Ace Movie Box Office: ఏస్ మూవీ బాక్సాఫీస్ కలెక్షన్లు.. విజయ్ సేతుపతి సినిమాకు కలెక్షన్లు ఎన్ని కోట్లంటే?
మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, రుక్మిణి వసంత్ జంటగా నటించిన తాజా చిత్రం ఏస్. యోగిబాబు, దివ్య పిళ్లై, బబ్లూ పృథ్వీరాజ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి అర్ముగ కుమార్ స్వయంగా నిర్మించి దర్శకత్వం వహించారు. 7Cs ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్నది. ఈ చిత్రానికి కరణ్ బీ రావత్ సినిమాటోగ్రఫిని, జస్టిన్ ప్రభాకర్ మ్యూజిక్ అందించారు. సామ్ సీఎస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. మే 23వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. ఈ సినిమా బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? కలెక్షన్లు ఎంత వసూలు చేస్తుంది? అనే వివరాల్లోకి వెళితే..
ఏస్ సినిమా కథ డిమాండ్ మేరకు ఎక్కువ భాగం విదేశాల్లో చిత్రీకరించారు. మలేషియా, దుబాయ్, కౌలాలంపూర్‌లోని అందమైన ప్రదేశాల్లో షూట్ చేశారు. అలాగే విజయ్ సేతుపతి, రుక్మిణి వసంత్ లాంటి యాక్టర్లు ఉండటం, టాప్ టెక్నిషియన్స్ ఈ సినిమాకు పనిచేయడం వల్ల బడ్జెట్ పెరిగిపోయింది. ఈ సినిమాను మొత్తంగా 40 కోట్ల రూపాయలతో భారీగా తెరకెక్కించారు అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఇక మూవీ విజయ్ సేతుపతి నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం మహారాజ్ మూవీ తర్వాత రావడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దాంతో ఈ సినిమా ప్రమోషన్స్, అలాగే ట్రైలర్, టీజర్ లాంటివి మూవీపై క్రేజ్ పెంచేలా చేశాయి. దాంతో ఈ సినిమా బిజినెస్ కూడా భారీగా జరిగింది. ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ సుమారుగా తమిళం, కన్నడ, తెలుగులో కలిపి 20 కోట్ల రూపాయలుగా జరిగింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
తమిళంలో ఏస్ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఈ సినిమాకు పేలవంగా వసూళ్లు నమోదయ్యాయి. మార్నింగ్ షోకు 20 శాతం ఆక్యుపెన్సీ, మధ్యాహ్నం ఆటలకు 25 శాతం, ఫస్ట్ షోలకు 25 శాతం, సెకండ్ షోలకు 30 శాతం ఆక్యుపెన్సీ తమిళంలో నమోదు అయ్యాయి. పాండిచ్చేరి, దిండిగల్, త్రిచీ, చెన్నై లాంటి ప్రాంతాల్లో అధికంగా ఆక్యుపెన్సీ కనిపించింది. ఇక తెలుగులో కూడా అంతంత మాత్రంగానే సినిమాకు ఆక్యుపెన్సీ నమోదైంది. మార్నింగ్ షోకు 20 శాతం, మధ్యాహ్నం 20 శాతం, ఫస్ట్ షోకు 20 శాతం నమోదైంది.
ఇదిలా ఉండగా, తెలుగు, కన్నడ రాష్ట్రాల్లో కంటే తమిళంలో ఎక్కువగా కలెక్షన్లు నమోదు అయ్యాయి. ఈ సినిమా తొలి రోజు 1 కోటి రూపాయల నెట్ కలెక్షన్లు, 2 కోట్ల గ్రాస్ వసూళ్లు నమోదు చేస్తుందని అంచనా వేశారు. తెలుగులో 25 లక్షల రూపాయలు, కన్నడలో 25 లక్షలు, తమిళంలో 50 లక్షల రూపాయలు వరకు వసూలు చేస్తుందనే అంచనాకు ట్రేడ్ వర్గాలు వచ్చాయి. ఓవర్సీస్ డేటా ఇంకా రావాల్సి ఉంది.
ఏస్ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ కావాలంటే.. ఈ సినిమా 20 కోట్ల షేర్, 40 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది. ఈ సినిమా లాంగ్ రన్ కొనసాగి.. మంచి కలెక్షన్లు నమోదు చేస్తే గానీ ఈ సినిమాకు బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉంటుందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ సినిమా రానున్న రోజుల్లో ఏ విధంగా కలెక్షన్లు రాబడుతుందో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











