‘ఊకొడతారా.. ఉలిక్కి పడతారా' బడ్జెట్ ఎంత?
హైదరాబాద్: బాలకృష్ణ అతిధిపాత్రలో రూపొందిన చిత్రం 'ఊకొడతారా..ఉలిక్కి పడతారా' ఈ నెల 27న విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో రూపొందిందని, సుమారు ఆరు కోట్ల రూపాయలు కేవలం చిత్రంలోని గంధర్వ మహల్ సెట్ కే ఖర్చు పెట్టామని చెప్తున్న నేఫధ్యంలో ఈ సినిమాకి బడ్జెట్ ఎంతై ఉంటుందనే చర్చ ప్రారంభమైంది. ఈ చిత్రానికి 23కోట్లు ఖర్చైందని విశ్వసనీయ సమాచారం. ఇక ఈ చిత్రం బాలకృష్ణకు బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అని చెప్తున్నారు.
ఇక ఇప్పటికే 'ఊకొడతారా.. ఉలిక్కి పడతారా' ట్రైలర్స్ రిలీజై మంచి క్రేజ్ తెచ్చుకున్నాయి. మంచు ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై పద్మశ్రీ డా.ఎం. మోహన్ బాబు సమర్పణలో మంచు మనోజ్, దీక్షాసేత్ హీరో హీరోయిన్లుగా శేఖర్ రాజా దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. దర్శకుడు శేఖర్ రాజా చెప్పిన పాత్రలోని ఉదాత్తతకు ఆకర్షితులై 'ఊ కొడతారా.. ఉలిక్కిపడతారా'లో నటించడానికి నందమూరి బాలకృష్ణ అంగీకరించారు. గత నెలలో ఈ చిత్రం ఆడియో విడుదలై మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే.
అలాగే... మంచు మనోజ్ మాట్లాడుతూ..'ఊ కొడతారా ఉలిక్కిపడతారా' 27వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. నాలుగేళ్ల మా టీమ్ కల నిజమవుతోంది. మా టీమ్ ని ఎంకరేజ్ చేయండి అని ట్వీట్ చేసారు. అలాగే మా సినిమా కు విపరీతమైన క్రేజ్ రావటంతో డిస్ట్రిబ్యూటర్స్ ప్రింట్స్ పెంచమని అడుగుతున్నారు అన్నారు. ఇది ప్రింట్స్ పెంచటం అనేది పూర్తిగా డిస్ట్రిబ్యూటర్స్ ఛాయిస్ అని మంచు మనోజ్ ఈ సందర్భంగా చెప్పారు.
బాలకృష్ణ ఈ ప్రాజెక్టుపై బాగా నమ్మకంగా ఉన్నారు. ఆయన మాట్లాడుతూ... 'శ్రీరామరాజ్యం, ఊ కొడతారా ఉలిక్కిపడతారా చిత్రాలలో నటించే అవకాశం రావడం అదృష్టం. ఓ వరం' అని అన్నారు. అలాగే ఊ కొడతా రా... ఉలిక్కి పడతారా చిత్రం భారీ ఎత్తున తెరకెక్కిం దన్నారు. ఈ చిత్రాన్ని మంచు లక్ష్మీప్రసన్న నిర్మించింది. ఈ చిత్రం కోసం రూ.6 కోట్ల వ్యయంతో గంధర్వ మహల్ సెట్‌ను వేసినట్లు చెప్పారు. మంచు మనోజ్ మరో హీరోగా చక్కగా నటించారని బాలకృష్ణ ప్రశంసించారు. ఊ కొడతారా... ఉలిక్కి పడతారా అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే చిత్రం అవుతుందన్నారు. బాలకృష్ణ, ప్రభు, మనోజ్, దీక్షాసేథ్, లక్ష్మీ ప్రసన్న, సోనూసూద్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈచిత్రానికి సంగీతం బెబో శశి.


Click it and Unblock the Notifications











