Pawan Kalyan ఫస్ట్ మూవీ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.. నెల జీతం తీసుకుంటూ..

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా అడుగు పెట్టినప్పటికీ పవన్ కళ్యాణ్ అతి తక్కువ కాలంలోనే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు అందుకున్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు వింటేనే అభిమానుకు ఏ స్థాయిలో విజిల్స్ వేస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమాల నుంచి సామాజిక అంశాల వరకు అతను తీసుకునే నిర్ణయాలు కూడా చాలా విభిన్నంగా ఉంటాయి.

ఇక పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టే దాదాపు 25 ఏళ్లు అవుతోంది. ఇక ప్రస్తుతం టాలీవుడ్ హీరోలలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న పవన్ కళ్యాణ్ మొదటి సినిమాకు రెమ్యునరేషన్ ఏ స్థాయిలో అందుకున్నారు అనేది హాట్ టాపిక్ గా మారుతోంది. ఇక ఆ వివరాల్లోకి వెళితే..

సినిమాలతో కాకుండా

సినిమాలతో కాకుండా

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో అందరి కంటే విభిన్నమైన బాడీ లాంగ్వేజ్ అలాగే డిఫరెంట్ యాక్టింగ్ తో బాక్సాఫీస్ హిట్స్ అందుకున్నారు. అయితే ఫ్యాన్ ఫాలయింగ్ మాత్రం అతనికి సినిమాల కంటే కూడా వ్యక్తిగత క్యారెక్టర్ తో నే పెరిగిందని చెప్పవచ్చు. నలుగురికి సహాయం చేసే విధంగా అడుగులు వేసే పవన్ కళ్యాణ్ ప్రతి సినిమాలో కూడా ఏదో ఒక మంచి విషయాన్ని చెప్పాలనుకొని మొదటి పాతతోనే సోషల్ మెసేజ్ ఇచ్చే విధంగా జాగ్రత్తలు తీసుకుంటారు.

బాలీవుడ్ రీమేక్ తో..

బాలీవుడ్ రీమేక్ తో..

ఇక పవన్ కళ్యాణ్ మొదటి సినిమా 1996 అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో నిర్మాత అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్ లో 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' ద్వారా పవన్ కళ్యాణ్ తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయం అయ్యారు. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ కొన్ని రోజుల పాటు ప్రత్యేకంగా నటనలో శిక్షణ కూడా తీసుకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ సలహా మేరకు పవన్ కళ్యాణ్ హీరోగా పరిచయమయ్యాడు. బాలీవుడ్ హిట్ మూవీ ఖయామత్ స్ ఖయామత్ తక్ రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కించారు.

హీరోయిన్ ఎవరో తెలుసా

హీరోయిన్ ఎవరో తెలుసా

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన అమ్మాయి మరెవరో కాదు. అక్కినేని నాగేశ్వరరావు మనవరాలు, సుమంత్ చెల్లెలు సుప్రియ. పవన్ కళ్యాణ్ కు సుప్రియ కు అదే మొదటి సినిమా కావడంతో అప్పట్లో ఈ సినిమాకు భారీ స్థాయిలో హైప్ క్రియేట్ అయ్యింది. ఇక ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను అనుకున్నంతగా ఆకట్టుకోలేకపోయింది. కేవలం ఓ వర్గం ప్రేక్షకులకు మాత్రమే ఆకట్టుకుంది.

మొదటి రెమ్యునరేషన్ ఎంతంటే

మొదటి రెమ్యునరేషన్ ఎంతంటే

నిర్మాత అల్లు అరవింద్ అప్పట్లో ఈ సినిమాకు ఒక మీడియం రేంజ్ హీరోకు తగ్గట్లుగానే హై బడ్జెట్ తో నిర్మించారు. పవన్ కళ్యాణ్ కు రెమ్యునరేషన్ ఎంత ఇచ్చారు అంటే.. నెలకు ఐదు వేల రూపాయలు ఇచ్చారట. షూటింగ్ పూర్తయ్యే వరకు పవన్ కళ్యాణ్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాకు మొత్తం పారితోషకం రూ.50 వేల వరకు వచ్చిందట.

Recommended Video

Manchu Manoj Urges Justice For Sugali Preethi | Women Safety
 ఇప్పుడు రెమ్యునరేషన్ ఎంతంటే?

ఇప్పుడు రెమ్యునరేషన్ ఎంతంటే?

ఇక ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అత్యధిక పారితోషికం అందుకుంటున్న నెంబర్ వన్ హీరో అని చెప్పవచ్చు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ను పక్కనపెడితే సోలో గా కేవలం టాలీవుడ్ మార్కెట్ పరంగా పవన్ కళ్యాణ్ 50 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ గత 10 ఏళ్లలో మార్కెట్ వ్యాల్యూ కూడా పెంచుకుంటూనే ఉన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X