Acharya 11 Days Collections: ఆచార్యకు కోలుకోలేని షాక్.. 11వ రోజే ఇలాంటి కలెక్షన్లా!

తెలుగు సినీ ఇండస్ట్రీలో దాదాపు నాలుగు దశాబ్దాలుగా హవాను చూపిస్తూ స్టార్ హీరోగా కొనసాగుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఆరంభం నుంచే తనకంటూ ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకుని ముందుకు సాగుతోన్న ఆయన.. సుదీర్ధమైన కెరీర్‌లో ఎన్నో విజయాలను సొంతం చేసుకున్నారు. దీంతో వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేశారు. అయితే, రాజకీయాల కోసం గ్యాప్ తీసుకున్న చిరంజీవి.. రీఎంట్రీలో మాత్రం యమ దూకుడును చూపిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు 'ఆచార్య' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా నటించిన విషయం తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్‌గా చేసింది. మణి శర్మ సంగీతం అందించారు.

టాలీవుడ్‌లో మెగా ఫ్యామిలీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అలాంటిది ఆ కుటుంబానికి చెందిన ఇద్దరు హీరోలు కలిసి నటించిన సినిమా కావడంతో 'ఆచార్య'పై ఆరంభంలోనే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే ఈ సినిమా హక్కుల కోసం పోటీ ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా నుంచి వచ్చిన అప్‌డేట్ల వల్ల అంచనాలు రెట్టింపు అయిపోయాయి. ఫలితంగా దీనికి బిజినెస్ అత్యధికంగా జరిగింది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఆచార్య సినిమా రూ. 131.20 కోట్ల థియేట్రికల్ రిలీజ్ బిజినెస్‌ను జరుపుకుంది. దీనికి తగ్గట్లుగానే ఈ సినిమాను అన్ని ఏరియాల్లోనూ కలుపుకుని 2000లకు పైగా థియేటర్లలో విడుదల చేశారు.

మెగా ఫ్యామిలీకి చెందిన హీరోలు, అందులోనూ తండ్రీ కొడుకులు నటించిన సినిమా కావడంతో 'ఆచార్య' మూవీకి ఆరంభంలో భారీ రెస్పాన్స్ వచ్చింది. కానీ, సినిమాకు మాత్రం నెగెటివ్ టాక్ దక్కింది. దీంతో ఈ మూవీకి ఓపెనింగ్స్‌తో పాటు ఆ తర్వాత కలెక్షన్లు కూడా అనుకున్న రీతిలో రాలేదు. అలాగే, రెండో వారం మొదటి నుంచే ఈ సినిమాకు రెస్పాన్స్ మరింతగా తగ్గిపోయింది. ఇక, రెండో వీకెండ్‌లో కూడా దీనికి వసూళ్లు చప్పగానే వచ్చాయి. తొమ్మిదో రోజైన శనివారం రూ. 6 లక్షలు మాత్రమే వసూలు అయ్యాయి. ఇక, హాలీడే అయిన ఆదివారం కేవలం రూ. 8 లక్షలే వచ్చాయి. ఈ క్రమంలోనే 11వ రోజైన సోమవారం రూ. 3 లక్షలే రాబట్టిందీ మూవీ.

Acharya Movie 11 Days Box Office Collections

తెలుగు రాష్ట్రాల్లో 'ఆచార్య' మూవీకి 11 రోజులకు కలిపి చూస్తే కలెక్షన్లు చాలా చప్పగా వచ్చాయి. మొత్తంగా ఈ చిత్రానికి నైజాంలో రూ. 12.41 కోట్లు, సీడెడ్‌లో రూ. 6.19 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 4.85 కోట్లు, ఈస్ట్‌లో రూ. 3.24 కోట్లు, వెస్ట్‌లో రూ. 3.40 కోట్లు, గుంటూరులో రూ. 4.59 కోట్లు, కృష్ణాలో రూ. 3.08 కోట్లు, నెల్లూరులో రూ. 2.94 కోట్లతో.. రెండు రాష్ట్రాల్లో కలిసి రూ. 40.70 కోట్లు షేర్, రూ. 59.70 కోట్లు గ్రాస్ వచ్చింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.78 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 4.76 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ రూ. 48.24 కోట్లు షేర్, రూ. 75.80 కోట్లు గ్రాస్ మాత్రమే ఈ సినిమా రాబట్టింది.

క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'ఆచార్య' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 131.20కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 132.50 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 11 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 48.24 కోట్లు వసూలు చేసింది. అంటే మరో 84.26 కోట్లు వస్తే ఇది హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది. అయితే, ఇప్పడా పరిస్థితి కనిపించడం లేదు. దీంతో ఇది భారీ డిజాస్టర్‌గా మిగిలిపోయే అవకాశం కనిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X