Laal Singh Chaddha: మొదటి బాలీవుడ్ సినిమాకు నాగచైతన్య రెమ్యునరేషన్ ఎంతంటే..?

అక్కినేని హీరో నాగచైతన్య మొదటిసారి లాల్ సింగ్ చడ్డా సినిమా ద్వారా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. అమీర్ ఖాన్ హీరోగా నటించిన ఈ సినిమా ఫారెస్ట్ గంప్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది. ఈ సినిమాతో బాలీవుడ్లో నాగచైతన్య కూడా మంచి గుర్తింపు అందుకుంటాడు అని అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పటివరకు ఈ సినిమా చూసిన కొంతమంది సినీ ప్రముఖులు అతని నటనపై కూడా ప్రశంసలు కురిపించారు. అయితే ఈ సినిమాకు అసలు నాగచైతన్య ఏ స్థాయిలో రెమ్యునరేషన్ అందుకున్నాడు అనేది హాట్ టాపిక్ గా మారింది. ఇక అతనికి ఉన్న డిమాండ్ ను బట్టి ఎంత తీసుకున్నాడు అనే వివరాల్లోకి వెళితే..

రిజల్ట్ తో సంబంధం లేకుండా..

రిజల్ట్ తో సంబంధం లేకుండా..

అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన నాగచైతన్య సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా బాక్స్ ఆఫీస్ వద్ద తన మార్కెట్ ను పెంచుకున్నాడు. జోష్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత లవ్ స్టోరీలు అలాగే విభిన్నమైన మాస్ కమర్షియల్ సినిమాలను చేశాడు. కొన్ని సినిమాలు నిరాశపరిచినప్పటికీ కూడా అభిమానుల్లో మాత్రం అతని రేంజ్ అంతగా తగ్గలేదు అని చెప్పాలి. వీలైనంతవరకు విభిన్నమైన సినిమాలు చూసుకుంటూ వెళ్తున్నాడు.

మొదట హిందీ సినిమా

మొదట హిందీ సినిమా

ఇక మొదటిసారి అతను బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చడ్డా సినిమా ద్వారా బాలీవుడ్ వెండితెరకు పరిచయం కాబోతున్నాడు ఇంతకుముందు నాగార్జున కొన్ని సినిమాలతో బాలీవుడ్లో మంచి గుర్తింపు అందుకున్నాడు. ఇక ఇప్పుడు నాగచైతన్య అటువైపుగా ఒక విభిన్నమైన పాత్రలో పరిచయం కాబోతూ ఉండడం విశేషం. అమీర్ ఖాన్ పాత్రతోపాటు నాగచైతన్య పాత్ర కూడా సినిమాలో చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుంది అని ఇదివరకే చిరంజీవి ప్రశంసల కురిపించారు.

ఆ ఆలోచనతోనే..

ఆ ఆలోచనతోనే..

హాలీవుడ్ మూవీ ఫారెస్ట్ గంప్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన లాల్ సింగ్ చడ్డా సినిమాలో నాగచైతన్య క్యారెక్టర్ ఉన్నంత సేపు కూడా ఆడియన్స్ చూపు తిప్పుకోలేరు అని చెబుతున్నారు. అయితే ఆ పాత్రకు అతను మాత్రమే సెట్ అవుతాడు అని మొదట అమీర్ ఖాన్ ఆలోచించారట. నాగచైతన్య కూడా ఈ సినిమాలో తన పాత్ర టైమింగ్ ఎంత అని ఆలోచించకుండా కేవలం అమీర్ ఖాన్ లాంటి టాలెంటెడ్ హీరోతో నటిస్తే చాలు అనే ఆలోచనతోనే డేట్స్ కూడా ఇచ్చేశాడట.

Recommended Video

Young Techie12 ఏళ్లకే 3 యాప్స్ తయారు... కోట్లు సంపాదించే ఛాన్స్ *Tech | Telugu OneIndia
రెమ్యునరేషన్ ఎంతంటే?

రెమ్యునరేషన్ ఎంతంటే?

అయితే ఈ సినిమాలో నటించడానికి నాగచైతన్య ఏ స్థాయిలో రెమ్యునరేషన్ అందుకున్నాడు అనేది ప్రస్తుతం బాలీవుడ్ మీడియాలో కూడా హాట్ టాపిక్ గా మారింది. ఆ విషయంలోకి వెళితే నాగచైతన్య ప్రస్తుతం తన మార్కెట్ ను బట్టి ఒక్కో సినిమాకు ఎనిమిది కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇక లాల్ సింగ్ చడ్డా సినిమాలో ఒక స్పెషల్ రోల్ కాబట్టి నిర్మాతలు అతనికి రూ.5 కోట్ల వరకు ఇచ్చినట్లు సమాచారం. మరి ఈ సినిమా ద్వారా నాగచైతన్య బాలీవుడ్ వెండితెరపై ఏ స్థాయిలో క్లిక్ అవుతాడో చూడాలి. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ఆగస్టు 11వ తేదీన విడుదలవుతున్న విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X