Don't Miss!
- News ఏప్రిల్ లో అంగారక యోగం: ఈ మూడు రాశుల వారికి ఆర్థిక నష్టాలు, ఊహించని కష్టాలు
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్‌మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్‌లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్‌లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
చైనాలో అమీర్ హవా.. సీక్రెట్ సూపర్‌స్టార్ సునామీ.. దంగల్ రికార్డు బ్రేక్
Recommended Video
బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్ట్ అమీర్ ఖాన్ చైనాలో మరోసారి సత్తా చాటాడు. దంగల్ చిత్రంతో కలెక్షన్ల సునామీ సృష్టించిన అమీర్ ఖాన్ మళ్లీ చైనా బాక్సాఫీస్‌పై వసూళ్ల పంజాను విసిరాడు. శుక్రవారం రిలీజైన సీక్రెట్ సూపర్‌స్టార్ చిత్రం రికార్డు స్థాయి కలెక్షన్లను వసూలు చేయడం ట్రేడ్ అనలిస్టులను నివ్వెరపరుస్తున్నాయి. సీక్రెట్ సూపర్‌స్టార్ సినిమా కలెక్షన్ల వివరాలు మీ కోసం..
చైనాలో సీక్రెట్ సూపర్‌స్టార్
అమీర్ ఖాన్ నటించి, నిర్మించిన సీక్రెట్ సూపర్‌స్టార్ చిత్రం 2017లో రిలీజైంది. అద్భుతమైన ప్రశంసలు వచ్చినప్పటికీ ఆ చిత్రం దేశంలో వసూళ్లపరంగా రికార్డులను సాధించలేకపోయింది. అయితే ఈ చిత్రం చైనాలో వసూళ్ల సునామీని సృష్టిస్తున్నది.
|
తొలిరోజున రూ.43.35 కోట్లు
సీక్రెట్ సూపర్‌స్టార్ చిత్రం చైనాలో తొలి రోజున రూ.43.35 కోట్లు (6.79 మిలియన్ డాలర్లు) వసూలు చేసింది. ఈ వసూళ్లు దంగల్ సాధించిన మొదటి రోజు కలెక్షన్ల కంటే ఎక్కువ. ఈ కలెక్షన్లు అమీర్ ఖాన్ స్టామినాను మరోసారి తెలియజెప్పాయి అని ట్రేడ్ అనలిస్టు తరుణ్ ఆదర్శ్ వెల్లడించారు.
కలెక్షన్ల మ్యాజిక్
పీకే, దంగల్ చిత్రాలు అమీర్‌ఖాన్‌కు మంచి గుడ్‌విల్‌ను సంపాదించిపెట్టాయి. దాంతో సీక్రెట్ సూపర్‌స్టార్ సినిమాకు అది లాభంగా మారింది. ఈ చిత్రంలో అతిథి పాత్ర పోషించినా.. ప్రేక్షకులను భారీ సంఖ్యలో రప్పించడానికి దోహదపడింది. అమీర్ ఖాన్ సినిమా కలెక్షన్లపరంగా మరోసారి మ్యాజిక్ చేసింది అని తరణ్ ఆదర్ష్ పేర్కొన్నారు.
సీకెట్ర్ సూపర్‌స్టార్‌పై భారీ అంచనాలు
సీక్రెట్ సూపర్‌స్టార్ సినిమా రిలీజ్‌కు ముందు చైనాలోని ప్రముఖ ఆన్లైన్ టికెటింగ్ పోర్టల్, రేటింగ్ వెబ్సైట్ మావోయాన్.కామ్ భారీగా అంచనాలు వేసింది. ఈ చిత్రం తొలి రోజునే 7 మిలియన్ల డాలర్లు వసూలు చేస్తుంది అని పేర్కొన్నది. దాదాపు ఆ వెబ్సైట్ అంచనాలను సీక్రెట్ సూపర్‌స్టార్ చిత్రం అందుకోవడం గమనార్హం.
రికార్డులపై సూపర్‌స్టార్ గురి
సీక్రెట్ సూపర్‌స్టార్ చిత్రం సుమారు 84 మిలియన్ డాలర్లు అంటే రూ.540 కోట్లు వసూలు చేస్తుంది అని మావోయాన్.కామ్ అంచనా వేసింది. ఈ చిత్రం భారత్, ఓవర్సీస్ మార్కెట్లో కేవలం రూ.150 కోట్లతోనే సరిపెట్టుకొన్నది.
దంగల్ సినిమా కంటే
చైనాలో దంగల్ చిత్రం రికార్డు కలెక్షన్లను సాధించిన సంగతి తెలిసిందే. అమీర్ ఖాన్ నటించిన ఆ చిత్రం 189 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. దంగల్ చిత్రంతో పోల్చుకుంటే సీక్రెట్ సూపర్‌స్టార్ చిత్రం బడ్జెట్ పరంగా చాలా చిన్నది.
అద్భుతమైన రేటింగ్స్
సీక్రెట్ సూపర్‌స్టార్ చిత్రానికి చైనాకు చెందిన దౌబాన్ అనే రేటింగ్ వెబ్సైట్ 10కి గాను 8.2 రేటింగ్ ఇచ్చింది. మావోయాన్ అనే వెబ్సైట్ 10 పాయింట్లకు గాను 9.6 పాయింట్లు ఇవ్వడం విశేషం.
చైనా మార్కెట్లోకి సల్మాన్‌ఖాన్
చైనాలో ఓ వైపు అమీర్ సినిమాల ప్రభంజనం కొనసాగుతుంటే.. మరో వైపు తన సత్తాను నిరూపించుకొనేందుకు సల్మాన్ ఖాన్ సిద్ధమవుతున్నాడు. దేశవ్యాప్తంగా, ఓవర్సీస్ మార్కెట్లో భజరంగీ భాయ్‌జాన్ చిత్రం కలెక్షన్ల కుంభవర్షం కురిపించింది. త్వరలోనే ఈ చిత్రం చైనాలో లిటిల్ లోలితా మంకీ కింగ్ అంకుల్ అనే పేరుతో ఫిబ్రవరిలో రిలీజ్ కానున్నది.