Acharya 10 Days Collections: ఆచార్యకు దెబ్బ మీద దెబ్బ.. 132 కోట్లకు వచ్చింది ఎంతంటే!

స్వయంకృషితో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. దాదాపు నలభై ఏళ్లుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్‌ హీరోగా వెలుగొందుతోన్నారు మెగాస్టార్ చిరంజీవి. యాక్టింగ్, డ్యాన్స్, డైలాగ్స్, ఫైట్స్ అన్నింటికీ మించి గ్రేస్‌తో ఇప్పటికీ సత్తా చాటుతోన్న ఆయన.. వరుస సినిమాలతో దూసుకుపోతోన్నారు. ఇందులో భాగంగానే ఇటీవలే చిరంజీవి 'ఆచార్య' అనే సినిమాలో నటించారు. ఇందులో రామ్ చరణ్ కూడా మరో ముఖ్యమైన పాత్రను పోషించాడు. బడా డైరెక్టర్ కొరటాల శివ రూపొందించిన ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్‌గా చేసింది. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించాడు. సోనూ సూద్ ఇందులో విలన్‌గా నటించాడు.

మెగా ఫ్యామిలీకి చెందిన ఇద్దరు హీరోలు కలిసి నటించిన సినిమా కావడంతో 'ఆచార్య' ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించింది. ఫలితంగా పట్టాలపై ఉన్న సమయంలోనే భారీ హైప్‌ను ఏర్పరచుకుంది. దీంతో ఈ సినిమా హక్కుల కోసం బడా డిస్ట్రిబ్యూటర్ల నుంచి డిమాండ్ ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సినిమాకు అన్ని ఏరియాల్లోనూ మంచి బిజినెస్ జరిగింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 131.20 కోట్ల థియేట్రికల్ రిలీజ్ బిజినెస్‌ను జరుపుకుంది. అందుకు అనుగుణంగానే ఈ సినిమాను అన్ని ఏరియాల్లోనూ కలుపుకుని 2000లకు పైగా థియేటర్లలో విడుదల చేసిన విషయం తెలిసిందే.

Acharya Movie 10 Days Box Office Collections

చిరంజీవి, రామ్ చరణ్ కలయికలో రూపొందిన 'ఆచార్య' మూవీకి ఆరంభంలోనే నెగెటివ్ టాక్ వచ్చింది. దీంతో ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి స్పందన తగ్గిపోతూనే వస్తోంది. మరీ ముఖ్యంగా ఈ సినిమాకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి చాలా తక్కువ వసూళ్లు వస్తున్నాయి. వీకెండ్ సమయంలో కూడా ఆశించిన స్థాయిలో రాబడ్డం లేదు. ఇక, గత శుక్రవారం ఈ సినిమాకు రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 8 లక్షలు వసూలు అవగా.. తొమ్మిదో రోజైన శనివారం రూ. 6 లక్షలు మాత్రమే వసూలు అయ్యాయి. ఇక, హాలీడే అయిన ఆదివారం కూడా ఈ సినిమా ప్రభావాన్ని చూపలేకపోయింది. ఫలితంగా పదో రోజు దీనికి కేవలం రూ. 8 లక్షలే వచ్చాయి.

తెలుగు రాష్ట్రాల్లో 'ఆచార్య' మూవీకి 10 రోజులకు కలిపి చూస్తే కలెక్షన్లు అనుకున్న రీతిలో రాలేదనే చెప్పాలి. మొత్తంగా ఈ చిత్రానికి నైజాంలో రూ. 12.39 కోట్లు, సీడెడ్‌లో రూ. 6.18 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 4.85 కోట్లు, ఈస్ట్‌లో రూ. 3.24 కోట్లు, వెస్ట్‌లో రూ. 3.40 కోట్లు, గుంటూరులో రూ. 4.59 కోట్లు, కృష్ణాలో రూ. 3.08 కోట్లు, నెల్లూరులో రూ. 2.94 కోట్లతో.. రెండు రాష్ట్రాల్లో కలిసి రూ. 40.67 కోట్లు షేర్, రూ. 59.65 కోట్లు గ్రాస్ వచ్చింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.78 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 4.75 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ రూ. 48.20 కోట్లు షేర్, రూ. 75.70 కోట్లు గ్రాస్ మాత్రమే రాబట్టింది.

మెగా మల్టీస్టారర్‌గా రూపొందిన 'ఆచార్య' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 131.20కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 132.50 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా పది రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 48.20 కోట్లు వసూలు చేసింది. అంటే మరో 84.30 కోట్లు వస్తే ఇది హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం.. ఇది టార్గెట్‌ను రీచ్ అయ్యేలా కనిపించడం లేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X