Aavesham Collections కలెక్షన్లతో పాహద్ ఫాజిల్ మూవీ సంచలనం.. ఎన్ని కోట్ల వసూళ్లంటే?
ప్రముఖ నటుడు, పుష్ప ఫేమ్ ఫాహద్ ఫాజిల్ నటించిన తాజా చిత్రం ఆవేశం. జితు మాధవన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను ఆయన సతీమణి, హీరోయిన్ నజ్రియా నాజిం,అన్వర్ రషీద్ నిర్మించారు. అన్వర్ రషీద్ ఎంటర్‌టైన్‌మెంట్, ఫాహద్ ఫాజిల్ అండ్ ఫ్రెండ్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రంలో సాజిన్ గొపు, హిప్స్‌టెర్, మిథన్ జై శంకర్,రోషన్ సాన్వాస్ తదితరులు నటించారు.ఏప్రిల్ 11వ తేదీనప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? కలెక్షన్లు ఎంత అనే వివరాల్లోకి వెళితే...
ఆవేశం సినిమా కథ విషయానినికి వస్తే..కేరళ నుంచి ఇంజినీరింగ్ చదువుకోవడానికి వెళ్లిన కొందరు విద్యార్థులు తమ సినియర్లతో గొడవ పడుతారు.అయితే వారి మధ్య గొడవలు తీవ్రస్థాయికి చేరుకోవడం వల్ల అవి కొత్తరూపం తీసుకొని గ్యాంగ్ వార్‌కు దారి తీస్తాయి. ఆ క్రమంలో హీరో అజ్జు బెంగళూరుకు చెందిన గ్యాంగ్ స్టర్‌కు చేరువ అవ్వడమే కాకుండా తను కూడా గ్యాంగ్‌స్టర్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందనే విషయమే ఆవేశం సినిమా కథ.

ఇక ఈ మూవీని టాలెంటెడ్ ఆర్టిస్టులు, టెక్నిషియన్స్‌తో పలుప్రాంతాల్లో షూట్ చేశారు. దాంతో ఈ సినిమా బడ్జెట్ భారీగానే పెరిగిపోయింది. అన్ని ఖర్చులతో కలిపి ఈ సినిమాను సుమారుగా 50 కోట్ల రూపాయలతో చాలా రిచ్‌గా ఖర్చుకు వెనుకాడకుండా తెరకెక్కించారు. ఈ సినిమా 35 కోట్ల రూపాయలు వస్తే బ్రేక్ ఈవెన్‌గా నిర్ణయించారు..
భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు కేరళలో విశేషమైన స్పందన లభిస్తున్నది. కోచి, త్రివేండ్రం,బెంగళూరు,చెన్నై, కోజికోడ్, త్రిచూర్,కొల్లాం,కొట్టాయం, అలెప్పి, హైదరాబాద్, ఢిల్లీ ప్రాంతాల్లో 60 నుంచి 80 శాతం ఆక్యుపెన్సీ నమోదు అయింది. దాంతో గ్రాండ్ ఓపెనింగ్స్ నమోదయ్యాయి..

ఆవేశం సినిమాకు భారీ ఓపెనింగ్స్ లభించాయి.ఈ సినిమా మంజుమ్మల్ బాయ్స్ కంటే ఎక్కువగా వసూళ్లను సాధించింది. తొలి రోజు ఈ సినిమా కేరళ, దక్షిణాదిలో మొత్తంగా కలిపి 4 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక ఓవర్సీస్‌లో తొలి రోజు 1 కోటి రూపాయలు రాబట్టింది. దాంతో ఈ సినిమా 5 కోట్ల రూపాయలు రాబట్టింది.
ఇక రెండో రోజు కూడా భారీ వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రం 2.5 కోట్ల రూపాయలు ఇండియాలో కలెక్ట్ చేస్తుందని, అలాగే ఓవర్సీస్‌లో మరో 1 కోటి రూపాయలు రాబడుతుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. ఇక ఈ సినిమా రాబోయే రోజుల్లో సంచలన వసూళ్లను నమోదు చేస్తుందని అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











