Abraham Ozler Collections జయరాం మూవీ బడ్జెట్ 6 కోట్లు.. ఎన్ని కోట్ల కలెక్షన్లు వసూలు చేసిందంటే?
మలయాళంలో యువ దర్శకుడు మిథున్ మాన్యుయేల్ థామస్ దర్శకత్వంలో తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయమైన నటుడు జయరాం, అనూమ్ మీనన్, అనస్వర రాజన్, అర్జున్ అశోకన్, జగదీష్ తదితరులు నటించిన చిత్రం అబ్రహం ఓజ్లర్. ఇర్షాద్ ఎం హసన్, మిథున్ మ్యాన్యుయేల్ థామస్ నిర్మించిన ఈ సినిమా పొంగల్ కానుకగా జనవరి 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజై భారీ కలెక్షన్లు వసూలు చేస్తున్నది. ఈ సినిమా బడ్జెట్, ప్రీ రిలీజ్ బిజినెస్, కలెక్షన్లు, బ్రేక్ ఈవెన్ విషయాల్లోకి వెళితే..
సైకాలాజికల్ మెడికల్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన అబ్రహం ఓజ్లర్ చిత్రాన్ని సాధారణమైన బడ్జెట్‌తో నిర్మించారు. ఈ సినిమాను సుమారుగా 6 కోట్ల రూపాయలతో రూపొందించారు. ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిసి 7 కోట్ల బడ్జెట్ అని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నారు. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్‌ను 8 కోట్లుగా వ్యాల్యూ కట్టారు.

అబ్రహం ఓజ్లర్ సినిమా 8 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ యాత్రను ప్రారంభించింది. ఈ సినిమాకు భారీ రెస్పాన్స్ ఉండటంతో మలయాళంలో 500 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఓవర్సీస్‌లో ఈ సినిమాకు 100 స్క్రీన్లలో విడుదల చేశారు. మిగితా ప్రాంతాల్లో మరో 250 స్క్రీన్లలో ప్రదర్శిస్తున్నారు. దాంతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 850 స్క్రీన్లలో రిలీజైంది.

అబ్రహం ఓజ్లర్ సినిమా తొలి రోజు 3 కోట్ల రూపాయలు, రెండో రోజు 2.25 కోట్లు, మూడో రోజు 3 కోట్ల రూపాయలు, నాలుగో రోజు 3 కోట్ల రూపాయలు, ఐదో రోజు 2 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో 5 రోజుల్లో 13.25 కోట్ల వసూళ్లను రాబట్టింది.
ఇక అబ్రహం ఓజ్లర్ సినిమా ఆరో రోజు కలెక్షన్ల అంచనా విషయానికి వస్తే... బాక్సాఫీస్ వద్ద 1 కోటి రూపాయలు వసూలు చేసే అవకాశం ఉంది. ఈ సినిమా ఆక్యుపెన్సీ సుమారుగా 25 శాతం నమోదైంది. అత్యధికంగా చెన్నైలో 65 శాతం, కొట్టాయం, బెంగళూరు, కోజికోడ్, త్రిచూర్, అలెప్పి తదితర ప్రాంతాల్లో 30 శాతానికి పైగా ఆక్యుపెన్సీ కనిపించింది.

అబ్రహం ఓజ్లర్ 6 రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం ఓవర్సీస్‌లో 10 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ సినిమా కేరళలో 13 కోట్లకుపైగా కలెక్షన్లను రాబట్టింది. దాంతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 23 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. ఇప్పటీకే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను అధిగమించి లాభాల్లోకి చేరుకొన్నది.
నటుడు జయరాం నటించిన అబ్రహం ఓజ్లెర్ సినిమా 7వ రోజు కూడా నిలకడగా వసూళ్లను సాధించింది. ఈ చిత్రం బుధవారం 50 లక్షల గ్రాస్ వసూళ్లను సాధించింది. దాంతో ఈ సినిమా 23.5 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.


Click it and Unblock the Notifications











