‘అత్తారింటికి దారేది’వల్ల గవర్నమెంట్ కూ లాభం

By Srikanya

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ హీరోగా స్టార్ రైటర్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై.లి.పతాకంపై భారీ చిత్రాల నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన చిత్రం'అత్తారింటికి దారేది'. రిలీజైన రోజు నుంచి కలెక్షన్స్ దుమ్ము రేపిన ఈ చిత్రం వల్ల గవర్నమెంట్ కు ప్రత్యక్ష్యంగా అంటే పన్నుల రూపంగా ఈ సంవత్సరం ఎక్కువ లాభం వచ్చిందని చెప్తున్నారు. ఈ చిత్రం భారీగా ప్రభుత్వానికి వినోదపు పన్ను కట్టింది. దాదాపు నాలుగు నుంచి ఏడు కోట్లు వరకూ టాక్స్ ఉండి ఉంటారని అంచనాలు వేస్తున్నారు. కేవలం ఆంధ్రాలోనే కాదు ఉత్తరాదిని కూడా ఈ చిత్రం బాగానే వర్కవుట్ అవటంతో బాగానే టాక్స్ పేచేసి ఖజనాకు లాభం చేకూర్చింది.

చిత్రం నిర్మాత బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్ మాట్లాడుతూ... ''ఈ సినిమా విడుదలకు ముందు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయో అందరికీ తెలిసిందే. క్లిష్టసమయంలో పవన్‌, త్రివిక్రమ్‌లు అండగా నిలబడ్డారు. పైరసీకి గురైనా.. రికార్డు వసూళ్లు దక్కించుకోవడం ఆనందంగా ఉంది. ఈ సినిమా వంద కోట్లు సాధిస్తుందా? అని అందరూ అడుగుతున్నారు. ఆ మైలు రాయిని చేరుకొనే అవకాశాలున్నాయి. తెలుగు సినీ చరిత్రలో 'మగధీర' ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకొంది. ఆ చిత్ర నిర్మాణంలో నేను భాగస్వామిని. ఇప్పుడు 'అత్తారింటికి దారేది' కూడా వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ సినిమాకీ నేనే నిర్మాతను. ఇలా రెండు మేటి చిత్రాల్లో భాగం పంచుకొన్నందుకు ఆనందంగా ఉంది'' అన్నారు.

Attarintiki Daredi
సమంత మాట్లాడుతూ ''యాభై రోజుల్లో సాధించాల్సిన వసూళ్లు ఇరవై అయిదు రోజుల్లోనే దక్కాయి. ఇంత మంచి సినిమాలో అవకాశం దక్కినందుకు ఆనందంగా ఉంది. నేను పవన్‌ కల్యాణ్‌ అభిమానిని. ఆయనతో పనిచేయడం ఆనందంగా అనిపించింది. ఇటీవల కృతజ్ఞతల సభలో పవన్‌ నన్ను మెచ్చుకొన్నారు. అదే పెద్ద అవార్డుగా భావిస్తున్నా. పవన్‌, త్రివిక్రమ్‌, బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌.. ఈ ముగ్గురూ పడిన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కింది'' అని చెప్పింది.

ఇక ఈ చిత్రం త్వరలో బుల్లితెరపై కూడా కనిపించి ప్రేక్షకులను అలరించనుంది. మాటీవి వారు ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ తీసుకున్నారు. ఈ చిత్రాన్ని 2014 సంక్రాంతి స్పెషల్ గా వేయనున్నారని సమాచారం. దాదాపు తొమ్మిది కోట్లు వరకూ ఈ రైట్స్ కోసం వెచ్చించినట్లు ట్రేడ్ వర్గాల్లో వినపడింది. ఈ సినిమాకు వచ్చే టీఆర్పిలు,వాటి ద్వారా వచ్చే యాడ్స్ తో బాగా లాభపడే అవకాసం ఉందని టీవీ వర్గాలల్లో చెప్పుకుంటున్నారు. జనవరి 4 వ తేదికి ఈ చిత్రం వంద రోజులు పూర్తి చేసుకుంటుంది. వంద రోజులు పూర్తి చేసుకున్న పది రోజుల్లోనే టీవీలో వస్తూండటంతో ఓ రేంజిలో టీఆర్పీలు వచ్చే అవకాసాలు ఉన్నాయి.

పవన్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటించారు. నదియా, కోట శ్రీనివాస్, అలీ, బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ తదితరులు నటించారు. ఈచిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : పీటర్ హెయిన్స్, ఆర్ట్ : రవీందర్, కో ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X