అభిమన్యుడు లేటెస్ట్ కలెక్షన్స్: సైలెంట్‌గా.. అంతకు అంతా లాగేశారు, లాభాల పంట!
విశాల్ సమంత జంటగా నటించిన అభిమన్యుడు చిత్రం విశాల్ కెరిర్ బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా డిక్లేర్ అయిపోయింది. ఈ చిత్రం బయ్యర్లకు అందించిన లాభాలు చూస్తే బిగ్గెస్ట్ హిట్ అని అనాల్సిందే. సైబర్ క్రైం, హ్యాకింగ్, బ్యాంకింగ్ వ్యవస్థ వంటి అంశాలతో ఈ చిత్రం తెరకెక్కింది. తమిళంలో ముందుగా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. జులై 1 విడుదలైన ఈ చిత్రం దిగ్విజయంగా మూడు వారాలు పూర్తి చేసుకుంది. ఈ చిత్ర తాజా వసూళ్ల వివరాలు బయ్యర్లకు లాభాల పంట పండించే విధంగా ఉన్నాయి.
Recommended Video


చాలా కాలం తరువాత
పందెం కోడి చిత్రంతో దక్షిణాదిలో పాపులర్ అయిన హీరో విశాల్ నుంచి సూపర్ హిట్ చిత్రం వచ్చి చాలా కాలమే అవుతోంది. విశాల్ విజయ దాహాన్ని అభిమన్యుడు చిత్రం తీర్చిందని చెప్పొచ్చు. దర్శకుడు మిత్రం ఈ చిత్రాన్ని ఆకట్టుకునే కథనంతో నడిపించారు.

తమిళంలో కూడా
అభిమన్యుడు చిత్రం ముందుగా తమిళంలో విడుదలైంది. మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్ర తెలుగు థియేట్రికల్ రైట్స్ సుమారు 4 కోట్లవరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది.

మూడువారాల కలెక్షన్స్
అభిమన్యుడు చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడవవారం ముగిసేసమయానికి 7.9 కోట్ల షేర్ రాబట్టినట్లు తెలుస్తోంది. చాలా కాలంగా విశాల్ కు హిట్ లేకపోయూయినా తెలుగు ప్రేక్షకులనుంచి మంచి ఆధారణే లభించిందని చెప్పొచ్చు.

లాభాల పంట
అభిమన్యుడు చిత్రం బయ్యర్లకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది. నిజజీవితంలో బ్యాంకింగ్ వ్యవస్థ వలన సామాన్యులు ఎదుర్కొంటున్న సమస్యలనే ఈ చిత్రంలో చూపించడంతో ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు.


Click it and Unblock the Notifications











