Acharya day 3 collections మెగా మూవీపై భారీ దెబ్బ.. మూడో రోజు ఎంత వసూలు చేసిందంటే?
మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఆచార్య చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నది. మెగా అభిమానులను, ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైన ఈ చిత్రం పేలవమైన ప్రదర్శనతో కొనసాగుతున్నది. గత రెండు రోజుల్లో ఓ మోస్తారు ఫలితాలను సాధించిన ఈ చిత్రం మూడో రోజున ఏ మేరకు కలెక్షన్లు సాధించిందంటే..

అడ్వాన్స్ బుకింగ్ కారణంగా
ఆచార్య చిత్రానికి రిలీజ్ ముందు జరిగిన అడ్వాన్స్ బుకింగ్ కారణంగా ఆదివారం కొంత గౌరవప్రదమైన వసూళ్లు నమోదయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, ఓవర్సీస్‌లో కూడా వసూళ్లు దారుణంగా డ్రాప్ అయ్యాయి. ఇటీవల కాలంలో స్టార్ హీరో మూవీ అతి తక్కువ వసూళ్లు సాధించడం ఇదే మొదటిసారి.

నెల్లూరు, కృష్ణా జిల్లాలో
తెలుగు రాష్ట్రాల కలెక్షన్ల వివరాలకు వస్తే.. నెల్లూరు జిల్లాలో మూడో రోజు 25.29 లక్షల వసూళ్లు సాధించింది. దాంతో ఈ చిత్రం నెల్లూరు జిల్లాలో గత మూడు రోజుల్లో 2.8 కోట్ల కలెక్షన్లను నమోదు చేసింది. ఇక కృష్ణా జిల్లాలో ఆచార్య చిత్రం 3వ రోజు 52 లక్షల కలెక్షన్లను సాధించింది. దాంతో గత మూడు రోజుల్లో ఈ సినిమా 3.65 కోట్లు రాబట్టింది.

గుంటూరు, గోదావరి జిల్లాలో
ఆచార్య చిత్రానికి సంబంధించిన మూడో రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లాలో ఆదివారం 25.60 కోట్ల వసూళ్లను సాధించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద గత మూడు రోజల్లో 3.74 కోట్ల కలెక్షన్లను నమోదు చేసింది. ఇక తూర్పు గోదావరి జిల్లాలో 32 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 16 లక్షలు రాబట్టింది.

కర్ణాటకలో కలెక్షన్లు
ఇక కర్ణాటకలో ఆచార్య చిత్రం వసూళ్లు పెద్దగా కనిపించలేదు. మూడో రోజున 51 లక్షల కలెక్షన్లు నమోదయ్యాయి. దాంతో ఈ చిత్రం గత మూడు రోజుల్లో 3.64 కోట్ల గ్రాస్, 3.08 కోట్ల నికర వసూళ్లను నమోదు చేసింది.

ఓవర్సీస్‌లో వసూళ్లు వివరాలు
అమెరికాలో ఆచార్య చిత్రానికి ప్రేక్షకుల నుంచి అంతంత మాత్రంగానే వసూళ్లు ఉన్నాయి. మూడో రోజు ఈ చిత్రం 127k వసూళ్లను సాధించింది. తొలి రోజున ప్రీమియర్లతోపాటు 817,349 డాలర్లు, రెండో రోజున 87783 డాలర్లను వసూలు చేసింది. ఇక కొన్ని ప్రాంతాల కలెక్షన్ల వివరాలు అందాల్సి ఉంది.

ప్రపంచవ్యాప్తంగా వసూళ్లు
నైజాంలో ఆచార్య చిత్రం మూడో రోజున 1.46 రూపాయలు వసూలు చేసింది. గత మూడు రోజుల్లో ఈ చిత్రం 11.56 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దీంతో ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 38.72 కోట్లు నికరంగా, 55.90 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.70.56 కోట్ల గ్రాస్, 45.52 కోట్ల షేర్ సాధించింది.

ఆచార్య లాభాల్లోకి రావాలంటే..
ఆచార్య చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ 131 కోట్లకుపైగా జరిగింది. ఈ సినిమా 132 కోట్లకుపైగా బ్రేక్ ఈవెన్ లక్ష్యంతో బాక్సాఫీస్ ప్రయాణాన్ని మొదలు పెట్టింది. ఇక ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే.. 87 కోట్లు రాబట్టాల్సి ఉంది. ప్రస్తుతం అంచనాల ప్రకారం ఆచార్య చిత్రం భారీ నష్టాల్లో ముగిసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











