డివైడ్ టాక్... అదిరిపోయే కలెక్షన్స్

ముంబై: 'ధూమ్‌-3'... ఈ సినిమా సాధిస్తున్న వసూళ్లు చూసి బాలీవుడ్‌ సంభ్రమాశ్చర్యాలకు లోనవుతోంది. నిన్నమొన్నటిదాకా 'చెన్నై ఎక్స్‌ప్రెస్‌', 'క్రిష్‌-3' సినిమాల వసూళ్లు చూసి అంతా ఔరా అన్నారు. ఇప్పుడు వాటిని దాటి 'ధూమ్‌-3' హంగామా చేస్తోంది. గతంలో వచ్చిన 'చెన్నై ఎక్స్‌ప్రెస్‌', 'క్రిష్‌-3'లు తొలివారం వరుసగా రూ.157 కోట్లు, రూ.167 కోట్లు మాత్రమే (దేశీయంగా) వసూలు చేశాయి. ప్రపంచవ్యాప్తంగానూ 'ధూమ్‌-3' మొదటివారంలోనే ఏకంగా రూ.272 కోట్లు వసూలు చేసింది.

అమీర్‌ఖాన్, అభిషేక్‌బచ్చన్, కత్రినాకైఫ్ ప్రధాన పాత్రల్లో నటించిన 'ధూమ్-3' చిత్రం కలెక్షన్ల పరంగా సంచలనాలను సృష్టిస్తోంది. గతంలో వున్న బాలీవుడ్ రికార్డులన్నింటినీ చెరిపి చేస్తూ కేవలం ఎనిమిదిరోజుల్లోనే 300కోట్ల మైలురాయిని దాటి సరికొత్త రికార్డును సృష్టించింది. 100కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం హిందీతో పాటు తమిళ, తెలుగు భాషల్లో దేశవ్యాప్తంగా దాదాపు 4000 కేంద్రాల్లో విడుదలైంది.

Aamir Khan

ఈ సినిమా ఒక్క హిందీలోనే 211 కలెక్షన్లు సాధించిందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. తెలుగు, తమిళ భాషల్లో 10కోట్లకు పైగానే కలెక్షన్లను సాధించింది. విదేశాల్లో కూడా ఈ చిత్రం 100 కోట్ల వసూళ్లు రాబట్టిందని చెబుతున్నారు. కలెక్షన్లు ఓ మోస్తరుగా కొనసాగినా మరో పదిరోజుల్లో 400కోట్ల మైలురాయిని 'ధూమ్-3' అందుకుంటుందని చిత్ర వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. యశ్‌రాజ్ ఫిల్మ్ పతాకంపై ఆదిత్యచోప్రా నిర్మించిన ఈ చిత్రానికి విజయ్‌కృష్ణ ఆచార్య దర్శకత్వం వహించారు. ఈ నెల 20న ప్రేక్షకులముందుకొచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X