Ace Closing Collections: విజయ్ సేతుపతి కెరీర్‌లోనే భారీ డిజాస్టర్.. ఏస్ మూవీకి ఎన్ని కోట్ల నష్టమంటే?
మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, రుక్మిణి వసంత్ జంటగా నటించిన తాజా చిత్రం ఏస్. యోగిబాబు, దివ్య పిళ్లై, బబ్లూ పృథ్వీరాజ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి అర్ముగ కుమార్ స్వయంగా నిర్మించి దర్శకత్వం వహించారు. 7Cs ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్నది. ఈ చిత్రానికి కరణ్ బీ రావత్ సినిమాటోగ్రఫిని, జస్టిన్ ప్రభాకర్ మ్యూజిక్ అందించారు. సామ్ సీఎస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. మే 23వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? కలెక్షన్లు ఎంత వసూలు చేస్తుంది? అనే వివరాల్లోకి వెళితే..
ఏస్ సినిమా కథ డిమాండ్ మేరకు మలేషియా, దుబాయ్, కౌలాలంపూర్‌లోని అందమైన ప్రదేశాల్లో షూట్ చేశారు. అలాగే విజయ్ సేతుపతి, రుక్మిణి వసంత్ లాంటి యాక్టర్లు ఉండటం, టాప్ టెక్నిషియన్స్ ఈ సినిమాకు పనిచేయడం వల్ల బడ్జెట్ పెరిగిపోయింది. ఈ సినిమాను మొత్తంగా 40 కోట్ల రూపాయలతో భారీగా తెరకెక్కించారు. మహారాజ్, విడుదలై 2 సినిమా తర్వాత ఈ చిత్రం రావడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దాంతో ఈ సినిమా ప్రమోషన్స్, అలాగే ట్రైలర్, టీజర్ లాంటివి మూవీపై క్రేజ్ పెంచేలా చేశాయి. దాంతో ఈ సినిమా బిజినెస్ కూడా భారీగా జరిగింది. ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ సుమారుగా తమిళం, కన్నడ, తెలుగులో కలిపి 20 కోట్ల రూపాయలుగా జరిగింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

భారీ అంచనాలతో రీలీజైన ఏస్ సినిమా తమిళనాడుతోపాటు తెలుగు, ఓవర్సీస్ మార్కెట్ బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపలేకపోయింది. ఈ సినిమాపై క్రిటిక్స్‌తోపాటు సాధారణ ప్రేక్షకులు కూడా పెదవి విరవడంతో కలెక్షన్లపై భారీగా ప్రభావం పడింది. విడుదలై 2 సినిమా కంటే ఈ చిత్రం 90 శాతం వరకు తక్కువగా ఓపెనింగ్స్ సాధించింది. ఈ సినిమా వారాంతంలో అంతంత మాత్రమే కలెక్షన్లను రాబట్టింది. ఆ తర్వాత వసూళ్లను పెంచడంలో చతికిల పడింది అని ట్రేడ్ నిపుణులు తెలిపారు.
ఇండియాలో ఏస్ సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తమిళనాడు, కన్నడ, తెలుగు రాష్ట్రాల్లో కలుపుకొని.. ఈ సినిమా తొలి రోజు 1 కోటి రూపాయల వసూలు చేసింది. రెండో రోజు 1.7 కోట్లు, మూడో రోజు 1.75 కోట్ల రూపాయలు, నాలుగో రోజు ఈ సినిమా 80 లక్షలు, ఐదో రోజు 60 లక్షల రూపాయలు, 6వ రోజు 50 లక్షలు రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా ఇండియాలో సుమారుగా 6.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని సాక్ నిల్క్ డేటా వెల్లడించింది.
ఏస్ సినిమాకు వచ్చిన కలెక్షన్లు ఎక్కువ భాగం తమిళనాడులో నమోదైనవేనని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. తెలుగు రాష్ట్రాల్లో 50 లక్షల రూపాయలు, కన్నడలో 40 లక్షల రూపాయలు వసూలు చేసిందని వెల్లడించారు. ఈ సినిమా థియేట్రికల్‌గా దాదాపు తన రన్‌ను ముగించే స్థితిలో ఉంది. ఈ సినిమా విజయ్ సేతుపతి కెరీర్‌లో అత్యంత డిజాస్టర్‌గా నిలిచిందనే చెప్పాలి. ఈ సినిమా సుమారుగా 10 నుంచి 12 కోట్లకుపైగానే నష్టాల్లో ముగిసే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.


Click it and Unblock the Notifications











