Aadu 3 Box Office Collectons: ధురంధర్ 2ను దెబ్బ కొట్టిన ఆడు 3.. మలయాళ మూవీకి ఎన్ని కోట్లంటే?

మలయాళ సినీ రంగంలో ప్రముఖ నిర్మాణ సంస్థలు కావ్య ఫిలింస్, ఫ్రైడే ఫిలిం హౌస్ బ్యానర్లపై నిర్మాతలు విజయ్ బాబు, వేణు కున్నప్పిల్లి నిర్మాణంలో మిధున్ మ్యాన్యుయేల్ థామస్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఆడు 3. గతంలో ఆడు సిరీస్‌లో వచ్చిన రెండు ఫ్రాంచైజీలు భారీ విజయాన్ని అందుకొన్నాయి. ఈ క్రమంలో భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రంలో స్టార్ హీరో జయసూర్య, విజయ్ బాబు, సన్నీ వేన్, జైలర్ ఫేమ్ వినాయకన్, సైజు కురుప్, ధర్మాజన్, హరికృష్ణన్, భగత్ మ్యాన్యుయేల్ తదితరులు నటించారు.

ఈ చిత్రానిిక షాన్ రెహ్మాన్ మ్యూజిక్, అఖిల్ జార్జ్ సినిమాటోగ్రఫి, డాన్ విన్సెంట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, లిజో పాల్ ఎడిటింగ్ విభాగాలను పర్యవేక్షించారు. మార్చి 19వ వరల్డ్ వైడ్‌గా రిలీజైన ఈ సినిమా భారీ విజయం వైపు దూసుకెళ్తున్నది. కేరళలో, యూఏఈ లాంటి ప్రాంతాల్లో ధురంధర్ 2 సినిమా ధీటుగా ఎదుర్కొంటూ వసూళ్లను సాధిస్తున్నది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఈ సినిమా వసూలు చేస్తున్న కలెక్షన్లు ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

Aadu 3 Box Office
పునర్జన్మ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సినిమాకు కంటెంట్, నటీనటుల పెర్ఫార్మెన్స్ పాజిటివ్ అంశాలుగా మారాయి. కథ, కథనాలు గ్రిప్పింగ్‌గా ఉండటంతో ఆడియెన్స్ ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారనే టాక్ వినిపిస్తున్నది. ఈ సినిమాకు పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ ఖర్చులనీ కలిపి ఈ సినిమాను సుమారుగా 25 కోట్ల రూపాయలతో నిర్మించారు అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా సుమారుగా 15 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది.

ఈ సినిమా తొలి ఆట నుంచే భారీ వసూళ్లను కేరళ బాక్సాఫీస్ వద్ద నమోదు చేస్తున్నది. ఈ చిత్రం తొలి రోజు 6 కోట్ల రూపాయలు, రెండో రోజు 6.7 కోట్ల రూపాయలు, మూడో రోజు 7.25 కోట్ల రూపాయలు వసూలు చేసింది. మలయాళంలో ఈ మూవీ ధురంధర్ 2 ప్రభంజనానికి అడ్డుకట్ట వేసింది. దాంతో ఈ సినిమా మొత్తంగా 20 కోట్ల రూపాయలు కేవలం కేరళలోనే వసూలు చేయడం రికార్డుగా చెప్పుకోవాలి అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఇక తెలుగు, కన్నడ, తమిళంలో కూడా ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణను చూరగొన్నది. తెలుగులో 20 లక్షల రూపాయలు, తమిళనాడులో 50 లక్షల రూపాయలు, కన్నడలో 2 కోట్ల రూపాయలు, మిగితా రాష్ట్రాల్లో 50 లక్షల రూపాయలు వసూలు చేసింది. కేరళేతర రాష్ట్రాల్లో 3.2 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఇండియాలో ఈ సినిమా 23.2 కోట్లకుపైగా కలెక్షన్లను రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఈ సినిమా యుద్ద భయాలను కూడా వెనక్కి నెట్టి గల్ఫ్ దేశాల్లోను, నార్త్ అమెరికాలోన భారీ వసూళ్లను సాధిస్తున్నది. నార్త్ అమెరికాలో ఈ సినిమా 400K డాలర్లు వసూలు చేసింది. గల్ఫ్‌లో 100K, యూకే, యూరప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇతర దేశాల్లో భారీగా కలెక్షన్లను నమోదు చేస్తున్నది. ఈ చిత్రం ఓవర్సీస్‌లో ఇప్పటి వరకు 3 మిలియన్ డాలర్లు అంటే సుమారుగా 27 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. దాంతో ఈ చిత్రం మూడు రోజుల్లోనే 50 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X