Acharya 6 Days Collections: షాకింగ్‌గా ఆచార్య వసూళ్లు.. RRRకు 21 లక్షలు.. దీనికి మాత్రం 6వ రోజే!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో ఎన్నో భారీ చిత్రాలు రూపొందాయి. అందులో కొన్ని బడా మల్టీస్టారర్లుగా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అలాంటి వాటిలో మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలయికలో వచ్చిన 'ఆచార్య' ఒకటి. తండ్రీ కొడుకులు కలిసి నటించిన సినిమా కావడంతో దీనిపై ఆరంభం నుంచే అంచనాలు భారీ ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేశారు. కానీ, దీనికి మొదట్లోనే నెగెటివ్ టాక్ రావడంతో స్పందన కరువైపోయింది. దీంతో కలెక్షన్లు కూడా ఘోరంగా పడిపోయాయి. ఈ నేపథ్యంలో అసలు ఆచార్య మూవీ ఇప్పటి వరకూ ఎంత వసూలు చేసింది? ఇంకెంత వస్తే హిట్ అవుతుంది? అనేవి చూద్దాం పదండి!

భారీ మల్టీస్టారర్‌గా వచ్చిన ఆచార్య

భారీ మల్టీస్టారర్‌గా వచ్చిన ఆచార్య

టాలీవుడ్ స్టార్ హీరోలు చిరంజీవి, రామ్ చరణ్ లీడ్ రోల్స్‌లో కొరటాల శివ తెరకెక్కించిన మల్టీస్టారర్ మూవీనే 'ఆచార్య'. ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి. పూజా హెగ్డే హీరోయిన్‌గా చేసింది. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించాడు. రియల్ హీరో సోనూ సూద్ ఇందులో విలన్ పాత్రను పోషించారు.

ఆచార్య మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్

ఆచార్య మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్

చిరంజీవి, చరణ్‌కు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటక, తమిళనాడు, ఓవర్సీస్‌లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. దీనికితోడు ఇద్దరూ కలిసి చేసిన సినిమా కావడంతో 'ఆచార్య'కు భారీ స్థాయిలో రూ. 131.20 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇది చిరంజీవి కెరీర్‌లోనే రెండో అత్యధిక బిజినెస్. అందుకు అనుగుణంగానే దీన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.

6వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది

6వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది

'ఆచార్య' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో ఆరో రోజు కలెక్షన్లు దెబ్బకొట్టాయి. ఫలితంగా నైజాంలో రూ. 9 లక్షలు, సీడెడ్‌లో రూ. 3 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 3 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, గుంటూరులో రూ. 2 లక్షలు, కృష్ణాలో రూ. 3 లక్షలు, నెల్లూరులో రూ. 2 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 26 లక్షలు షేర్, రూ. 55 లక్షలు గ్రాస్ మాత్రమే వచ్చింది.

6 రోజులకు కలిపి ఎంత వచ్చింది

6 రోజులకు కలిపి ఎంత వచ్చింది

'ఆచార్య' మూవీకి 6 రోజులకు కలిపి కలెక్షన్లు దారుణంగా వచ్చాయి. దీంతో నైజాంలో రూ. 12.23 కోట్లు, సీడెడ్‌లో రూ. 6.09 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 4.84 కోట్లు, ఈస్ట్‌లో రూ. 3.24 కోట్లు, వెస్ట్‌లో రూ. 3.38 కోట్లు, గుంటూరులో రూ. 4.58 కోట్లు, కృష్ణాలో రూ. 3.03 కోట్లు, నెల్లూరులో రూ. 2.94 కోట్లతో.. రెండు రాష్ట్రాల్లో కలిసి రూ. 40.33 కోట్లు షేర్, రూ. 59 కోట్లు గ్రాస్ వచ్చింది.

మిగిలిన ఏరియాల్లో ఎంతొచ్చింది

మిగిలిన ఏరియాల్లో ఎంతొచ్చింది


ఏపీ, తెలంగాణలో అంతగా రాణించని 'ఆచార్య' మూవీ.. మిగిలిన ప్రాంతాల్లోనూ తక్కువ కలెక్షన్లనే రాబట్టింది. రెండు రాష్ట్రాల్లో ఆరు రోజులకు రూ. 40.33 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.71 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 4.66 కోట్లు మాత్రమే రాబట్టింది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా రూ. 47.71 కోట్లు షేర్, రూ. 74.70 కోట్లు గ్రాస్ రాబట్టింది.

బ్రేక్ ఈవెన్ టార్గెట్? ఎంత రావాలి

బ్రేక్ ఈవెన్ టార్గెట్? ఎంత రావాలి

మెగా మల్టీస్టారర్‌గా వచ్చిన 'ఆచార్య' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 131.20కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 132.50 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా ఆరు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 47.71 కోట్లు వసూలు చేసింది. అంటే మరో 84.79 కోట్లు వస్తే ఇది విజయాన్ని సాధిస్తుంది.

RRRకు 21 లక్షలు.. ఆచార్యకు ఇలా

RRRకు 21 లక్షలు.. ఆచార్యకు ఇలా


ఆరంభంలోనే నెగెటివ్ టాక్‌ను తెచ్చుకున్న ఆచార్య మూవీ బాక్సాఫీస్ వద్ద నత్తనడకన సాగుతోంది. దీంతో బుధవారం ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ. 26 లక్షలు షేర్ మాత్రమే వచ్చింది. అయితే, RRRకు 41వ రోజైన బుధవారం రూ. 21 లక్షలు వచ్చాయి. ఇక, మరో సంచలన చిత్రం కేజీఎఫ్ చాప్టర్ 2కు నిన్న ఏకంగా రూ. 55 లక్షలు షేర్ రావడం గమనార్హం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X