షలు, నెల్లూరులో రూ. 13 లక్షలతో కలుపుకుని రూ. 2.89 కోట్లు షేర్, రూ. 4.90 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?
ఆంధ్రా, తెలంగాణలో రెండు రోజుల్లో రూ. 2.89 కోట్లు మాత్రమే వసూలు చేసిన 'ఆడవాళ్లు మీకు జోహార్లు' మూవీ మిగిలిన ప్రాంతాల్లోనూ అంతగా రాణించలేదు. ఫలితంగా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండయాలో రూ. 20 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 58 లక్షలు మాత్రమే కలెక్ట్ చేసింది. దీంతో 2 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 3.67 కోట్లు షేర్, రూ. 6.15 కోట్ల గ్రాస్ దక్కింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?
శర్వానంద్ - కిశోర్ తిరుమల కాంబినేషన్‌లో రూపొందిన 'ఆడవాళ్లు మీకు జోహార్లు' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 15.50 కోట్లు మేర బిజినెస్ జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 16 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా రెండు రోజుల్లో రూ. 3.67 కోట్లు మాత్రమే వసూలు చేసింది. అంటే మరో రూ. 12.33 కోట్లు వస్తేనే ఇది హిట్‌గా నిలుస్తుంది.

వీకెండ్‌లో నిరాశ పరిచిన కలెక్షన్లు
క్రేజీ కాంబినేషన్‌లో ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన 'ఆడవాళ్లు మీకు జోహార్లు' మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. దీంతో ఈ చిత్రానికి ఓపెనింగ్ భారీగా వస్తాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. కానీ, అందుకు భిన్నంగా తొలి రెండు రోజుల్లో వసూళ్లు వచ్చాయి. ఇక, ఈ సినిమా ఆదివారం రాణించాల్సి ఉంది. లేకుంటే ఆ తర్వాత మరింత తగ్గే ప్రమాదం ఉంది.


Click it and Unblock the Notifications











