AP: ఆచార్య, KGF 2, SVP మైండ్ బ్లోయింగ్ బిజినెస్.. మళ్ళీ సీఎంను కలవాల్సిందే?
గత రెండు మూడేళ్లలోనే తెలుగు చిత్ర పరిశ్రమలో సినిమాల బిజినెస్ అయితే ఒక్కసారిగా పెరిగి పోయింది అనే చెప్పాలి. ముఖ్యంగా బాహుబలి సినిమా తర్వాత అగ్ర హీరోలు అందరూ కూడా ఒకరిని మించి మరొకరు మార్కెట్ ను పెంచుకుంటూ ఉన్నారు. ఇక కోస్తాంధ్రాలో ప్రస్తుతం సినిమాలకు మంచి డిమాండ్ ఏర్పడింది. రాబోయే మహేష్, మెగాస్టార్ చిరంజీవి సినిమాలు కూడా భారీ ధర పలికినట్లు సమాచారం అయితే ఆ స్థాయిలో కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు రాకుండా ఉండాలి అంటే ఏపీలో టిక్కెట్ల రేట్లను మళ్లీ పెంచాల్సిందే. అందుకోసం మళ్లీ హీరోలు జగన్ ను అభ్యర్థించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

KGF 2 బిజినెస్
కన్నడ స్టార్ యష్ నటించిన కేజిఎఫ్ చాప్టర్ 2 సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ 14న భారీ స్థాయిలో విడుదల అవుతోంది. ఈ సినిమాకు ఏపీలో అన్ని ఏరియాల్లో కూడా మంచి బిజినెస్ చేస్తూ ఉండటం విశేషం. కేజిఎఫ్ చాప్టర్ 1 సక్సెస్ కావడంతో ఇప్పుడు చాప్టర్ 2కి భారీగా డిమాండ్ ఏర్పడింది. కేవలం కోస్తా ఆంధ్ర లోనే ఈ సినిమా హక్కులు 40 కోట్లకు అమ్ముడైనట్లు సమాచారం.

ఆచార్య సాలీడ్ బిజినెస్
ఇకన్ మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ కలిసి నటించిన మొట్ట మొదటి బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా ఆచార్య సినిమా ఏప్రిల్ 29వ తేదీన విడుదల కాబోతోంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి బిజినెస్ చేసిన ఈ సినిమా కోస్తాంధ్రలోని దాదాపు 55 కోట్లకు అమ్ముడైనట్లు సమాచారం.

సర్కారు వారి పాట
మరొక వైపు మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా కోస్తాంధ్రలోని సర్కారు వారి పట సినిమా 50 కోట్ల దర పలికినట్లుగా తెలుస్తుంది. మహేష్ బాబు కీర్తి సురేష్ జంటగా నటించిన ఈ సినిమాను గీత గోవిందం దర్శకుడు పరుశురామ్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఒక విధంగా ఈ సినిమాతో మహేష్ బాబు తన మార్కెట్ ను మరింత పెంచుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

భారీగా తగ్గించడంతో..
ఈ టైర్ వన్ హీరోల సినిమాలు కోస్తా ఆంధ్రాలో చేసిన బిజినెస్ చూస్తూ ఉంటే ఒక విధంగా సినిమా మార్కెట్ ఏ స్థాయిలో పెరిగింది అర్థం చేసుకోవచ్చు. కానీ మరొకవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టిక్కెట్ల రేట్లు భారీగా తగ్గించడంతో పెట్టిన పెట్టుబడికి తగ్గట్లుగా డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు రావడం లేదు. లాభాల సంగతి పక్కన పెడితే హిట్ టాక్ ను సొంతం చేసుకున్న సినిమాలు కూడా నష్టపోవాల్సి వస్తోంది.
Recommended Video


మళ్ళీ సీఎంను కలవాల్సిందే?
ఇక ప్రస్తుతం ఆచార్య, సర్కారు వారి పాట, కేజిఎఫ్ చాప్టర్ 2 సినిమాలకు అయితే ఆంధ్రా లో టిక్కెట్ల రేట్లు ఉన్న రేటు అయితే ఏ మాత్రం ఆమోదయోగ్యమైనవి కాదు అని తెలుస్తోంది. ఇప్పుడున్న టికెట్ల రేట్లతో సినిమాలను విడుదల చేస్తే మాత్రం నష్టాలు ఎదుర్కోక తప్పదు. అందుకే మళ్లీ టాలీవుడ్ సినీ పెద్దలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి RRR సినిమాకు పెంచినట్లుగా ఈ సినిమాలకు కూడా టికెట్ల రేట్ల విషయంలో కొంత రేట్లు అమలులోకి తెస్తారో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











