Aavesham Collections: 12 రోజులుగా ఫాహద్ ఫాజిల్ బాక్సాఫీస్ ఊచకోత.. 100 కోట్ల క్లబ్‌లో ఆవేశం!

పాహద్ ఫాజిల్, ఆశీష్ విద్యార్థి, సజిన్ గోపు, ఇతర యువ హీరోలు నటించిన ఆవేశం సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబడుతున్నది. జితు మాధవన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను ఆయన సతీమణి, హీరోయిన్ నజ్రియా నాజిం,అన్వర్ రషీద్ నిర్మించారు. అన్వర్ రషీద్ ఎంటర్‌టైన్‌మెంట్, ఫాహద్ ఫాజిల్ అండ్ ఫ్రెండ్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రం 100 కోట్ల రూపాయల కలెక్షన్లకు చేరువైంది. ఈ సినిమా గత 12 రోజుల్లో సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

కాలేజీ పాలిటిక్స్, బెంగళూరులో లోకల్ గుండాయిజంను మిక్స్ చేసి రూపొందించిన ఆవేశం సినిమాను సుమారుగా 50 కోట్ల రూపాయలతో చాలా రిచ్‌గా ఖర్చుకు వెనుకాడకుండా తెరకెక్కించారు. ఈ సినిమా 35 కోట్ల రూపాయలు వస్తే బ్రేక్ ఈవెన్‌గా నిర్ణయించారు. అయితే ఈ సినిమా తొలివారమే భారీ లాభాలను సాధించింది.

Aavesham 12 days Box Office Collections Worldwide Fahadh Faasil movie 100 Crores club

ఆవేశం సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఇండియాలో ఈ చిత్రం తొలివారం 35 కోట్ల రూపాయలను వసూలు చేసింది. రెండో వారంలో కూడా అదే జోష్‌ను కొనసాగించింది. ఈ సినిమా 9వ రోజు 3.7 కోట్ల రూపాయలు, 10వ రోజు 4.55 కోట్ల రూపాయలు, 11వ రోజు 5.15 కోట్ల రూపాయలు, 12వ రోజు 3 కోట్ల రూపాయలను వసూలు చేయడంతో 51 కోట్ల నికర వసూళ్లను నమోదు చేసింది.

ఇక రాష్ట్రాల వారీగా ఈ సినిమా వసూళ్ల లెక్కల్లోకి వెళితే.. మలయాళంలో ఈ సినిమా 40 కోట్ల రూపాయలు, తమిళంలో 5 కోట్ల రూపాయాలు, కర్ణాటకలో 4.5 కోట్ల రూపాయలు, తెలుగు రాష్ట్రాల్లో 50 లక్షల రూపాయలు, ఇతర రాష్ట్రాల్లో 1.6 కోట్ల రూపాయలను వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 51 కోట్ల మైలురాయిని ఇండియాలో దాటింది.

Aavesham 12 days Box Office Collections Worldwide Fahadh Faasil movie 100 Crores club

ఇక ఆవేశం మూవీకి ఓవర్సీస్ మార్కెట్‌లో గ్రాండ్‌గా వసూళ్లను సాధిస్తున్నది. ఈ సినిమా ఇప్పటి వరకు 45 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. అమెరికా, ఇతర దేశాల్లో కలిపి మొత్తంగా 5 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఇంకా స్ట్రాంగ్‌గా ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద వసూళ్లను సాధిస్తున్నది.

ఆవేశం మూవీ ట్రేడ్ అంచనాలను ఎదురిస్తూ 100 కోట్ల రూపాయల క్లబ్‌కు చేరువైంది. ఈ సినిమా కేవలం 12 రోజుల్లోనే రికార్డు స్థాయిలో వసూళ్లను సాధించడంతో ప్రేక్షకుల నాడి అంతుపట్టకుండా మారింది. ఇక ఇదే ఊపు కొనసాగిస్తే ఈ సినిమా 150 కోట్ల రూపాయల వసూళ్లను దాటే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X