‘ఆగడు’ వరల్డ్ వైడ్ ఫస్ట్ డే కలెక్షన్ ఎంత?
హైదరాబాద్: భారీ అంచనాలతో భారీగా థియేటర్లలో విడుదలైన మహేష్ బాబు - శ్రీను వైట్ల తాజా సినిమా ‘ఆగడు'...ఓపెనింగ్స్ కూడా భారీగా సాధించింది. ప్రిమియర్ షోలతో కలిసి ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం తొలి రోజు దాదాపు రూ. 12 నుండి 15 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఏరియా వైజ్ కలెక్షన్ల వివరాలు తెలియాల్సి ఉంది.

తెలుగు సినిమా చరిత్రలో రికార్డు స్థాయిలో ఈ చిత్రాన్ని దాదాపు 2వేల థియేటర్లలో విడుదల చేసారు. ‘దూకుడు' కాంబినేషన్ అయిన శ్రీను వైట్ల-మహేష్ బాబు సినిమా కావడంతో అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. దీంతో అధికర ధర చెల్లించి ప్రీమియర్ షోలోలు చూసేందుకు సైతం ప్రేక్షకులు ఎగబడ్డారు.
మహేష్ మేనియా ఎంతలా ఉందంటే....ఫస్ట్ వీకెండ్ టికెట్స్ అన్ని అడ్వాన్డ్స్‌గా బుక్ అయ్యాయి. అయితే సినిమా విడుదలైన తర్వాత మాత్రం ప్రేక్షకులు ఆశించిన స్థాయిలో లేదనే టాక్ వచ్చింది. రొటీన్ కమర్షియల్ మసాలా దట్టించారని, సినిమాలో కొత్తదనం లేదని, రొటీన్‌గా ఉందని పలువురు అభిప్రాయ పడ్డారు.


Click it and Unblock the Notifications











