twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆగడు ఫస్ట్ వీకెండ్(3 డేస్) కలెక్షన్ ఎంత?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘ఆగడు' చిత్రం ఓపెనింగ్స్ అదరగొట్టింది. తొలి మూడు రోజుల్లో రికార్డు స్థాయి వసూల్లు రాబట్టింది. సినిమాపై డివైడ్ టాక్ వచ్చినప్పటికీ...మహేష్ బాబు మేనియాతో ముందే అడ్వాన్స్ బుకింగ్ జరిగిపోవడంతో కలెక్షన్ల వర్షం కురిసింది.

    ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం....తొలి మూడు రోజుల్లో ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో కలిసి దాదాపు 25 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. తొలి రోజు రూ. 11.20 కోట్లు, సెకండ్ డే 7.20 కోట్లు, థర్డ్ డే 6.60 కోట్లు వసూలు చేసింది. అయితే ఇది ట్రేడ్ వర్గాల అంచనా మాత్రమే. అఫీషియల్ సమాచారం వెలువడాల్సి ఉంది.

    Aagadu first weekend collections

    తెలుగు సినిమా చరిత్రలో రికార్డు స్థాయిలో ఈ చిత్రాన్ని దాదాపు 2వేల థియేటర్లలో విడుదల చేసారు. ‘దూకుడు' కాంబినేషన్ అయిన శ్రీను వైట్ల-మహేష్ బాబు సినిమా కావడంతో అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. దీంతో అధిక ధర చెల్లించి ప్రీమియర్ షోలోలు చూసేందుకు సైతం ప్రేక్షకులు ఎగబడ్డారు.

    మహేష్ మేనియా ఎంతలా ఉందంటే....ఫస్ట్ వీకెండ్ టికెట్స్ అన్ని అడ్వాన్డ్స్‌గా బుక్ అయ్యాయి. అయితే సినిమా విడుదలైన తర్వాత మాత్రం ప్రేక్షకులు ఆశించిన స్థాయిలో లేదనే టాక్ వచ్చింది. రొటీన్ కమర్షియల్ మసాలా దట్టించారని, సినిమాలో కొత్తదనం లేదని, రొటీన్‌గా ఉందని పలువురు అభిప్రాయ పడ్డారు.

    English summary
    Super-hit duo Mahesh Babu and director Srinu Vaitla's second combo movie Aagadu, which released in theatres across the globe on September, has received an earth-shattering opening everywhere.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X