Acharya 1st Week Collections: 132 కోట్ల టార్గెట్.. ఫస్ట్ వీక్ ఇంతే.. చెత్త రికార్డు దిశగా ఆచార్య

తెలుగు సినీ ఇండస్ట్రీలో కొంత కాలంగా భారీ నుంచి, అతి భారీ సినిమాలు రూపొందుతోన్నాయి. అందులో కొన్ని మాత్రం విడుదలకు ముందే భారీ హైప్‌ను క్రియేట్ చేసుకుంటున్నాయి. అలాంటి వాటిలో మెగా మల్టీస్టారర్‌గా రూపొందిన 'ఆచార్య' మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దీనికి కారణం ఇందులో తండ్రీ కొడుకులైన మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించడమే. ఇద్దరు బడా హీరోలు కావడంతో ఇది ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించింది. ఫలితంగా భారీ స్థాయిలో అంచనాలను ఏర్పరచుకుని అత్యధిక బిజినెస్ కూడా జరుపుకుంది. మొత్తానికి ఇటీవలే ఆచార్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా వారం రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే చూడండి!

మెగా హీరోల కాంబోలో వచ్చిందిగా

మెగా హీరోల కాంబోలో వచ్చిందిగా

మెగా ఫ్యామిలీకి చెందిన చిరంజీవి, రామ్ చరణ్ హీరోలుగా కొరటాల శివ తెరకెక్కించిన మల్టీస్టారర్ మూవీనే 'ఆచార్య'. ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి. బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్‌గా చేసింది. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించాడు. రియల్ హీరో సోనూ సూద్ ఈ మూవీలో విలన్ పాత్రలో కనిపించారు.

ఆచార్య మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్

ఆచార్య మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్

మెగాస్టార్, మెగా పవర్ స్టార్‌కు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటక, తమిళనాడు, ఓవర్సీస్‌లో కూడా మంచి ఫాలోయింగ్, మార్కెట్ ఉంది. దీనికితోడు ఇద్దరూ కలిసి చేసిన సినిమా కావడంతో 'ఆచార్య'కు భారీ స్థాయిలో రూ. 131.20 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇది చిరంజీవి కెరీర్‌లోనే రెండో అత్యధిక బిజినెస్. అందుకు అనుగుణంగానే దీన్ని భారీగా విడుదల చేశారు.

7వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది

7వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది

'ఆచార్య'కు తెలుగు రాష్ట్రాల్లో ఏడో రోజు కలెక్షన్లు మరింత తగ్గాయి. ఫలితంగా నైజాంలో రూ. 5 లక్షలు, సీడెడ్‌లో రూ. 4 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 60 వేలు, ఈస్ట్ గోదావరిలో రూ. 40 వేలు, వెస్ట్ గోదావరిలో రూ. 60 వేలు, గుంటూరులో రూ. 20 వేలు, కృష్ణాలో రూ. 80 వేలు, నెల్లూరులో రూ. 40 వేలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 12 లక్షలు షేర్, రూ. 20 లక్షలు గ్రాస్ మాత్రమే వచ్చింది.

మొదటి వారంలో ఎంత వచ్చింది

మొదటి వారంలో ఎంత వచ్చింది

'ఆచార్య' మూవీకి వారం రోజులకు కలిపి కలెక్షన్లు షాకింగ్‌గా వచ్చాయి. దీంతో నైజాంలో రూ. 12.28 కోట్లు, సీడెడ్‌లో రూ. 6.13 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 4.84 కోట్లు, ఈస్ట్‌లో రూ. 3.24 కోట్లు, వెస్ట్‌లో రూ. 3.39 కోట్లు, గుంటూరులో రూ. 4.58 కోట్లు, కృష్ణాలో రూ. 3.05 కోట్లు, నెల్లూరులో రూ. 2.94 కోట్లతో.. రెండు రాష్ట్రాల్లో కలిసి రూ. 40.45 కోట్లు షేర్, రూ. 59.20 కోట్లు గ్రాస్ వచ్చింది.

మిగిలిన ఏరియాల్లో ఎంతొచ్చింది

మిగిలిన ఏరియాల్లో ఎంతొచ్చింది

ఆంధ్రా, తెలంగాణలో నిరాశ పరిచిన 'ఆచార్య' మూవీ.. మిగిలిన ప్రాంతాల్లోనూ ప్రభావాన్ని చూపలేదు. రెండు రాష్ట్రాల్లో వారం రోజులకు రూ. 40.45 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.73 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 4.69 కోట్లు మాత్రమే రాబట్టింది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా రూ. 47.87 కోట్లు షేర్, రూ. 75.05 కోట్లు గ్రాస్ రాబట్టింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్? ఎంత రావాలి

బ్రేక్ ఈవెన్ టార్గెట్? ఎంత రావాలి

ఎంతో ప్రతిష్టాత్మకంగా వచ్చిన 'ఆచార్య' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 131.20కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 132.50 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా వారం రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 47.87 కోట్లు వసూలు చేసింది. అంటే మరో 84.63 కోట్లు వస్తే ఇది విజయాన్ని సాధిస్తుంది.

చెత్త రికార్డు దిశగా ఆచార్య పయనం

చెత్త రికార్డు దిశగా ఆచార్య పయనం

విడుదలైనప్పటి నుంచే నెగెటివ్ టాక్‌ను తెచ్చుకున్న 'ఆచార్య' మూవీ బాక్సాఫీస్ వద్ద తడబడుతూనే ఉంటోంది. ఫలితంగా మొదటి వారం మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ రూ. 47.87 కోట్లు వసూలు చేసింది. ఇంకా ఈ సినిమా రూ. 84 కోట్లుకు పైగానే రాబట్టాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి ఈ చిత్రం భారీ డిజాస్టర్‌గా మిగిలే ప్రమాదం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X