For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Acharya Total Collections: 132 కోట్ల టార్గెట్.. టోటల్‌గా ఇంతే.. అన్ని కోట్ల నష్టాలతో చెత్త రికార్డు

  |

  సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత మరింత ఉత్సాహంగా వరుసగా ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్నారు టాలీవుడ్ టాప్ హీరో మెగాస్టార్ చిరంజీవి. ఇప్పటికే పలు చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన ఆయన.. ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' అనే సినిమాను చేశారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటించిన ఈ చిత్రం.. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాలను ఏర్పరచుకున్నప్పటికీ.. దీనికి నెగెటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు ఆశించిన స్థాయిలో దక్కలేదు. ఫలితంగా ఈ మూవీ ఘోర పరాభవాన్ని చవి చూడాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో అసలు 'ఆచార్య' మూవీ ఫుల్ రన్‌లో ఎంత వసూలు చేసింది? ఎన్ని కోట్ల నష్టాలను ఎదుర్కొంది? అనేవి చూద్దాం పదండి!

  మెగా మల్టీస్టారర్‌గా వచ్చిన ఆచార్య

  మెగా మల్టీస్టారర్‌గా వచ్చిన ఆచార్య

  మెగా హీరోలు చిరంజీవి, రామ్ చరణ్ హీరోలుగా బడా డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన మల్టీస్టారర్ మూవీనే 'ఆచార్య'. ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి. పూజా హెగ్డే హీరోయిన్‌గా చేసింది. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించాడు. రియల్ హీరో సోనూ సూద్ ఇందులో విలన్ పాత్రను పోషించారు.

  అరాచకమైన వీడియో షేర్ చేసిన శ్రీరెడ్డి: వాళ్ల కోసమే అంటూ మొత్తం చూపిస్తూ!

  ఆచార్య మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్

  ఆచార్య మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్


  మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్‌కు రెండు రాష్ట్రాలతో పాటు కర్నాటక, తమిళనాడు, ఓవర్సీస్‌లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దీనికితోడు ఇద్దరూ కలిసి చేసిన సినిమా కావడంతో 'ఆచార్య'కు భారీ స్థాయిలో రూ. 131.20 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇది చిరంజీవి కెరీర్‌లోనే రెండో అత్యధిక బిజినెస్. అంతేకాదు, దీన్ని 2000 థియేటర్లలో రిలీజ్ చేశారు.

  తెలుగు రాష్ట్రాల్లో ఎంత రాబట్టింది

  తెలుగు రాష్ట్రాల్లో ఎంత రాబట్టింది


  'ఆచార్య' మూవీకి ఫుల్ రన్ ముగిసే సరికి కలెక్షన్లు ఇలా ఉన్నాయి. నైజాంలో రూ. 12.45 కోట్లు, సీడెడ్‌లో రూ. 6.21 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 4.85 కోట్లు, ఈస్ట్‌లో రూ. 3.24 కోట్లు, వెస్ట్‌లో రూ. 3.40 కోట్లు, గుంటూరులో రూ. 4.59 కోట్లు, కృష్ణాలో రూ. 3.09 కోట్లు, నెల్లూరులో రూ. 2.94 కోట్లతో.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిసి రూ. 40.77 కోట్లు షేర్, రూ. 59.85 కోట్లు గ్రాస్ వచ్చింది.

  F3 హీరోయిన్ ఎద అందాల విందు: ఈ డ్రెస్‌లో ఆమెనిలా చూశారంటే తట్టుకోలేరు!

   ప్రపంచ వ్యాప్తంగా వచ్చిందెంత?

  ప్రపంచ వ్యాప్తంగా వచ్చిందెంత?


  తెలుగు రాష్ట్రాల్లో నిరాశనే ఎదుర్కొన్న 'ఆచార్య' మూవీ.. మిగిలిన ప్రాంతాల్లోనూ తక్కువ కలెక్షన్లనే రాబట్టింది. రెండు రాష్ట్రాల్లో ఫుల్ రన్‌లో ఈ మూవీ రూ. 40.77 కోట్లు వసూలు చేసింది. అలాగే, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.80 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 4.78 కోట్లు రాబట్టింది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా రూ. 48.36 కోట్లు షేర్, రూ. 76 కోట్లు గ్రాస్ రాబట్టింది.

  బ్రేక్ ఈవెన్ టార్గెట్.. నష్టం ఎంత?

  బ్రేక్ ఈవెన్ టార్గెట్.. నష్టం ఎంత?


  మెగా మల్టీస్టారర్‌గా వచ్చిన 'ఆచార్య' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 131.20కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 132.50 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా ముగింపు సమయానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 48.36 కోట్లు వసూలు చేసింది. అంటే ఇది రూ. 84.14 కోట్లు నష్టాలను చవి చూసింది.

  ప్రియుడితో ఒకే రూంలో పాయల్ రాజ్‌పుత్: ఏకంగా అలాంటి పని చేస్తూ షాకిచ్చిందిగా!

  టాలీవుడ్‌లోనే మరో చెత్త రికార్డు

  టాలీవుడ్‌లోనే మరో చెత్త రికార్డు


  మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలయికలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'ఆచార్య' మూవీకి ఆరంభంలోనే నెగెటివ్ టాక్ రావడం భారీ దెబ్బలా మారింది. ఫలితంగా ఈ సినిమాకు కలెక్షన్లు అనుకున్న స్థాయిలో రాలేదు. ఫలితంగా రూ. 84.14 కోట్లు నష్టాలు వచ్చాయి. దీంతో 'రాధే శ్యామ్' తర్వాత ఎక్కువ నష్టాలను ఎదుర్కొన్న సినిమాగా నిలిచిందీ మూవీ.

   అమెజాన్‌లో అప్పుడే స్ట్రీమింగ్

  అమెజాన్‌లో అప్పుడే స్ట్రీమింగ్

  మెగా హీరోల కాంబినేషన్‌లో రూపొందిన 'ఆచార్య' మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులకు భారీ స్థాయిలో పోటీ ఏర్పడింది. ఈ క్రమంలోనే ఈ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ భారీ ధరకు కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని మే 20వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇప్పటికే వెలువడింది.

  English summary
  Megastar Chiranjeevi and Ram Charan Did Acharya Under Koratala Siva Direction. This Movie Collect Rs 48.36 Crore in Full Run.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X