Acharya 4 Days Collections: ఆచార్యకు మరో బిగ్ షాక్.. 4వ రోజే అంత తక్కువగా.. ఇంకెంత వస్తే హిట్ అంటే!
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో రకాల సినిమాలు వస్తున్నాయి. అందులో కొన్ని మాత్రమే విడుదలకు ముందే భారీ స్థాయిలో హైప్‌ను క్రియేట్ చేసుకుంటున్నాయి. అలా వచ్చిన సినిమాల్లో 'ఆచార్య' ఒకటి. మెగా మల్టీస్టారర్‌గా రూపొందిన ఈ మూవీలో మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించారు. దీంతో అంచనాలను భారీగా ఏర్పరచుకుని ఎంతో గ్రాండ్‌గా విడుదలైంది. అయితే, ఇది అంచనాలను అందుకోవడంలో మాత్రం పూర్తిగా విఫలమైంది.
ఫలితంగా ఆరంభంలోనే నెగెటివ్ టాక్‌ను అందుకోవడంతో పాటు కలెక్షన్లను కూడా అంతగా రాబట్టలేకపోతోంది. ఈ నేపథ్యంలో అసలు 'ఆచార్య' మూవీ నాలుగు రోజుల్లో ఎంత వసూలు చేసింది? ఇంకెంత వస్తే హిట్ అవుతుంది? అనేవి చూద్దాం పదండి!

భారీ మల్టీస్టారర్‌గా వచ్చిన ఆచార్య
తండ్రీ కొడుకులు చిరంజీవి, రామ్ చరణ్ హీరోలుగా బడా డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన మల్టీస్టారర్ మూవీనే 'ఆచార్య'. ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి. పూజా హెగ్డే హీరోయిన్‌గా చేసింది. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించాడు. సోనూ సూద్ ఇందులో విలన్ పాత్రను పోషించిన విషయం తెలిసిందే.

ఆచార్య మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్
మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్‌కు రెండు రాష్ట్రాలతో పాటు కర్నాటక, తమిళనాడు, ఓవర్సీస్‌లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దీనికితోడు ఇద్దరూ కలిసి చేసిన సినిమా కావడంతో 'ఆచార్య'కు భారీ స్థాయిలో రూ. 131.20 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇది చిరంజీవి కెరీర్‌లోనే రెండో అత్యధిక బిజినెస్. అందుకు అనుగుణంగానే దీన్ని భారీ స్థాయిలో రిలీజ్ చేశారు.

4వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది
'ఆచార్య'కు తెలుగు రాష్ట్రాల్లో నాలుగో రోజు భారీ షాక్ తగిలింది. ఫలితంగా నైజాంలో రూ. 23 లక్షలు, సీడెడ్‌లో రూ. 9 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 5 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 60 వేలు, వెస్ట్ గోదావరిలో రూ. 3.40 లక్షలు, గుంటూరులో రూ. 80 వేలు, కృష్ణాలో రూ. 6.20 లక్షలు, నెల్లూరులో రూ. 5 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 53 లక్షలు షేర్, రూ. 1.15 కోట్లు గ్రాస్ వచ్చింది.

4 రోజులకు కలిపి ఎంత వచ్చింది
'ఆచార్య' మూవీకి 4 రోజులకు కలిపి కలెక్షన్లు తక్కువగా వచ్చాయి. దీంతో నైజాంలో రూ. 11.79 కోట్లు, సీడెడ్‌లో రూ. 5.96 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 4.73 కోట్లు, ఈస్ట్‌లో రూ. 3.18 కోట్లు, వెస్ట్‌లో రూ. 3.31 కోట్లు, గుంటూరులో రూ. 4.52 కోట్లు, కృష్ణాలో రూ. 2.91 కోట్లు, నెల్లూరులో రూ. 2.85 కోట్లతో.. రెండు రాష్ట్రాల్లో కలిసి రూ. 39.25 కోట్లు షేర్, రూ. 57.05 కోట్లు గ్రాస్ వచ్చింది.

మిగిలిన ఏరియాల్లో ఎంతొచ్చింది
తెలుగు రాష్ట్రాల్లో నిరాశనే ఎదుర్కొన్న 'ఆచార్య' మూవీ.. మిగిలిన ప్రాంతాల్లోనూ తక్కువ కలెక్షన్లనే రాబట్టింది. రెండు రాష్ట్రాల్లో నాలుగు రోజులకు రూ. 39.25 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.50 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 4.43 కోట్లు రాబట్టింది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా రూ. 46.18 కోట్లు షేర్, రూ. 72 కోట్లు గ్రాస్ రాబట్టింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్? ఎంత రావాలి
క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన 'ఆచార్య' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 131.20కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 132.50 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా నాలుగు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 46.18 కోట్లు వసూలు చేసింది. అంటే మరో 86.32 కోట్లు వస్తే ఇది హిట్ అవుతుంది.

భారీ నష్టాల దిశగా వెళ్తోన్న మూవీ
మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలయికలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'ఆచార్య' మూవీకి ఆరంభంలోనే నెగెటివ్ టాక్ రావడం భారీ దెబ్బలా మారింది. ఫలితంగా ఈ సినిమాకు కలెక్షన్లు అనుకున్న స్థాయిలో రావడం లేదు. నాలుగో రోజే కోటి కంటే తక్కువ వసూళ్లు వచ్చాయి. దీంతో ఈ సినిమా ఫుల్ రన్‌లో భారీ నష్టాలను ఎదుర్కొనే దిశగా సాగుతోంది.


Click it and Unblock the Notifications











