బాక్సాఫీస్: దూసుకుపోతున్న 'అభిమన్యుడు', కాలం అలా కలిసొచ్చింది.. సమంత లెగ్ మహిమ!

Recommended Video

Abhimanyudu Movie Box Office Collections

తెలుగు పందెం కోడి విశాల్ చాలా కాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. అతడి విజయదాహాన్ని అభిమన్యుడు చిత్రం తీర్చింది. సమంత, విశాల్ జంటగా నటించిన అభిమన్యుడు చిత్రం జూన్ 1 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తమిళంలో ఇప్పటికే ఈ చిత్రం విడుదలై మంచి విజయం సాధించింది. తెలుగులో కూడా ఈ చిత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఫలితంగా బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రానికి మంచి వసూళ్లు దక్కుతున్నాయి. అదే సమయంలో ఈ సినిమాకు టైం కూడా బాగా కలసి వచ్చింది. రంగస్థలం, మహానటి చిత్రం తరువాత సమంత బుట్టలో మరో హిట్ పడింది.

చాలా కాలం తరువాత పందెం కోడి సత్తా

చాలా కాలం తరువాత పందెం కోడి సత్తా

హీరో విశాల్ పేరు ఈ మధ్య ఎక్కువగా న్యూస్ లో వినిపిస్తోంది. తమిళ చిత్ర పరిశ్రమలో విశాల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. కానీ విశాల్ సినిమాలు మాత్రం విజయానికి నోచుకుని చాలా కాలమే అవుతోంది. ఎట్టకేలకు పందెం కోడి అభిమన్యుడు చిత్రంతో సత్తా చాటాడు.

సైబర్ వార్

సైబర్ వార్

అభిమన్యుడు చిత్రంలో విశాల్ పవర్ ఫుల్ ఆర్మీ ఆఫీసర్ గా నటించాడు. సమంత హీరోయిన్ గా నటించింది. సీనియర్ హీరో అర్జున్ కీలక పాత్రలో నటించారు. సైబర్ వార్ నేపథ్యంలో దర్శకుడు మిత్రన్ ఈ చిత్రాన్ని ఆసక్తికరమైన థ్రిల్లర్ గా తెరకెక్కించారు.

బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లు

బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లు

జూన్ 1 న ఈ చిత్రాలు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచే అభిమన్యుడు చిత్రానికి పాజిటివ్ టాక్ సొంతం అయింది. ఫలితంగా ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో 6 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేయడం విశేషం. డబ్బింగ్ చిత్రంగా వచ్చిన అభిమన్యుడు ఈ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టడం విశేషమే.

ఆ రెండూ ఫట్

ఆ రెండూ ఫట్

అభిమన్యుడు చిత్రంతో పాటు నాగార్జున, ఆర్జీవీ ఆఫీసర్ చిత్రం, రాజ్ తరుణ్ రాజుగాడు చిత్రాలు జూన్ 1 న విడుదలయ్యాయి. ఈ రెండు చిత్రాలకు తొలి షో నుంచే నెగిటివ్ టాక్ రావడంతో అభిమన్యుడు చిత్రానికి కలసి వచ్చిందని చెప్పొచ్చు.

సమంత గోల్డెన్ లెగ్

సమంత గోల్డెన్ లెగ్

సమంతకు ఈ వేసవి సీజన్ లో ఇది మూడవ హిట్ మూవీ. రంగస్థలం చిత్రంలో సమంత బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఆ వచ్చిన మహానటి చిత్రం కూడా విజయం సాధించింది. తాజగా అభిమన్యుడు చిత్రంతో మూడో హిట్ ఈ వేసవిలో దక్కించుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X