twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Acharya 13 Days Collections: ఆచార్యకు ఘోర పరాభవం.. ఏ స్టార్ హీరో మూవీకి జరగని విధంగా!

    |

    తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. దీనికి కారణం ఈ కుటుంబం నుంచి చాలా మంది హీరోలుగా పరిచయం అవడమే. అంతేకాదు, ఇప్పుడు వాళ్లలో చాలా మంది టాలీవుడ్‌లో స్టార్లుగా వెలుగొందుతోన్నారు. అలాంటి ఈ బిగ్ ఫ్యామిలీ నుంచి తాజాగా ఓ భారీ మల్టీస్టారర్ మూవీ వచ్చింది. అదే మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన 'ఆచార్య'. కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. మణి శర్మ ఈ మూవీకి సంగీతం అందించారు. దీన్ని మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఇది ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

    ఉల్లిపొర లాంటి డ్రెస్‌లో యాంకర్ స్రవంతి రచ్చ: ఎద అందాలను హైలైట్ చేస్తూ ఘోరంగా!ఉల్లిపొర లాంటి డ్రెస్‌లో యాంకర్ స్రవంతి రచ్చ: ఎద అందాలను హైలైట్ చేస్తూ ఘోరంగా!

    టాలీవుడ్‌లో హవాను చూపిస్తోన్న ఇద్దరు స్టార్ హీరోలు చిరంజీవి, రామ్ చరణ్ కలయికలో వచ్చిన 'ఆచార్య'పై ఆరంభంలోనే భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగానే ఈ సినిమా హక్కుల కోసం అన్ని ఏరియాల్లోనూ పోటీ ఏర్పడింది. ఫలితంగా దీనికి థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరిగింది. ఇక, మొత్తంగా ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ కలుపుకుని రూ. 131.20 కోట్ల థియేట్రికల్ బిజినెస్‌ను జరుపుకుంది. దీనికి తగ్గట్లుగానే ఈ సినిమాను వరల్డ్ వైడ్‌గా దాదాపు 2000లకు పైగా థియేటర్లలో ఎంతో గ్రాండ్‌గా విడుదల చేశారు.

    Acharya Movie 13 Days Box Office Collections

    క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'ఆచార్య' మూవీకి ఆరంభంలో భారీ రెస్పాన్స్ వచ్చింది. కానీ, సినిమాకు మాత్రం మొదటి ఆట నుంచే నెగెటివ్ టాక్ దక్కింది. దీంతో ఈ మూవీకి ఓపెనింగ్స్‌తో పాటు ఆ తర్వాత కలెక్షన్లు కూడా అనుకున్న రీతిలో వసూలు కావడం లేదు. మరీ ముఖ్యంగా రెండో వారం మొదటి నుంచే ఈ సినిమాకు రెస్పాన్స్ మరింతగా తగ్గిపోయింది. ఇక, రెండో వీకెండ్‌లో కూడా దీనికి వసూళ్లు చప్పగానే వచ్చాయి. ఇలా క్రమంగా ఇవి తగ్గుతూనే వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు 13వ రోజు ఈ సినిమాకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలుపుకుని కేవలం లక్ష రూపాయలు మాత్రమే కలెక్ట్ అయ్యాయి.

    శ్రీముఖికి బాలీవుడ్ స్టార్ హీరో బిగ్ సర్‌ప్రైజ్: ఏ అమ్మాయికీ దక్కని అదృష్టం ఈమెదే మరి!శ్రీముఖికి బాలీవుడ్ స్టార్ హీరో బిగ్ సర్‌ప్రైజ్: ఏ అమ్మాయికీ దక్కని అదృష్టం ఈమెదే మరి!

    ఏపీ, తెలంగాణలో 'ఆచార్య' మూవీకి 13 రోజులకు కలిపి చూస్తే కలెక్షన్లు చాలా దారుణంగా వచ్చాయి. మొత్తంగా ఈ చిత్రానికి నైజాంలో రూ. 12.43 కోట్లు, సీడెడ్‌లో రూ. 6.20 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 4.85 కోట్లు, ఈస్ట్‌లో రూ. 3.24 కోట్లు, వెస్ట్‌లో రూ. 3.40 కోట్లు, గుంటూరులో రూ. 4.59 కోట్లు, కృష్ణాలో రూ. 3.08 కోట్లు, నెల్లూరులో రూ. 2.94 కోట్లతో.. రెండు రాష్ట్రాల్లో కలిసి రూ. 40.73 కోట్లు షేర్, రూ. 59.76 కోట్లు గ్రాస్ వచ్చింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.79 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 4.77 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 48.29 కోట్లు షేర్, రూ. 75.90 కోట్లు గ్రాస్ మాత్రమే ఈ సినిమా రాబట్టింది.

    మెగా హీరోల కలయికలో రూపొందిన భారీ మల్టీస్టారర్ 'ఆచార్య' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 131.20కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 132.50 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా 13 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 48.29 కోట్లు వసూలు చేసింది. అంటే మరో 84.21 కోట్లు వస్తే ఇది హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది. అయితే, ఇప్పటికే ఈ సినిమా రన్ పూర్తైనట్లు కనిపిస్తోంది.

    English summary
    Megastar Chiranjeevi and Ram Charan Did Acharya Under Koratala Siva Direction. This Movie Collect Rs 48.24 Crore in 13 Days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X