twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Acharya ఎఫెక్ట్.. డైరెక్టర్ కొరటాల శివకు మరో తలనొప్పి.. ఆఫీస్ ఎదుట బయ్యర్ల ఆందోళన!

    |

    మెగాస్టార్ చిరంజీవి - రామ్ చరణ్ కలిసి నటించిన మొదటి చిత్రం ఆచార్య సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అప్పటివరకు అపజయం ఎరుగని దర్శకుడు కొరటాల శివ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరపైకి తీసుకు వచ్చిన ఆచార్య సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించిన విధంగా నష్టాలను కలుగజేసింది. అయితే దర్శకుడు కొరటాల శివపై ఇప్పుడు ఆ ప్రభావం తీవ్రంగా చూపిస్తున్నట్లు అర్థమవుతొంది. ఇటీవల సినిమాకు సంబంధించిన బయ్యర్లు దర్శకుడిపై తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అసలు ఏం జరిగింది అనే వివరాల్లోకి వెళితే..

    ఆచార్య తో..

    ఆచార్య తో..

    వలస విజయాలతో టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మంచి కమర్షియల్ దర్శకుడిగా గుర్తింపును అందుకున్న కొరటాల శివ ఆచార్య ముందు వరకు కూడా ప్రతి సినిమాతో నిర్మాతలకు మంచి లాభాలను అందించాడు. అంతేకాకుండా డిస్ట్రిబ్యూటర్స్ కూడా అతని ద్వారా మంచి లాభాలను అందుకున్నారు. అయితే ఆచార్య సినిమాకు వచ్చేసరికి ఆయన అంచనాలు ఒక్కసారిగా తారుమారయ్యాయి.

    ఆ విషయంలో కొరటాల శివ

    ఆ విషయంలో కొరటాల శివ

    కొరటాల శివ సాధారణంగా తన ప్రతి సినిమాకు కూడా సినిమా బిజినెస్ విషయంలో కూడా ప్రత్యేకంగా నిర్ణయాలు తీసుకుంటారు అని ఒక టాక్ అయితే ఇండస్ట్రీలో వినిపిస్తూ ఉంటుంది. ప్రత్యేకంగా పంపిణీదారులతో మాట్లాడి ఆయనే ప్రీ బిజినెస్ విషయంలో కూడా చర్చలు జరుపుతారు అని సమాచారం.. చాలా సందర్భాల్లో ఆయన మిత్రులకు కూడా తన సినిమాల ద్వారా లాభాలు వచ్చే విధంగా కొరటాల శివ సహాయపడ్డారు.

    తీవ్రంగా నష్టాలు

    తీవ్రంగా నష్టాలు

    ఆచార్య సినిమా విడుదలైన తర్వాత మాత్రం ఊహించని విధంగా దారుణమైన ఫలితాన్ని అందుకుంది. అసలు ఏ మాత్రం కలెక్షన్స్ అందుకోలేకపోయింది. దాదాపు 70 కోట్ల వరకు నష్టాలు మిగిల్చింది అని టాక్ వచ్చిన విషయం తెలిసిందే. పెట్టిన పెట్టుబడిలో సగానికి సగం కూడా వెనక్కి రాకపోవడంతో సినిమాను నమ్ముకున్న బయ్యర్లు అందరూ కూడా తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది.

    ఇదివరకే మెగాస్టార్ సహాయం

    ఇదివరకే మెగాస్టార్ సహాయం

    ఆచార్య సినిమాకు పెద్దగా పారితోషికం తీసుకోకుండానే హీరోలు అలాగే దర్శకుడు సినిమాకు పని చేసినట్లు నిర్మాత ఆ మధ్య క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే భారీ స్థాయిలో నష్టపోయిన కొంతమంది ఎగ్జిబిటర్స్ కు ఇదివరకే మెగాస్టార్ చిరంజీవి కొంత నష్టాలను పూరించే విధంగా సహాయపడినట్లు కూడా టాక్ వచ్చింది.

    కొరటాల ఆఫీస్ దగ్గర ఆందోళన?

    కొరటాల ఆఫీస్ దగ్గర ఆందోళన?

    అయితే కొరటాల శివ పై మరికొంతమంది తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నట్లుగా తెలుస్తోంది. సీడెడ్ బయ్యర్, సెకండరీ బయ్యర్లు గత రాత్రి నుంచి కొరటాల శివ ఆఫీసు దగ్గర బైఠాయించినట్లు సమాచారం. 15 కోట్ల నష్టానికి ఎంత వెనక్కు ఇస్తారో ఇప్పుడే తేల్చాలని లేదంటే మెగస్టార్ చిరంజీవి దగ్గరే తేల్చుకుంటామని కూడా హెచ్చరిక చేసినట్లు తెలుస్తోంది.

    కొరటాల రియాక్షన్?

    కొరటాల రియాక్షన్?

    అయితే ఈ విషయంలో ఇంకా కొరటాల శివ నుంచి ఎలాంటి క్లారిటీ అయితే రాలేదు. కానీ అందరికి సహాయ పడే విధంగా కొరటాల శివ ఒక ఆలోచనకు వచ్చినట్లుగా తెలుస్తోంది. తన ప్రతి సినిమాకు కూడా అందరికీ లాభం చేకూర్చే విధంగా ఆలోచించే కొరటాల శివ ఇప్పుడు ఆర్థిక విషయాల్లో కొత్త తరహా తలనొప్పులు ఎదుర్కొంటున్నారు. మరి ఈ విషయంలో కొరటాల నుండి ఎలాంటి వివరణ వస్తుందో చూడాలి.

    English summary
    Acharya ceded buyers demanding for a settlement of 15Cr Loss..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X