‘శ్రీరామ రాజ్యం’ బిజెనెస్ పొజీషన్ ఏంటి?
నవంబర్ 17వ తేదీన విడుదలకానున్న బాలకృష్ణ పౌరాణిక చిత్రం 'శ్రీరామ రాజ్యం" బిజినెస్ నార్త్ అమెరికాతో సైతం అన్ని దేశాల్లోనూ మంచిగా జరిగిందని చెప్తున్నారు.ఓవర్ సీస్ సెంటర్లలో బాగా బిజెనెస్ చేసిన తెలుగు చిత్రంగా చెప్తున్నారు నిర్మాత యలమంచి సాయిబాబా. ఈ చిత్రం లోగో, కార్ స్టిక్కర్స్,పోస్టర్స్, సీడీలు మేజర్ సెంటర్స్ కు పంపుతున్నాం.అక్టోబర్ 31వ తేదీన శ్రీరామరాజ్యం ఫస్ట్ లుక్ పోస్టర్స్ హైదరాబాద్ లో గ్రాండ్ గా విడుదల చేస్తున్నాం అన్నారు నిర్మాతలు. మేము బిజినెస్ పాయింటాఫ్ వ్యూలోనే ఈ చిత్రాన్ని ప్రమోట్ చేయటం లేదు.మన సంప్రదాయాలు, మన విలువలు సజీవంగా ఉండే విధంగా తీయబడ్డ ఈ చిత్రం మరింతగా ఎవేర్ నెస్ ప్రజల్లో రావాలనే ప్రయత్నం చేస్తున్నాం అన్నారు. ఎగ్జిబిటర్స్ కానీ, డిస్ట్రిబ్యూటర్స్ కానీ కారు ర్యాలీలు ఏర్పాటు చేస్తే మేము వారికి సపోర్టు అందచేస్తాం.
అన్నివిధాలా అండగా ఉంటామని తెలిపారు. ఈ భక్తిరసాత్మక చిత్రం 'శ్రీరామరాజ్యం"కి బాపు దర్శకత్వం వహించారు. శ్రీరాముడిగా బాలకృష్ణ, సీతా దేవిగా నయనతార కనిపించనున్నారు. అలాగే ఎన్ని తరాలు మారినా అందరికీ ఆదర్శం నీలమేఘ శ్యాముడి చరిత్ర. పితృవాక్య పరిపాలకుడిగా కీర్తి పొందిన ఆ శ్రీరాముడిని మరో సారి వెండి తెరపై ఆవిష్కరిస్తున్నాం. జనరంజక పాలనను అందించిన శ్రీరాముడి దక్షతను బాపు రమ్యంగా ఆవిష్కరించారు. రాముడి పాత్రలో బాలకృష్ణ ఒదిగిపోయారు. రాముడి గెటప్ లో బాలకృష్ణ ఎలా ఉంటారనే ఆత్రుత నందమూరి అభిమానులతో పాటు ఇతర ప్రేక్షకులకు కూడా ఎక్కువగా ఉంది. ఈ మహత్తర దృవ్యకావ్యాన్ని భగవత్సంకల్పంతో తెరకెక్కించాం. చిత్రాన్ని నవంబర్ 17న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాం" అన్నారు.


Click it and Unblock the Notifications











