Acharya Day 1 collections: ఈ టాక్ తో ఎంత రావచ్చంటే.. మెగాస్టార్ కెరీర్ బెస్ట్.. కానీ?
టాలీవుడ్ ఇండస్ట్రీలో త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత మళ్లీ మరొక సినిమా భారీ స్థాయిలో సక్సెస్ అందుకోవాలని రెడీ అయ్యింది. మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ తేజ్ కలిసి నటించిన బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ ఆచార్య నేడు ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైంది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ఓ వర్గం ప్రేక్షకులు అయితే అంచనాలు గట్టిగానే ఉన్నాయి. అయితే ఈ సినిమాకు కొంత నెగిటివ్ టాక్ కూడా వస్తోంది. అంచనాలను అందుకోలేక పోయింది అని కూడా అంటున్నారు. ఇక ఆ సంగతి పక్కన పెడితే ఈ సినిమా మొదటిరోజు బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకోవచ్చు అనే వివరాల్లోకి వెళితే..

బడ్జెట్ ఎంతంటే?
రామ్ చరణ్ తేజ్ మెగాస్టార్ చిరంజీవి కలిసి నటించిన మొట్ట మొదటి బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ ఆచార్య గత ఏడాది విడుదల కావాల్సింది. కానీ కరోనా పరిస్థితుల కారణంగా ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ తో కలిసి మ్యాట్నీ మూవీస్ ఎంటర్టైన్మెంట్ వారు నిర్మించారు. సినిమా కోసం దాదాపు 140 కోట్ల వరకు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది.

రఅత్యధిక థియేటర్స్ లో..
మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే ఈ అత్యధిక థియేటర్స్ లో విడుదలవుతున్న చిత్రంగా ఆచార్య రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రెండు వేలకు పైగా థియేటర్లలో విడుదల చేసినట్లుగా తెలియజేశారు. అనేక సార్లు వాయిదా పడిన ఈ సినిమా మొత్తానికి శుక్రవారం రోజు మార్నింగ్ షో లతో సందడి మొదలు పెట్టింది.

ప్రీ రిలీజ్ బిజినెస్
ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ పై కూడా అనేక రకాల కథనాలు వెలువడిన విషయం తెలిసిందే. ముందుగా ఆచార్య సినిమాకు నాన్ థియేట్రికల్ గా అయితే మంచి లాభాలు వచ్చాయి. చిరంజీవి రామ్ చరణ్ తేజ నటించిన చిత్రం కాబట్టి మార్కెట్లో మంచి డిమాండ్ ఏర్పడింది. ఇక ఈ సినిమా మొత్తంగా 132.50 కోట్ల టార్గెట్ తో మార్కెట్లోకి వచ్చింది.

అడ్వాన్స్ బుకింగ్స్
సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ విడుదలకు నాలుగు రోజుల ముందే మొదలయ్యాయి. సినిమాకు ప్రత్యేకంగా టికెట్స్ హైక్స్ ఫర్మిషన్స్ కూడా లభించడంతో తప్పకుండా మంచి ఓపెనింగ్స్ వస్తాయి అని అందరూ నమ్మకంతో ఉన్నారు. కానీ సినిమా అంచనాలకు తగ్గట్టుగా అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించినంత స్థాయిలో లేవు అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఇటీవల కాలంలో విడుదలైన పెద్ద సినిమాలతో పోలిస్తే ఆచార్య సినిమాకు బుకింగ్స్ అయితే చాలా తక్కువగానే రావడం విశేషం. కేవలం హైదరాబాద్ లోనే 4.5 కోట్ల రేంజ్ లో అడ్వాన్స్ బుకింగ్స్ నమోదవడం కొంత సంతోషించాల్సిన విషయం.

మెగాస్టార్ కెరీర్ లోనే..
ఇక ప్రస్తుతం ఉన్న బజ్ ప్రకారం సినిమాకు మొదటి రోజు ఏ స్థాయిలో కలెక్షన్స్ రావచ్చు అనే విషయంలో కూడా అనేక రకాల సందేహాలు వెలువడుతున్నాయి. ఒక విధంగా మెగాస్టార్ చిరంజీవి కెరీర్లోనే ఆచార్య సినిమా బెస్ట్ ఓపెనింగ్స్ అందుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కానీ ఆచార్య సినిమా మార్కెట్ ను బట్టి అంతకు మించి అనేలా ఓపెనింగ్స్ వస్తేనే లాభాల్లోకి వస్తుంది అని చెప్పవచ్చు.
Recommended Video


మొదటి రోజు ఎంత రవచ్చు?
ఇక ఈ సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మొదటి రోజు 24 కోట్ల రేంజ్ లో షేర్ ను అందుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ పాజిటివ్ టాక్ ఉంటే మాత్రం రాత్రి వరకు ఆ కలెక్షన్స్ డోస్ పెరిగే అవకాశం ఉంటుంది. ఆ విధంగా జరిగితే కనుక సినిమా ఫైనల్ గా 28 కోట్ల వరకు కూడా ఓపెనింగ్స్ అందుకోవచ్చు అని తెలుస్తోంది. కేజిఎఫ్ 2 హడావిడి కూడా కాస్త తగ్గడం వలన ఆచార్య సినిమాకు కలిసొచ్చే అవకాశం ఉంది. మరి ఫైనల్ గా ఆచార్య సినిమా మొదటి రోజు ఎలాంటి రికార్డులను అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











