Aadavallu Meeku Johaarlu Collections: శర్వానంద్‌కు దెబ్బ మీద దెబ్బ.. 16 కోట్లకు వచ్చింది ఎంతంటే!

తెలుగు సినీ ఇండస్ట్రీలో హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్లే హీరోల్లో టాలెంటెడ్ గాయ్ శర్వానంద్ ఒకడు. స్వయంకృషితో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అతడు.. ఆరంభంలోనే తనదైన శైలి విలక్షణ నటనతో ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నాడు. అదే సమయంలో ఎన్నో విజయాలను కూడా అందుకున్నాడు.

అయితే, కొంత కాలంగా అతడు వరుస పరాజయాలతో ఇబ్బందులు పడుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని ఇటీవలే 'ఆడవాళ్లు మీకు జోహార్లు' అనే సినిమా చేశాడు. కానీ, ఈ సినిమా ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్‌ను తెచ్చుకోవడంతో కలెక్షన్లను సరిగా రాబట్టలేకపోతోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ 5 రోజుల్లో ఎంత వసూలు చూద్దాం పదండి!

ఆడవాళ్లకు జోహార్లు అని వచ్చాడు

ఆడవాళ్లకు జోహార్లు అని వచ్చాడు

శర్వానంద్ హీరోగా కిశోర్ తిరుమల రూపొందించిన చిత్రమే 'ఆడవాళ్లు మీకు జోహార్లు'. ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా చేసింది. దీన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. ఇందులో కుస్భూ, రాధిక శరత్‌కుమార్, ఊర్వశి, వెన్నెల కిశోర్ కీలకమైన పాత్రలను పోషించారు.

థియేట్రికల్ బిజినెస్ డీటేల్స్ ఇవే

థియేట్రికల్ బిజినెస్ డీటేల్స్ ఇవే

శర్వానంద్‌కు తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా మార్కెట్ లేదన్న విషయం తెలిసిందే. కానీ, 'ఆడవాళ్లు మీకు జోహార్లు' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో రూ. 13.90 కోట్లు బిజినెస్ జరిగింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లలో కలిపి రూ. 1.60 కోట్లు వ్యాపారం జరిగింది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు రూ. 15.50 కోట్ల మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

5వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?

5వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?

'ఆడవాళ్లు మీకు జోహార్లు'కి మూడో రోజు ఏపీ, తెలంగాణలో కలెక్షన్లు పెరిగాయి. ఫలితంగా నైజాంలో రూ. 18 లక్షలు, సీడెడ్‌లో రూ. 5 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 8 లక్షలు, ఈస్ట్‌లో రూ. 4 లక్షలు, వెస్ట్‌లో రూ. 3 లక్షలు, గుంటూరులో రూ. 4 లక్షలు, కృష్ణాలో రూ. 3 లక్షలు, నెల్లూరులో రూ. 2 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 47 లక్షలు షేర్, రూ. 74 కోట్లు గ్రాస్ వచ్చింది.

5 రోజులకు కలిపి ఎంత వచ్చింది?

5 రోజులకు కలిపి ఎంత వచ్చింది?

5 రోజుల్లో 'ఆడవాళ్లు మీకు జోహార్లు'కి తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు సోసోగా వచ్చాయి. దీంతో నైజాంలో రూ. 2.42 కోట్లు, సీడెడ్‌లో రూ. 70 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 77 లక్షలు, ఈస్ట్‌లో రూ. 44 లక్షలు, వెస్ట్‌లో రూ. 34 లక్షలు, గుంటూరులో రూ. 45 లక్షలు, కృష్ణాలో రూ. 41 లక్షలు, నెల్లూరులో రూ. 26 లక్షలతో కలుపుకుని రూ. 5.79 కోట్లు షేర్, రూ. 9.70 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

ప్రపంచ వ్యాప్తంగా వచ్చింది ఎంత?

ఆంధ్రా, తెలంగాణలో ఐదు రోజుల్లో రూ. 5.79 కోట్లు మాత్రమే వసూలు చేసిన 'ఆడవాళ్లు మీకు జోహార్లు' మూవీ మిగిలిన ప్రాంతాల్లోనూ అంతగా రాణించలేదు. ఫలితంగా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండయాలో రూ. 34 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 86 లక్షలు మాత్రమే కలెక్ట్ చేసింది. దీంతో 5 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 6.99 కోట్లు షేర్‌, రూ. 11.25 కోట్ల గ్రాస్ దక్కింది.

 బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఎంత రావాలి?

ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన 'ఆడవాళ్లు మీకు జోహార్లు' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 15.50 కోట్లు మేర బిజినెస్ జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 16 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 5 రోజుల్లో రూ. 6.99 కోట్లు మాత్రమే వసూలు చేసింది. అంటే మరో రూ. 9.01 కోట్లు వస్తేనే ఇది హిట్‌ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X