ఊహించని ధరకు ‘ఆచార్య’ ఓవర్సీస్ రైట్స్: షాకిస్తోన్న బ్రేక్ ఈవెన్ టార్గెట్.. వసూలు చేస్తుందా?

దాదాపు నలభై ఏళ్లుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో చక్రం తిప్పుతూ టాప్ హీరోగా వెలుగొందుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. స్వయంకృషితో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన.. కెరీర్ ఆరంభంలోనే బడా హీరోల నుంచి పోటీని తట్టుకుని నిలబడ్డారు. ఆ తర్వాత భారీ హిట్లను తన ఖాతాలో వేసుకున్నారు. పాలిటిక్స్ కోసం సినిమాలకు బ్రేకిచ్చిన చిరంజీవి.. రీఎంట్రీ కూడా ఇచ్చారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం 'ఆచార్య' అనే మూవీ చేస్తున్నారు. ఈ సినిమా బిజినెస్ భారీగా జరుగుతోంది. ఇందులో భాగంగానే ఓవర్సీస్ రైట్స్ ఊహించని ధరకు అమ్ముడు పోయాయి. ఆ వివరాలు మీకోసం!

అండర్‌వేర్‌తో యువ నటి ఫోటోషూట్.. సోషల్ మీడియాలో వైరల్‌గా

నిరూపించిన చిరంజీవి.. స్పీడు పెంచారు

నిరూపించిన చిరంజీవి.. స్పీడు పెంచారు

సుదీర్ఘ విరామం తర్వాత 'ఖైదీ నెంబర్ 150'తో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు పలు రికార్డులను బద్దలు కొట్టేసింది. అంతేకాదు, ఆయనలోని గ్రేస్, పవర్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించింది. దీంతో రెట్టించిన ఉత్సాహంతో వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు మెగాస్టార్.

‘ఆచార్య'లా మారి రాబోతున్న మెగాస్టార్

‘ఆచార్య'లా మారి రాబోతున్న మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి.. బడా డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం 'ఆచార్య'. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ దీన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా చేస్తోన్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం సమకూర్చుతున్నాడు. భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమాపై అంచనాలు అదే రీతిలో ఉన్నాయి.

మెగా మల్టీస్టారర్‌... అసలు కథ అతడిదే

మెగా మల్టీస్టారర్‌... అసలు కథ అతడిదే

ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా కీలక పాత్రను పోషిస్తున్నాడు. అతడి కోసమే ప్రత్యేకంగా స్క్రిప్టును మార్చి రాయించారని ఆ మధ్య ప్రచారం కూడా జరిగింది. ఇక, ఇందులో 'సిద్ధ' అనే పాత్రను చేస్తున్న మెగా పవర్ స్టార్.. దాదాపు 30 నిమిషాల వరకూ కనిపిస్తాడట. అతడి ప్రేరణతోనే చిరు ఓ గొప్ప కార్యన్ని పూర్తి చేస్తాడని, అదే అసలు కథ అని సమాచారం.

టీజర్‌తో అంచనాలు.. రికార్డులు బద్దలు

టీజర్‌తో అంచనాలు.. రికార్డులు బద్దలు

ఎప్పటి నుంచో వేచి చూస్తున్న 'ఆచార్య' టీజర్ ఇటీవలే విడుదలైంది. దీనికి మెగా అభిమానులే కాదు.. సామాన్య ప్రేక్షకుల నుంచి కూడా విశేషమైన స్పందన వచ్చింది. ఫలితంగా ఈ టీజర్ యూట్యూబ్‌లో ట్రెండ్ అవడంతో పాటు ఎన్నో రికార్డులు బద్దలు కొట్టింది. తద్వారా తెలుగు సినిమాల్లో ఎక్కువ వ్యూస్ సాధించిన టీజర్ల జాబితాలో ఏడో స్థానంలో నిలిచి సత్తా చాటిందిది.

ఊహించని ధరకు ‘ఆచార్య' ఓవర్సీస్ రైట్స్

ఊహించని ధరకు ‘ఆచార్య' ఓవర్సీస్ రైట్స్

టీజర్ విడుదలైన తర్వాత 'ఆచార్య' బిజినెస్‌ను ప్రారంభించింది చిత్ర యూనిట్. సినిమాపై ఉన్న అంచనాలకు అనుగుణంగానే ప్రతి ప్రాంతంలోనూ భారీగా వ్యాపారం జరుగుతోంది. ఇప్పటికే నైజాంలో రూ. 35 కోట్లు, సీడెడ్‌లో రూ. 17 కోట్లు సహా మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో వంద కోట్లకు పైగానే బిజినెస్ జరిగింది. ఈ నేపథ్యంలోనే ఓవర్సీస్ బిజినెస్ ఊహించని ధరకు జరిగిందని తెలుస్తోంది.

షాకిస్తోన్న టార్గెట్.. వసూలు చేస్తుందా?

షాకిస్తోన్న టార్గెట్.. వసూలు చేస్తుందా?

తాజా సమాచారం ప్రకారం.. ఓవర్సీస్‌లో 'ఆచార్య' రూ. 11 కోట్లకు అమ్ముడు పోయిందట. ఓ ప్రముఖ సంస్థ దీని హక్కులు దక్కించుకుందని తెలిసింది. ఇక, ఈ బిజినెస్ ప్రకారం.. విదేశాల్లో ఈ సినిమా 3.5 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ బ్రేక్ ఈవెన్‌ చిన్నదే అయినా.. దాన్ని కలెక్ట్ చేసే స్టామినా 'ఆచార్య'కు ఉందా అనేది వేచి చూడాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X