Acharya 9 Days Collections: 9వ రోజే ఘోరాతి ఘోరంగా.. అన్ని కోట్ల నష్టం తప్పేలా లేదుగా!

సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత యమ జోష్‌తో కనిపిస్తున్నారు టాలీవుడ్ టాప్ హీరో మెగాస్టార్ చిరంజీవి. ఇప్పటికే ఎన్నో సినిమాలను అందించిన ఆయన.. కొన్ని విజయాలను కూడా ఖాతాలో వేసుకున్నారు. ఈ క్రమంలోనే ఇటీవలే 'ఆచార్య' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. రామ్ చరణ్ కూడా ప్రధాన పాత్రను పోషించిన ఈ చిత్రాన్ని టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించారు. ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి. బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్‌గా చేసింది. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించాడు. రియల్ హీరో సోనూ సూద్ ఈ మూవీలో విలన్ పాత్రలో కనిపించారు.

క్రేజీ కాంబినేషన్‌లో రూపొందడంతో 'ఆచార్య' మూవీపై ఆరంభం నుంచే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. దీనికితోడు ఈ మూవీ నుంచి వచ్చిన అప్‌డేట్లకు అదిరిపోయే రెస్పాన్స్ దక్కడంతో ఇది అందరి దృష్టినీ ఆకర్షించింది. ఫలితంగా ఈ సినిమాకు అన్ని ఏరియాల్లో మంచి డిమాండ్ ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆచార్య మూవీకి ప్రపంచ వ్యాప్తంగా కలిపి అన్ని ప్రాంతాల్లో భారీ స్థాయిలో రూ. 131.20 కోట్ల థియేట్రికల్ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇది చిరంజీవి కెరీర్‌లోనే రెండో అత్యధిక బిజినెస్ అయిన విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగానే ఈ మెగా మల్టీస్టారర్ మూవీని భారీగా విడుదల చేశారు.

Acharya Movie 9 Days Box Office Collections

మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలయికలో రూపొందిన 'ఆచార్య' మూవీకి ఆరంభం నుంచే స్పందన కరువైంది. దీంతో ఈ సినిమాకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి చాలా తక్కువ వసూళ్లు వస్తున్నాయి. వారాల్లో మాత్రం దీనికి చాలా తక్కువ నెంబర్లు వచ్చాయి. ఇక, 8వ రోజుల ఈ సినిమాకు రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 8 లక్షలు వసూలు అవగా.. తొమ్మిదో రోజైన శనివారం మరింత తగ్గిపోయాయి. ఈ క్రమంలోనే దీనికి 9వ రోజున ఘోరాతి ఘోరంగా రూ. 6 లక్షలు మాత్రమే వసూలు అయ్యాయి. దీని బట్టి ఈ సినిమాకు ఏ రేంజ్ రెస్పాన్స్ వస్తుందో అర్థం చేసుకోవచ్చు.

'ఆచార్య' మూవీకి 9 రోజులకు కలిపి చూస్తే కలెక్షన్లు షాకింగ్‌గా వచ్చాయి. ఇప్పటి వరకూ వచ్చిన వసూళ్ల వివరాలను పరిశీలిస్తే.. ఈ చిత్రానికి నైజాంలో రూ. 12.35 కోట్లు, సీడెడ్‌లో రూ. 6.16 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 4.84 కోట్లు, ఈస్ట్‌లో రూ. 3.24 కోట్లు, వెస్ట్‌లో రూ. 3.40 కోట్లు, గుంటూరులో రూ. 4.59 కోట్లు, కృష్ణాలో రూ. 3.07 కోట్లు, నెల్లూరులో రూ. 2.94 కోట్లతో.. రెండు రాష్ట్రాల్లో కలిసి రూ. 40.59 కోట్లు షేర్, రూ. 59.50 కోట్లు గ్రాస్ వచ్చింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.76 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 4.73 కోట్లు మాత్రమే రాబట్టింది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా రూ. 48.08 కోట్లు షేర్, రూ. 75.50 కోట్లు గ్రాస్ రాబట్టింది.

ఎంతో ప్రతిష్టాత్మకంగా వచ్చిన 'ఆచార్య' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 131.20కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 132.50 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా తొమ్మిది రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 48.08 కోట్లు వసూలు చేసింది. అంటే మరో 84.42 కోట్లు వస్తే ఇది విజయాన్ని సాధిస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి ఈ చిత్రం భారీ డిజాస్టర్‌గా మిగిలే ప్రమాదం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X