Aavesham Box Office 50 కోట్లకు చేరువగా ఆవేశం.. ఫాహద్ ఫాజిల్ మూవీకి కలెక్షన్ల వర్షం!

భారతీయ సినిమా పరిశ్రమలో మలయాళ ఫిలిం ఇండస్ట్రీ దూసుకెళ్తున్నది. 2024 ఆరంభం నుంచి వరుసగా బ్లాక్ బస్టర్ చిత్రాలతో బాక్సాఫీస్‌ను దున్నేస్తున్నది. భ్రమయుగం, ప్రేమలు, మంజుమ్మల్ బాయ్స్ లాంటి చిత్రాలు రికార్డు వసూళ్లను సాధించాయి. తాజాగా మరో రెండు సినిమాలు బ్లాక్‌బస్టర్ విజయాలను అందుకొన్నాయి. అందులో ఫాహద్ ఫాజిల్, ఆశీష్ విద్యార్థి, సజిన్ గోపు నటించిన ఆవేశం సినిమా భారీ కలెక్షన్లను సాధిస్తున్నది. ఆ సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

విలక్షణ నటుడు ఫాహద్ ఫాజిల్ కేవలం నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఆయన ఇటీవల రూపొందించిన ప్రేమలు చిత్రం బాక్సాఫీస్ వద్ద 120 కోట్ల మేర వసూళ్లను సాధించింది. తాజాగా తన సొంత బ్యానర్‌లో భార్య నజ్రియా నజీమ్ నిర్మాతగా రూపొందించిన ఆవేశం సినిమా సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తున్నది.

Aavesham 4 days Box Office Collections Worldwide Fahadh Faasil movie inching towards 50 Crores at GBOC

కేరళ నుంచి ఉన్నత విద్యను అభ్యసించాలనే కోరికతో బెంగళూరు వెళ్లిన ఓ యువకుడు గ్యాంగ్‌స్టర్‌గా ఎలా మారాడు అనే సింగిల్ పాయింట్‌తో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందింది. ఈ చిత్రాన్ని సుమారుగా 55 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే.. కనీసం 55 కోట్ల రూపాయలు వసూలు చేయాల్సిన పరిస్థితిలో బాక్సాఫీస్ జర్నీని ప్రారంభించింది.

ఆవేశం సినిమా విడుదలైన తొలి ఆట నుంచే హిట్ టాక్‌తో పాజిటివ్‌ రెస్సాన్స్ కూడగట్టుకొన్నది. ఈ సినిమా కేరళలో తొలి రోజు 3.5 కోట్ల రూపాయలు, ఇండియా వైడ్‌గా 4.5 కోట్లు వసూలు చేసింది. ఇక ప్రీమియర్ల కలెక్షన్లు, ఓవర్సీస్‌లో వసూళ్లను కలిపి ఈ సినిమా తొలి రోజు 10.5 కోట్ల రూపాయలు రాబట్టింది.

ఇక ఈ మూవీ రెండో రోజు కూడా సూపర్ స్ట్రాంగ్‌గా బాక్సాఫీస్ వద్ద కనిపించింది. రెండో రోజు కూడా 3.5 కోట్ల రూపాయలు కేరళలో రాబట్టింది. ఇండియాలోని ఇతర రాష్ట్రాల్లో 1.5 కోట్లు, ఓవర్సీస్‌లో 6 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 11.5 కోట్లు వసూలు చేసింది.

Aavesham 4 days Box Office Collections Worldwide Fahadh Faasil movie inching towards 50 Crores at GBOC

ఆవేశం మూవీకి మౌత్ టాక్ స్ట్రెడ్ కావడంతో రెండు రోజుల కంటే మూడో రోజు ఎక్కువగా వసూళ్లను రాబట్టింది. కేరళలో ఈ సినిమా 3వ రోజు 4.25 కోట్లు, ఓవర్సీస్‌లో 2.5 కోట్ల రూపాయాలు రాబట్టింది. దాంతో ఈ చిత్రం మూడో రోజు 6 కోట్ల రూపాయల కలెక్షన్లను నమోదు చేసింది. ఇక నాలుగో రోజు ఈ మూవీ 5 కోట్ల రూపాయలు రాబట్టింది.

ఫాహద్ ఫాజిల్ సినిమా కేరళలోనే రికార్డు వసూళ్లను నమోదు చేస్తున్నది. గత నాలుగు రోజుల్లో ఈ మూవీ 14 కోట్లకుపైగా కలెక్షన్లను నమోదు చేసింది. ఆంధ్రా, నైజాంలో 50 లక్షలు, తమిళనాడులో 1.4 కోట్లు, మిగితా రాష్ట్రాల్లో 70 లక్షలతో కలిపి ఇండియాలో మొత్తంగా 18 కోట్ల రూపాయలు నికరంగా వసూలు చేసింది. ఓవర్సీస్‌లో నాలుగు రోజుల్లో 22 కోట్ల రూపాయలు రాబట్టింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X