Dasara Movie Bussiness: ఆ ఏరియాలో రికార్డు క్రియేట్ చేస్తున్న నాని సినిమా.. షాకింగ్ డీల్!

నేచురల్ స్టార్ నాని తన స్థాయిని మరో లెవల్ కు పెంచుకునే విధంగా మొదటిసారి దసరా అనే సినిమాని తీసుకురాబోతున్నాడు. ఇక ఈ సినిమాకు సంబంధించిన అనేక రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా సినిమాకు సంబంధించిన బిజినెస్ డీల్స్ అయితే ఊహించని రేంజ్ లో ఉన్నాయని తప్పకుండా నాని కెరియర్ లో ఈ సినిమా సరికొత్త రికార్డును క్రియేట్ చేస్తుంది అని అర్థమవుతుంది.

ఇక ఇప్పటికే ఈ సినిమాను నిర్మించిన నిర్మాత సుధాకర్ చెరుకూరి థియేట్రికల్ హక్కులను కూడా భారీ ధరకు ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు అమ్మేసి సేఫ్ జోన్ లోకి వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే సినిమాకు ఉన్న డిమాండ్ ను బట్టి దిల్ రాజు మరొక విధంగా ఈ సినిమాతో బిజినెస్ చేస్తున్నట్లు సమాచారం. ప్రతి ఏరియాకు సినిమాను అమ్ముకుంటూ డిస్ట్రిబ్యూటర్ ద్వారా మంచి ప్రాఫిట్ అందుకుంటున్నారట. ప్రతి ఏరియాలో కూడా నాని సినిమాకు ఇప్పుడు మంచి డిమాండ్ ఏర్పడినట్లుగా తెలుస్తోంది.

Actor Nani dasara movie shocking bussiness deals

ముఖ్యంగా సీడెడ్ ఏరియాలో అయితే దసరా సినిమాను దాదాపు 6కోట్లకు అమ్ముకున్నట్లుగా ఒక టాగ్ అయితే వినిపిస్తోంది. గతంలో ఎప్పుడూ కూడా సీడెడ్ ఏరియాలో అయితే నాని సినిమా ఈ రేంజ్ లో అయితే బిజినెస్ చేసింది లేదు. కానీ ఇప్పుడు మాత్రం ఊహించిన విధంగా ఆరు కోట్లకు అమ్ముడుపోయింది. అసలు అయితే మొదట డిమాండ్ ను బట్టి దిల్ రాజు ఏడున్నర కోట్లకు సీడెడ్ హక్కులను కోట్ చేయగా ఒక డిస్ట్రిబ్యూటర్ మాట్లాడుకొని ఆరు కోట్లకు ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం.

మొత్తానికి దసరా సినిమా అయితే నాని కెరీర్లో కొత్త రికార్డును క్రియేట్ చేయబోతున్నట్లు ఈ లెక్కలు చూస్తేనే అర్థమవుతుంది. ఈ సినిమాను దాదాపు 60 కోట్ల భారీ బడ్జెట్లో నిర్మించారు. ఇక నిర్మాత అయితే థియేట్రికల్ గా గా అలాగే నాన్ థియేట్రికల్ బిజినెస్ ద్వారా మంచి ప్రాఫిట్ లోకి వచ్చేసినట్లు సమాచారం. ఈ సినిమాను సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ డైరెక్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇక దసరా సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా ప్రపంచ వ్యాప్తంగా పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమాను మార్చి 30వ తేదీన విడుదల చేయబోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X