Aadavallu Meeku Johaarlu Collections: 16 కోట్ల టార్గెట్.. 3 రోజుల్లో అంతే.. ఎన్ని కోట్లు రావాలంటే!
టాలీవుడ్‌లో హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాల మీద సినిమాలు చేస్తూ వెళ్తోన్న యంగ్ హీరోల్లో శర్వానంద్ ఒకడు. కెరీర్ ఆరంభంలో చిన్న చిన్న పాత్రల్లో నటించిన అతడు.. ఆ తర్వాత హీరోగా మారాడు. అలా ఆరంభంలోనే తనదైన శైలి యాక్టింగ్, హావభావాలతో ప్రేక్షకుల మెప్పును పొందడంతో పాటు ఫాలోయింగ్‌ను కూడా భారీగా పెంచుకున్నాడు. అయితే, ఆరంభంలో మాదిరిగా విజయాలను మాత్రం అందుకోలేకపోతున్నాడు.
ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే 'ఆడవాళ్లు మీకు జోహార్లు' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ, ఈ సినిమా ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్‌ను తెచ్చుకోవడంతో కలెక్షన్లను సరిగా రాబట్టలేకపోతోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ 3 రోజుల్లో ఎంత వసూలు చేసిందో చూడండి!

ఆడవాళ్లకు జోహార్లు అంటోన్న శర్వా
శర్వానంద్ - కిశోర్ తిరుమల కలయికలో రూపొందిన చిత్రమే ‘ఆడవాళ్లు మీకు జోహార్లు'. ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా చేసింది. దీన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. ఇందులో కుస్భూ, రాధిక శరత్‌కుమార్, ఊర్వశి, వెన్నెల కిశోర్ కీలక పాత్రల్లో కనిపించారు.

థియేట్రికల్ బిజినెస్ డీటేల్స్ ఇవే
చాలా కాలంగా ఇండస్ట్రీలో ఉన్నా.. శర్వానంద్‌కు తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా మార్కెట్ లేదు. కానీ, ‘ఆడవాళ్లు మీకు జోహార్లు' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో రూ. 13.90 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లలో కలిపి రూ. 1.60 కోట్లు వ్యాపారం జరిగింది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు రూ. 15.50 కోట్ల మేర బిజినెస్ జరిగింది.

3వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?
‘ఆడవాళ్లు మీకు జోహార్లు'కి మూడో రోజు ఏపీ, తెలంగాణలో కలెక్షన్లు పెరిగాయి. ఫలితంగా నైజాంలో రూ. 65 లక్షలు, సీడెడ్‌లో రూ. 22 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 20 లక్షలు, ఈస్ట్‌లో రూ. 15 లక్షలు, వెస్ట్‌లో రూ. 11 లక్షలు, గుంటూరులో రూ. 14 లక్షలు, కృష్ణాలో రూ. 13 లక్షలు, నెల్లూరులో రూ. 8 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 1.68 కోట్లు షేర్, రూ. 2.85 కోట్లు గ్రాస్ వచ్చింది.

3 రోజులకు కలిపి ఎంత వచ్చింది?
‘ఆడవాళ్లు మీకు జోహార్లు'కి 3 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు పెద్దగా రాలేదు. దీంతో నైజాంలో రూ. 1.93 కోట్లు, సీడెడ్‌లో రూ. 57 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 59 లక్షలు, ఈస్ట్‌లో రూ. 33 లక్షలు, వెస్ట్‌లో రూ. 26 లక్షలు, గుంటూరులో రూ. 35 లక్షలు, కృష్ణాలో రూ. 33 లక్షలు, నెల్లూరులో రూ. 21 లక్షలతో కలుపుకుని రూ. 4.57 కోట్లు షేర్, రూ. 7.75 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?
మూడు రోజుల్లో ఆంధ్రా, తెలంగాణలో రూ. 4.57 కోట్లు మాత్రమే వసూలు చేసిన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు' మూవీ మిగిలిన ప్రాంతాల్లోనూ అంతగా రాణించలేదు. ఫలితంగా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండయాలో రూ. 30 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 80 లక్షలు మాత్రమే కలెక్ట్ చేసింది. దీంతో 3 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 5.67 కోట్లు షేర్, రూ. 9.10 కోట్ల గ్రాస్ దక్కింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?
శర్వానంద్ హీరోగా రూపొందిన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 15.50 కోట్లు మేర బిజినెస్ జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 16 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా మూడు రోజుల్లో రూ. 5.67 కోట్లు మాత్రమే వసూలు చేసింది. అంటే మరో రూ. 10.33 కోట్లు వస్తేనే ఇది హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది.
Recommended Video

వీకెండ్‌లో నిరాశ పరిచిన కలెక్షన్లు
ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు' మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. దీంతో ఈ చిత్రానికి ఓపెనింగ్ భారీగా వస్తాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. కానీ, అందుకు భిన్నంగా తొలి వీకెండ్‌లో రూ. 5.67 కోట్లు మాత్రమే వచ్చాయి. ఇక, ఈ చిత్రానికి సోమవారం నుంచి అగ్నిపరీక్ష ఎదురు కాబోతుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











