Acharya Day 2 Collections: రెండో రోజు వసూళ్ళలో ఊహించని డ్రాప్.. ఎంత వచ్చాయంటే?

మెగా ఫ్యాన్స్ సహా తెలుగు ప్రేక్షకులు అంతా విపరీతంగా ఎదురుచూస్తున్న ఆచార్య సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మార్చి 29 వ తేదిన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటిరోజు నుంచి మిశ్రమ స్పందన తెచ్చుకుంటుంది. మిశ్రమ స్పందన సంగతి ఎలా ఉన్నా మొదటిరోజు వసూళ్లు మాత్రం అద్భుతంగా వచ్చాయి. కానీ రెండో రోజు విషయంలో ఎలా ఉంటుంది అని అందరూ టెన్షన్ పడే విధంగా వసూళ్లలో భారీ డ్రాప్ కనిపించింది. తాజాగా రెండో రోజు వసూళ్ల కు సంబంధించిన ట్రేడ్ రిపోర్ట్ విడుదలైంది. మరి రెండో రోజు వసూళ్లు ఎలా ఉన్నాయో చూద్దాం పదండి.

క్రేజీ కాంబినేషన్ లో

క్రేజీ కాంబినేషన్ లో


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మెగాస్టార్ చిరంజీవి కలిసి నటించిన చిత్రం ఆచార్య. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్, రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే నటించారు అయితే కాజల్ అగర్వాల్ పాత్ర తాము అనుకున్నట్టు రాకపోవడంతో ఆమె పాత్ర తొలగిస్తున్నట్లు ముందుగానే అధికారికంగా ప్రకటించారు కొరటాల శివ. మాట్నీ ఎంటర్టైన్మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద ఈ సినిమాను నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు.

Recommended Video

Acharya Movie Public Talk మెగా ఫ్యాన్స్ ని మెప్పించిన కొరటాల | Telugu Filmibeat
భారీ ప్రీ రిలీజ్ బిజినెస్

భారీ ప్రీ రిలీజ్ బిజినెస్


భారీ ఎత్తున ఈ సినిమా విడుదల అవుతూ ఉండడంతో మార్కెట్ కూడా గట్టిగా జరిగింది. ఈ సినిమా నైజాం ప్రాంతంలో 38 కోట్లకు హక్కుల అమ్ముడు పోగా, సీడెడ్ ప్రాంతంలో 18 కోట్ల 50 లక్షల రూపాయలకు, ఉత్తరాంధ్ర ప్రాంతంలో 13 కోట్ల రూపాయలకు, ఈస్ట్ గోదావరి జిల్లాలో తొమ్మిది కోట్ల 50 లక్షల రూపాయలకు, వెస్ట్ గోదావరి జిల్లాలో ఏడు కోట్ల 20 లక్షలకు, గుంటూరు జిల్లాలో తొమ్మిది కోట్లకు, కృష్ణా జిల్లాలో 8 కోట్లకు, నెల్లూరు జిల్లాలో నాలుగు కోట్ల 30 లక్షలకు అమ్ముడుపోయింది.

 2వ రోజు ఎక్కడ ఎంత?

2వ రోజు ఎక్కడ ఎంత?


2వ రోజు ఆచార్య సినిమాకు ఏపీ, తెలంగాణ కలెక్షన్స్ లో భారీ డ్రాప్ కనిపించింది. ఏకంగా 70 శాతం వసూళ్ళలో డ్రాప్ కనిపించింది. పెరిగాయి. దీంతో నైజాంలో రూ.2.20 కోట్లు, , సీడెడ్‌లో రూ. 63 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ.53 లక్షలు, ఈస్ట్‌లో రూ. 33 లక్షలు, వెస్ట్‌లో రూ. 28 లక్షలు, గుంటూరులో రూ. 50 లక్షలు, కృష్ణాలో రూ. 43 లక్షలు , నెల్లూరులో రూ. 25 లక్షలతో 2వ రోజైన శని వారం రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 5. 15 కోట్ల షేర్ రాబట్టింది.

2 రోజుల తెలుగు రాష్ట్రాల రిపోర్ట్

2 రోజుల తెలుగు రాష్ట్రాల రిపోర్ట్


ఆచార్య సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 2 రోజుల కలెక్షన్లు ఎలా ఉన్నాయో చూద్దాం. నైజాంలో రూ. 10.10 కోట్లు, సీడెడ్‌లో రూ.5.23 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 4.14 కోట్లు, ఈస్ట్‌లో రూ.2.86 కోట్లు, వెస్ట్‌లో రూ. 3.18 కోట్లు, గుంటూరులో రూ. 4.26 కోట్లు, కృష్ణాలో రూ.2.33 కోట్లు, నెల్లూరులో రూ.2.554 కోట్లతో కలిపి రూ. 34.65 కోట్లు షేర్, రూ.48.85.50 కోట్లు గ్రాస్ వచ్చింది.

2 రోజుల వరల్డ్ వైడ్ రిపోర్ట్

2 రోజుల వరల్డ్ వైడ్ రిపోర్ట్


ఏపీ తెలంగాణలో ఆచార్య 2 రోజుల్లో రూ.34.65 కోట్లు షేర్, రూ.48.85.50 కోట్లు గ్రాస్ తెచ్చుకుంది. అలాగే, కర్ణాటక సహా భారత దేశం మొత్తం మీద ఈ సినిమాకు 2.23 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి. ఇక ఓవర్సీస్‌లో రూ. 4.20 కోట్లతో ప్రపంచవ్యాప్తంగా 2 రోజుల్లో ఆచార్య రూ. 41.07 కోట్లు షేర్‌, రూ. 62.85 కోట్లు గ్రాస్‌ వసూలు చేసింది.

 బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే?

బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే?


ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఆచార్య సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ.131.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 132.50 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 2 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ..34.65 కోట్లు షేర్, రూ.48.85.50 కోట్లు గ్రాస్ తెచ్చుకుంది. ఫలితంగా ఈ సినిమా లాభాల లోకి రావాలి అంటే ఇంకా 91.43 కోట్ల షేర్ వసూళ్లు సాధించాల్సి ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X