twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఈ వారం :ఏది హిట్? ..ఏది ఫట్?

    By Srikanya
    |

    హైదరాబాద్‌: టాలీవుడ్‌లో పెద్ద హీరోల సినిమాలు లేక కళ్లు కాయలు కాసేలా చూస్తున్న తెలుగు సినీ ప్రేక్షకులకు కనువిందు చేసేందుకు రెండు భారీ అనువాద చిత్రాలు ఒకే రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. బాలీవుడ్‌లో తెరకెక్కిన ధూమ్‌-3, కోలీవుడ్‌ సినిమా బిరియాని తెలుగు వెర్షన్‌లో రాష్ట్రవ్యాప్తంగా విడుదలయ్యాయి. ఈ రెండింటిలో బిర్యాని యావరేజ్ టాక్ తెచ్చుకున్నా కలెక్షన్స్ వర్కవుట్ కాలేదు. ధూమ్‌-3 మాత్రం మాత్రం పెద్ద హిట్ అయ్యింది.

    ధూమ్ 3 కలెక్షన్స్ విషయానికి వస్తే... ఒక సినిమా రూ.వంద కోట్లు వసూళ్లు సాధించడమంటే మాటలు కాదు! అయితే బాలీవుడ్‌ చిత్రాలకు ఇటీవల ఇది చాలా సాధారణ విషయమైపోయింది. ఏ సినిమా విడుదలైనా రూ.వంద కోట్లు ఎన్ని రోజుల్లో వసూలు చేసింది? అనే మాట్లాడుకొంటున్నారు. 'చెన్నై ఎక్స్‌ప్రెస్‌' తరవాత దాని రికార్డును ఎవరూ చెరపలేరని అంతా అనుకున్నారు. ఆ సినిమా 3.5 రోజుల్లోనే (పెయిడ్‌ షోస్‌ + 3 రోజుల వసూళ్లు) రూ.100 కోట్లు వసూళ్లు సాధించింది.

    Dhoom -3 and Biryani

    హృతిక్‌ రోషన్‌ నటించిన 'క్రిష్‌-3' మీద అందరూ ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆ సినిమాకు ఈ మార్కును దాటడానికి నాలుగు రోజులు పట్టింది. ఇక ఏం మేజిక్‌ చేయాలన్నా అమీర్‌ ఖాన్‌ 'ధూమ్‌-3'నే అనుకొంటున్న సమయంలో కచ్చితంగా చేసి చూపించాడు అమీర్‌ ఖాన్‌. ఆయన సత్తాను మరోమారు బాక్సాఫీసు దగ్గర నిరూపించుకొన్నారు. ఈ సినిమా కేవలం 3 రోజుల్లో రూ.100 కోట్ల మార్కును చేరుకొని అత్యంత తక్కువ కాలంలో బిలియన్‌ క్లబ్బులో చేరిన చిత్రంగా రికార్డు నెలకొల్పింది. ఇక 2 రోజుల్లో ఏదైనా సినిమా ఈ రికార్డును బ్రేక్‌ చేస్తుందేమో వేచి చూడాలి. అంటే ఒక రోజుకు రూ.50 కోట్లు వసూళ్లు సాధించాలి.

    భారతీయ చలన చిత్ర చరిత్రలోనే తొలిసారిగా ఐమ్యాక్స్‌ ఫార్మాట్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేశారు.
    మన రాష్ట్రంలో హిందీ, తెలుగు భాషల్లో ఈ చిత్రం విడుదలైంది. తెలుగు వెర్షన్‌ పంపిణీ హక్కులను 'ఈగ' నిర్మాత సాయి కొర్రపాటి భారీ మొత్తం చెల్లించి దక్కించుకున్నారు.

    బిరియాని విషయానికి వస్తే.. కార్తీ, హన్సిక జంటగా తెరకెక్కిన చిత్రం 'బిరియాని'. స్టుడియోగ్రీన్‌ పతాకంపై నిర్మితమైన ఈ చిత్రానికి వెంకట్‌ప్రభు దర్వకత్వం వహించారు. తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. కార్తీకి టాలీవుడ్‌లో మంచి మార్కెట్‌ ఉండటంతో ఆయన నటించిన సినిమాలన్నీ ఇక్కడ విడుదలయ్యేలా నిర్మాతలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గతంలో ఆయన నటించిన ఆవారా, నా పేరు శివ చిత్రాలు తెలుగులో విజయాలు సాధించాయి. 'బిరియాని' కూడా తెలుగులో మరో విజయాన్ని సాధించిపెడుతుందని కార్తీ నమ్మకంతో ఉన్నారు. అయితే నిరాశపరిచింది.

    English summary
    Aamir Khan-starrer Dhoom: 3 has grossed Rs 107.61 crore in the first three days of its release and the collection of the sleek action thriller includes earnings from the Tamil and Telugu versions. And with this Aamir Khan has officially beat Shah Rukh Khan-- SRK's Chennai Express was the fastest to enter the Rs 100 crore club in four days of its release. Trade pundits predict that it will amass Rs 250 crore by the end of this week.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X