AAY Collections: ఆయ్ మూవీకి భారీ ఓపెనింగ్స్.. బన్నీ వాస్‌కు ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?

ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ GA2 బ్యానర్‌పై లెజెండరీ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో ప్రముఖ నిర్మాత బన్నీ వాస్, విద్యా కొప్పినీడు నిర్మాతగా రూపొందిన చిత్రం ఆయ్. నార్నే నితిన్, నయన్ సారిక, వినోద్ కుమార్, మైమ్ మధు, కసిరెడ్డి రాజ్‌కుమార్, అంకిత్ కోయా తదితరులు ఆ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. తొలి చిత్ర దర్శకుడిగా పరిచయమైన అంజీ కే మణిపుత్ర దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఆగస్టు 15వ తేదీన రిలీజైంది. ఈ చిత్రం బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్, సాధిస్తున్న కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

మ్యాడ్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నార్నె నితిన్‌తోపాటు అంతా కొత్తవాళ్లు, యువ నటీనటులు నటించిన ఈ సినిమాను క్వాలిటీ కోసం రాజీ లేకుండా నిర్మించారు. గోదావరి జిల్లాలోని అందాలను అద్బుతంగా కెమెరాలో బంధించారు. యాక్టర్ల రెమ్యునరేషన్, టెక్నిషియన్ల పారితోషికం, ప్రమోషన్స్‌తో కలిపి ఈ సినిమా బడ్జెట్ 8 కోట్ల రూపాయలు అయినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

AAY Day 1 Box Office Collections Worldwide Bunny Vasu movie good start at GBOC

ఇక ఆయ్ సినిమాను బిజినెస్ జరగలేదు. సొంతంగా గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ నేరుగా థియేటర్లలో రిలీజ్ చేసింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గె‌ట్‌ను 8 కోట్ల షేర్‌గా నిర్ణయించారు. ఇక డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్, ఆయ్ లాంటి భారీ సినిమాల పోటీ కారణంగా స్క్రీన్లు పెద్ద సంఖ్యలో లభించకపోవడంతో తెలుగు రాష్ట్రాల్లో 200 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.

ఇక లవ్ ట్రాక్‌తో సాగే ఈ సినిమాకు కసిరెడ్డి, అంకిత్ కోయా కామెడీ ట్రాక్ అద్బుతంగా పండింది. ప్రేమను జయించాలంటే పారిపోయి పెళ్లి చేసుకోవడం కాదు.. పెద్దల మనసులు గెలుచుకోవాలే బ్యాక్ డ్రాప్‌తో ఫ్రెండ్ షిప్ అనేది జీవితంలో ఎంత విలువైనదో చెప్పే సందేశంతో రూపొందింది. 20 నిమిషాలపాటు సాగే క్లైమాక్స్ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లింది.

ఆయ్ సినిమా రిలీజ్ తర్వాత తొలి ఆట నుంచే భారీ రెస్పాన్స్ ఆడియెన్స్ నుంచి రాబట్టుకొన్నది. పాజిటివ్ టాక్‌తో ఈ మూవీ రానున్న రోజుల్లో భారీ వసూళ్లను రాబట్టే అావకాశం ఉంది. యూఎస్‌లో కూడా పరిమితంగా స్క్రీన్లలో ప్రదర్శిస్తున్నారు. అన్ని చోట్ల స్క్రీన్ల సంఖ్య పెరగడానికి అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

AAY Day 1 Box Office Collections Worldwide Bunny Vasu movie good start at GBOC

ఇక తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 20 లక్షల నికరంగా, 1.25 గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక అమెరికాలో ఈ సినిమాకు పాజిటివ్ టాక్ అందుకొన్నది. దాంతో ఈ చిత్రం నార్త్ అమెరికాలో 50 లక్షల నికర వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ సినిమా తొలి రోజు 2 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

More from Filmibeat

Read more about: aay bunny vasu box office
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X