Acharya 8 Days Collections: దారుణంగా వసూళ్లు.. ఎప్పుడో రిలీజైన RRR, KGF2 కంటే తక్కువగా!

మెగా మల్టీస్టారర్‌గా రూపొందిన 'ఆచార్య'లో తండ్రీ కొడుకులైన మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించడంతో సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో ఇద్దరు బడా హీరోలు నటించడం, డానికి తోడు అపజయం ఎరుగని కొరటాల శివ దర్శకుడు కావడంతో ఈ సినిమాకు భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరుపుకుంది. అలా ఈ సినిమా ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఎనిమిదో రోజుల్లో ఎంత వసూలు చేసిందో బాక్స్ ఆఫీస్ రిపోర్టులో చూద్దాం.

భారీ అంచనాలతో

భారీ అంచనాలతో

మెగా ఫ్యామిలీకి చెందిన చిరంజీవి, రామ్ చరణ్ హీరోలుగా కొరటాల శివ తెరకెక్కించిన మల్టీస్టారర్ మూవీ 'ఆచార్య'. ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ల మీద నిరంజన్ రెడ్డి, అన్వేష రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా రామ్ చరణ్ సరసన నటించిన ఈ సినిమాలో రియల్ హీరో సోనూసూద్ విలన్ పాత్రలో కనిపించారు. అలాగే జిషు సేన్ గుప్తా, బెనర్జీ, సత్యదేవ్ లాంటి వారు కూడా నటించారు. చేసింది. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించారు.

ప్రీ రిలీజ్ బిజినెస్

ప్రీ రిలీజ్ బిజినెస్

ఇక మెగాస్టార్, మెగా పవర్ స్టార్‌ ఇద్దరికీ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటక, తమిళనాడు, ఓవర్సీస్‌లో కూడా మంచి ఫాలోయింగ్, మార్కెట్ ఉంది. అలా ఆ ఇద్దరూ కలిసి అపజయం ఎరుగని కొరటాల శివతో చేసిన సినిమా కావడంతో 'ఆచార్య'కు భారీ స్థాయిలో రూ. 131.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అలా ఈ సినిమా చిరంజీవి కెరీర్‌లోనే రెండో అత్యధిక బిజినెస్ జరుపుకున్న సినిమాగా నిలిచింది.

8వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?

8వ రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?


'ఆచార్య'కు తెలుగు రాష్ట్రాల్లో ఎనిమిదో రోజు కలెక్షన్స్ మరింత తగ్గాయి. ఫలితంగా నైజాంలో రూ. 4 లక్షలు, సీడెడ్‌లో రూ. 2 లక్షలు, ఉత్తరాంధ్రలో లక్ష లోపు, ఈస్ట్ గోదావరిలో లక్ష లోపు,, వెస్ట్ గోదావరిలో లక్ష రూపాయలు, గుంటూరు లక్ష లోపు, కృష్ణాలో లక్ష రూపాయలు, నెల్లూరులో లక్ష లోపు కలెక్షన్స్ తో రెండు రాష్ట్రాల్లో రూ. 8 లక్షలు షేర్ మాత్రమే వచ్చింది.

మొదటి 8 రోజులు ఎంత కలెక్ట్ చేసింది?

మొదటి 8 రోజులు ఎంత కలెక్ట్ చేసింది?

'ఆచార్య' మూవీకి ఎనిమిది రోజులకు కలిపి కలెక్షన్లు షాకింగ్‌గా వచ్చాయి. దీంతో నైజాంలో రూ. 12.32 కోట్లు, సీడెడ్‌లో రూ. 6.15 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 4.84 కోట్లు, ఈస్ట్‌లో రూ. 3.24 కోట్లు, వెస్ట్‌లో రూ. 3.40 కోట్లు, గుంటూరులో రూ. 4.58 కోట్లు, కృష్ణాలో రూ. 3.06 కోట్లు, నెల్లూరులో రూ. 2.94 కోట్లతో.. రెండు రాష్ట్రాల్లో కలిసి రూ. 40.53 కోట్లు షేర్, రూ. 59.40 కోట్లు గ్రాస్ వచ్చింది.

మిగిలిన ఏరియాల్లో ఎంతొచ్చింది అంటే?

మిగిలిన ఏరియాల్లో ఎంతొచ్చింది అంటే?

ఆంధ్రా, తెలంగాణలో వసూళ్లలో నిరాశ పరిచిన 'ఆచార్య' మూవీ.. మిగిలిన ప్రాంతాల్లో కూడా ఏమాత్రం ప్రభావాన్ని చూపలేదు. రెండు రాష్ట్రాల్లో ఎనిమిది రోజులకు రూ. 40.53 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా.. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.75 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 4.72 కోట్లు మాత్రమే రాబట్టింది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా రూ. 48 కోట్లు షేర్, రూ. 75.35 కోట్లు గ్రాస్ రాబట్టింది.

బ్రేక్ ఈవెన్ ఎంత రావాలి?

బ్రేక్ ఈవెన్ ఎంత రావాలి?

'ఆచార్య' మూవీకి అంచనాలకు అనుగుణంగా ప్రపంచ వ్యాప్తంగా రూ. 131.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 132.50 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా ఎనిమిది రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 48 కోట్లు వసూలు చేసింది. అంటే మరో 84.50 కోట్లు వస్తేనే ఇది విజయాన్ని సాధిస్తుంది. అయితే అది అసాధ్యం అనే అంటున్నారు ట్రేడ్ వర్గాల వారు. ఈ క్రమంలో ఈ సినిమా భారీ డిజాస్టర్‌గా మిగిలే అవకాశాలు లేకపోలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X