Acharya 5 Days Collections: ఆచార్యకు దెబ్బ మీద దెబ్బ.. హాలీడే ఉన్నా ఇంత తక్కువగా.. ఇంకెంత రావాలంటే!
తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. దీనికి కారణం ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్లుగా వెలుగొందుతోన్న వారిలో ఎక్కువ మంది ఈ కుటుంబానికి చెందిన వాళ్లే కావడమే. అందుకే వీళ్లలో ఎవరు సినిమా చేసినా అంచనాలు భారీ స్థాయిలో ఉంటాయి. అలాంటిది ఈ ఫ్యామిలీకి చెందిన ఇద్దరు హీరోలు కలిసి నటిస్తే.. ఆ హడావిడి ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి చేసిన సినిమానే 'ఆచార్య'. భారీ హైప్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీకి నెగెటివ్ టాక్ వచ్చింది. ఫలితంగా దీనికి అంతగా స్పందన రావడం లేదు. దీని ప్రభావం కలెక్షన్లపై చూపించింది. ఈ నేపథ్యంలో 'ఆచార్య' 5 రోజుల రిపోర్టును మీరే చూడండి!

మెగా హీరోల కాంబోలో వచ్చేసింది
మెగా హీరోలు చిరంజీవి, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో బడా డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన మల్టీస్టారర్ మూవీనే 'ఆచార్య'. ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి. పూజా హెగ్డే హీరోయిన్‌గా చేసింది. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించాడు. రియల్ హీరో సోనూ సూద్ ఇందులో విలన్ పాత్రలో కనిపించారు.

ఆచార్య మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్
అటు చిరుకు, ఇటు చరణ్‌కు రెండు రాష్ట్రాలతో పాటు కర్నాటక, తమిళనాడు, ఓవర్సీస్‌లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దీనికితోడు ఇద్దరూ కలిసి చేసిన సినిమా కావడంతో 'ఆచార్య'కు భారీ స్థాయిలో రూ. 131.20 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇది చిరంజీవి కెరీర్‌లోనే రెండో అత్యధిక బిజినెస్. అందుకు అనుగుణంగానే దీన్ని గ్రాండ్‌గా విడుదల చేశారు.

5వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది
'ఆచార్య' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో ఐదో కలెక్షన్లు అంతగా రాలేదు. ఫలితంగా నైజాంలో రూ. 35 లక్షలు, సీడెడ్‌లో రూ. 10 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 8 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 4 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 5 లక్షలు, గుంటూరులో రూ. 4 లక్షలు, కృష్ణాలో రూ. 9 లక్షలు, నెల్లూరులో రూ. 7 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 82 లక్షలు షేర్, రూ. 1.40 కోట్లు గ్రాస్ వచ్చింది.

5 రోజులకు కలిపి ఎంత వచ్చింది
'ఆచార్య' మూవీకి 5 రోజులకు కలిపి కలెక్షన్లు తక్కువగా వచ్చాయి. దీంతో నైజాంలో రూ. 12.14 కోట్లు, సీడెడ్‌లో రూ. 6.06 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 4.81 కోట్లు, ఈస్ట్‌లో రూ. 3.22 కోట్లు, వెస్ట్‌లో రూ. 3.36 కోట్లు, గుంటూరులో రూ. 4.56 కోట్లు, కృష్ణాలో రూ. 3 కోట్లు, నెల్లూరులో రూ. 2.92 కోట్లతో.. రెండు రాష్ట్రాల్లో కలిసి రూ. 40.07 కోట్లు షేర్, రూ. 58.45 కోట్లు గ్రాస్ వచ్చింది.

మిగిలిన ఏరియాల్లో ఎంతొచ్చింది
తెలుగు రాష్ట్రాల్లో అంతగా రాణించని 'ఆచార్య' మూవీ.. మిగిలిన ప్రాంతాల్లోనూ తక్కువ కలెక్షన్లనే రాబట్టింది. రెండు రాష్ట్రాల్లో ఐదు రోజులకు రూ. 40.07 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.65 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 4.60 కోట్లు మాత్రమే రాబట్టింది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా రూ. 47.32 కోట్లు షేర్, రూ. 73.90 కోట్లు గ్రాస్ రాబట్టింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్? ఎంత రావాలి
మెగా హీరోల కాంబోలో వచ్చిన 'ఆచార్య' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 131.20కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 132.50 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా ఐదు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 47.32 కోట్లు వసూలు చేసింది. అంటే మరో 85.18 కోట్లు వస్తే ఇది విజయాన్ని సాధిస్తుంది.


Click it and Unblock the Notifications











