మ్యారేజ్ తరువాత కూడా నయనతార అదే డిమాండ్.. స్టార్ హీరోల రేంజ్ లో రెమ్యునరేషన్?

సౌత్ ఇండస్ట్రీలో అగ్ర కథానాయకలలో ఒకరైన నయనతార భాషతో సంబంధం లేకుండా తన క్రేజ్ అయితే పెంచుకుంటుంది. ప్రతి సినిమా ఇండస్ట్రీలో కూడా సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్న నయనతార దాదాపు 15 ఏళ్ల నుంచి ఒకే తరహా స్టార్ ఇమేజ్ తో కొనసాగుతోంది. ఇక ఈ బ్యూటీ ఇటీవల పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇక పారితోషికం విషయంలో కూడా నయనతార ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. పెళ్లి తర్వాత కూడా అదే తరహాలో పారితోషికాన్ని పెంచేస్తోంది. ఇక లేటెస్ట్ గా ఒక సినిమాకు ఊహించని రేంజ్ లో డిమాండ్ చేసినట్లు సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే..

స్పెషల్ స్టార్ ఇమేజ్

స్పెషల్ స్టార్ ఇమేజ్

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న నయనతార పోటీగా ఎంతమంది హీరోయిన్స్ వచ్చినా కూడా ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్స్ వస్తున్నారు. పోతున్నారు. కానీ ఆమె చాలాకాలంగా జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమా అవకాశాలు అందుకుంటూ వెళుతుంది.

ప్రేమ పెళ్లి

ప్రేమ పెళ్లి

ఇక 2015లో వచ్చిన 'నానుమ్ రౌడీ దానే' అనే సినిమా ద్వారా డైరెక్టర్ విగ్నేష్ శివన్ తో ఆమె మంచి స్నేహం కుదిరింది. ఇక ఆ తర్వాత అతనిపైనే ప్రేమ కూడా పెరిగింది. ఇక వీరిద్దరూ క్లోజ్ అవ్వడానికి ఎంతో సమయం పట్టలేదు. ప్రేమించుకున్న తర్వాత డేటింగ్ చేశారు. ఇక రీసెంట్ గా కుటుంబ సభ్యుల సమక్షంలో హిందూ సంప్రదాయాల ప్రకారం డైరెక్టర్ విగ్నేష్ శివన్ తో నయనతార పెళ్లి జరిగిన విషయం తెలిసిందే.

బాలీవుడ్ ఆఫర్

బాలీవుడ్ ఆఫర్

అయితే సాధారణంగా ఈ రోజుల్లో హీరోయిన్స్ పెళ్లి జరిగితే మాత్రం వారి పారితోషికం కూడా కొంత తగ్గుతుంది. అంతేకాకుండా అవకాశాలు కూడా చాలా వరకు తగ్గుతూ ఉంటాయి. కానీ నయనతార మాత్రం అందుకు భిన్నంగా కొనసాగుతోంది. ఆమె టాలెంట్ తో పాటు అందం కూడా అవకాశాలు తీసుకొస్తున్నాయి అని చెప్పవచ్చు. ఇక ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో షారుక్ ఖాన్ అట్లీ కాంబినేషన్లో రానున్న జావాన్ సినిమాలో కూడా నటిస్తోంది.

భారీగా రెమ్యునరేషన్

భారీగా రెమ్యునరేషన్

అయితే ఇటీవల సన్ పిక్చర్స్ తో నయనతార తన 75వ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈ ప్రాజెక్టుపై కూడా అంచనాలు గట్టిగానే ఉన్నాయి. లేడీ ఓరియంటెడ్ గానే ఈ సినిమా కోసం నయనతార ఏకంగా 10 కోట్ల వారితోషికాన్ని తీసుకుంటున్నట్లుగా కథనాలు వస్తున్నాయి. పెళ్లికి ముందు వరకు కేవలం 6 కోట్లు తీసుకున్న ఆమె ఇప్పుడు మాత్రం ఒకేసారి నాలుగు కోట్లు పెంచడం హాట్ టాపిక్ గా మారిపోయింది.

హీరోల రేంజ్ లో..

హీరోల రేంజ్ లో..

ప్రస్తుతం కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఓక రేంజ్ లో ఉన్న స్టార్ హీరోలు కొంతమంది 10 కోట్ల పారితోషికాన్ని అందుకుంటున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు దాదాపు వారికి తగ్గట్టుగానే నయనతార కూడా భారీ స్థాయిలో డిమాండ్ చేస్తూ ఉండడం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఒక విధంగా నిర్మాతలు కూడా ఆమె అడిగినంత ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. మరి నెక్స్ట్ రాబోయే సినిమాలు మరింత విజయం సాధిస్తే నయనతార తన పారితోషికాన్ని ఇంకా ఏ స్థాయిలో పెంచుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X