'ఊసరవెల్లి' 50 రోజుల సెంటర్లు అవే
దసరా రోజు విడుదలైన జూ ఎన్టీఆర్ చిత్రం ఊసరవెల్లి నవంబర్ 24వ తేదీకి యాభై రోజులు పూర్తి చేసుకుంటోంది. అయితే కేవలం నాలుగు సెంటర్లలలో మాత్రమే ఈ చిత్రం కంటిన్యూగా యాభై రోజులు పూర్తి చేసుకుంది. ఆ సెంటర్లు.. హైదరాబాద్, హిందూపూర్, అనంతపూర్, వైజాగ్ మాత్రమే. ఇక ఈ చిత్రం డివైడ్ టాక్ తెచ్చుకున్నా కలెక్షన్స్ పరంగా మొదటి వారం మాత్రం స్టడీగా ఉంది. ఎన్టీఆర్ కి భాక్సాఫీస్ వద్ద ఉన్న స్టామినా ఏమిటనేది ఊసరవెల్లి పూర్తిగా చెప్పింది. అయితే సినమా బాగోపోవటంతో తర్వాత డ్రాప్ అయ్యాయి. ట్రేడ్ లెక్కల ప్రకారం మొదటి వారంలో 56,46,01,000 గ్రాస్, టోటల్ షేర్ 39,23,06,667 వసూలు చేసింది. ఇక ఈ చిత్రం యాభై రోజుల పంక్షన్ ని జరుపుతారా లేదనేది ఎన్టీఆర్ అభిమానుల్లో ప్రశ్నగా మారింది. జరిపికే ఎక్కడ జరుపుతారు.. దానికి సంభందించిన ప్రకటన కూడా ఏమీ రాలేదని వారు ఎదురుచూస్తున్నారు.
ఇక ఊసరవెల్లి భాక్సాఫీస్ వద్ద అప్పుడే వేడి చల్లారిపోయిన సంగతి తెలిసిందే. అయితే చాలా మంది హీరోలు చాలా టైమ్ దాకా ఇంకా తమ సినిమా హిట్ అని, కావాలని నెగిటివ్ ప్రచారం చేస్తున్నారనే భ్రమలో ఉంటూంటారు. అయితే ఎన్టీఆర్ మాత్రం మొదటి రోజు మార్నింగ్ షోకే పరిస్దితి అర్దం చేసుకున్నాడని సమాచారం. అందుకు తగినట్లుగా వెంటనే యాక్షన్ ప్లాన్ సమకూర్చుకుని మీడియాకి ఇంటర్వూలు ఇచ్చి కలెక్షన్స్ డ్రాప్ అవ్వకుండా చూసాడు. అంతేగాక తన అభిమానులు ఈ సినిమాతో నీరసపడతారని గమనించిన ఎన్టీఆర్.. దమ్ము చిత్రంలో వారికి నచ్చే మసాలాలు ఉంటాయని, విందు భోజనంలా ఉంటుందని హామీ ఇచ్చాడు. అంతేగాక తనకు వచ్చిన ఒళ్లుని తగ్గించుకుని తర్వాత చిత్రంలో నిజంగానే కరెంట్ తీగలాగ కనపడతానని హామీ ఇచ్చాడు. అదే ఇంకో హీరో అయితే రియలైజ్ అవ్వటానికి చాలా టైమ్ పట్టేదని ఎన్టీఆర్ వాస్తవానకి చాలా దగ్గరగా ప్రాక్టికల్ గా ఉండే మనిషిని అందరూ మెచ్చుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











