అక్కడ కూడా సినిమా పెద్ద ప్లాప్... బాక్సాఫీసు వద్ద పరిస్థితి ఇదీ!
అమీర్ ఖాన్, అమితాబ్ బచ్చన్, కత్రినా కైఫ్ లాంటి టాప్ స్టార్స్ నటించిన 'థగ్స్ ఆఫ్ హిందూస్థాన్' ఇండియాలో దీపావళి సందర్భంగా విడుదలై బాక్సాఫీసు వద్ద పెద్ద ప్లాప్ అయిన సంగతి తెలిసిందే. భారీ నష్టాలు మిగిల్చిన ఈ చిత్రాన్ని తాజాగా చైనాలో విడుదల చేయగా... అక్కడ కూడా ప్రేక్షకుల ఆదరణ కరువైంది.
'థగ్స్ ఆఫ్ హిందూస్థాన్' చైనా కలెక్షన్స్ గురించి ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. అమీర్ ఖాన్ గత చిత్రాలు దంగల్, సీక్రెట్ సూపర్ స్టార్ సినిమాలతో పోలిస్తే 'థగ్స్ ఆఫ్ హిందూస్థాన్' పరిస్థితి దారుణంగా ఉందన్నారు.
తొలి రోజు వసూళ్లు
చైనాలో ‘థగ్స్ ఆఫ్ హిందూస్థాన్' తొలి రోజు ప్రిమియర్ షోలతో కలసి రూ. 10.67 కోట్లు మాత్రమే రాబట్టింది. చైనా వ్యాప్తంగా 27,577 షోలు ప్రదర్శించగా... 338,601 మంది మాత్రమే సినిమా వీక్షించారట. అమీర్ ఖాన్ చైనా బాక్సాఫీస్ చరిత్రలో అత్యంత తక్కువ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా నిలిచిపోయింది.
రెండో రోజూ మారని పరిస్థితి
ఫస్ట్ డే ముగిసిన అనంతరం టాక్ అంత గొప్పగా ఏమీ లేక పోవడంతో రెండో రోజు కూడా వసూళ్లలో గ్రోత్ కనిపించలేదు. తొలి రోజు బాక్సాఫీసు చార్టులో 4వ స్థానంలో ఉన్న ‘థగ్స్ ఆఫ్ హిందూస్థాన్'.... రెండో రోజు 6వ స్థానానికి పడిపోయింది.

ప్రచారానికి వెళ్లని అమీర్ ఖాన్
ఇండియాలో ఆల్రెడీ ప్రేక్షకుల నుంచి తిరస్కరణ ఎదురవ్వడంతో అమీర్ ఖాన్ కూడా చైనా వెళ్లి ఈ చిత్రాన్ని ప్రమోట్ చేయడానికి ఆసక్తి చూపలేదు. మరో వైపు ఈ చిత్రాన్ని నిర్మించిన యష్ రాజ్ ఫిలింస్ భారీ రేటుకు డిస్ట్రిబ్యూటర్లు అమ్మారు. దీంతో చిత్ర నిర్మాణ సంస్థ సేఫ్ జోన్లోకి వెళ్లగా... చాలా మంది డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు నష్టపోయారు.

రెస్పాన్సిబిలిటీ తీసుకున్న అమీర్ ఖాన్
ఈ సినిమా పరాజయానికి పూర్తిగా తానే బాధ్యత తీసుకున్నట్లు అమీర్ ఖాన్ ఇప్పటికే ప్రకటించారు. సినిమా కోసం మేమంతా శక్తిమేర కష్టపడ్డామని. ఇలా అవుతుందని ఊహించలేదని చెబుతూ... ఆయన ప్రేక్షకులకు, అభిమానులకు క్షమాపణలు చెప్పడం గమనార్హం.


Click it and Unblock the Notifications











