Aadavallu Meeku Johaarlu Bussiness: డీసెంట్ టార్గెట్ తో వస్తున్న శర్వానంద్.. ఎంత వస్తే హిట్ అంటే?
తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న శర్వానంద్ మరోసారి బాక్సాఫీస్ వద్ద అదృష్టాన్ని పరీక్షించు బోతున్నాడు. గత కొంతకాలంగా వరుస అపజయాలతో సతమతమవుతున్న ఈ హీరో ఈ సారి ఎలాగైనా ఆడవాళ్లు మీకు జోహార్లు అనే సినిమాతో మంచి విజయాన్ని అందుకోవాలని అని చూస్తున్నాడు. శుక్రవారం ఈ సినిమా రిలీజ్ అవుతోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన బడ్జెట్ అలాగే ప్రీ రిలీజ్ బిజినెస్ ఎలా ఉంది మొత్తం ఏ స్థాయిలో కలెక్షన్లు అందుకుంటే హిట్ అయినట్లు లెక్క అనే వివరాల్లోకి వెళితే..

ఆ సినిమాతో బిగ్గెస్ట్ హిట్
ఒకప్పుడు శర్వానంద్ తో సినిమాలు చేస్తే బాక్సాఫీస్ వద్ద మినిమమ్ సక్సెస్ అయ్యేవి. శతమానంభవతి సినిమా తర్వాత శర్వానంద్ మార్కెట్ ఒక్కసారిగా పెరిగిపోయింది. గ్యాప్ లేకుండా చాలా ఆఫర్లు వచ్చాయి. అయితే శర్వా మాత్రం తొందర పడకుండా డిఫరెంట్ గా ఉండే మంచి కథలను మాత్రమే సెలెక్ట్ చేసుకుంటూ వచ్చాడు.

వరుస అపజయాలు
మారుతి దర్శకత్వంలో చేసిన మహానుభావుడు సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో విజయాన్ని అందుకోవడంతో ఆ తర్వాత శర్వానంద్ కు కొన్ని ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ ల నుంచి కూడా మంచి ఆఫర్లు వచ్చాయి అతనిపై భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టేందుకు కూడా పలు నిర్మాణ సంస్థలు ఆసక్తి చూపించాలి. అయితే శర్వా మాత్రం మాత్రం మహానుభావుడు సినిమా తర్వాత మళ్లీ ఆ స్థాయిలో సరైన విజయాన్ని అందుకోలేదు. ప్రతి సినిమాకు కూడా అతను కొత్తగా ట్రై చేస్తున్నాడు కానీ అవి కూడా అంతగా వర్కవుట్ అవ్వడంలేదు. విడుదలకు ముందు మంచి హైప్ క్రియేట్ చేస్తున్న శర్వానంద్ విడుదల తర్వాత మాత్రం ఒకసారి డౌన్ అయిపోతున్నాడు.

ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాతో..
అయితే ఈసారి ఆడవాళ్లు మీకు జోహార్లు అనే సినిమాతో ఎలాగైనా మంచి విజయాన్ని అందుకోవాలని శర్వానంద్ పవర్ఫుల్ గా సిద్ధమయ్యాడు. నేను శైలజ చిత్రలహరి వంటి సినిమాలతో మంచి విజయాలను సొంతం చేసుకున్న దర్శకుడు కిషోర్ తిరుమల తెరకెక్కించిన ఈ సినిమాపై ఓ వర్గం ప్రేక్షకులు మంచి అంచనాలు ఉన్నాయి. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం కూడా మంచి అయితే క్రియేట్ చేయబడింది.

బడ్జెట్ ఎంతంటే?
ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. శర్వానంద్ గతంలో వరుసగా ఆరు సినిమాలతో అపజయాలను ఎదుర్కొన్నప్పటికీ కూడా నిర్మాతలు ఈ సినిమా కోసం 14 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. నాన్ థియేట్రికల్ గా కూడా ఈ సినిమాకు కాస్త లాభాలు రావడంతో బాక్సాఫీసు వద్ద కాస్త క్లిక్ అయినా కూడా నిర్మాతలకు మంచి ప్రాఫిట్స్ లభించినట్లే.

టార్గెట్ ఎంతంటే?
ఇక ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అలాగే ఓవర్సీస్ లో అన్ని ఏరియాల్లో కలుపుకొని 15.7 50 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు సమాచారం. వరుస అపజయాలు ఎదుర్కొన్నప్పటికీ కూడా శర్వానంద్ సినిమాకు మంచి బిజినెస్ డీల్స్ లభించాయానే చెప్పాలి. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అవ్వాలంటే 16 కోట్ల వరకు షేర్ కలక్షన్స్ అందుకోవాల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications











