చైనాలో శ్రీదేవి ప్రభంజనం.. 100 కోట్ల దిశగా మామ్

దేశం గర్వించదగిన అందాల తార, స్వర్గీయ శ్రీదేవి నటించిన మామ్ చిత్రం చైనా బాక్సాఫీస్ వద్ద దూకుడు ప్రదర్శిస్తున్నది. గతవారం విడుదలైన ఈ చిత్రం చైనా ప్రేక్షకులను ఆకట్టుకొంటూ ఘన విజయం వైపు దూసుకెళ్తున్నది. గత వారం రోజుల కలెక్షన్లు పరిశీలిస్తే.. త్వరలోనే ఈ చిత్రం రూ.100 కోట్ల క్లబ్‌ను దాటేసేందుకు పరుగులు పెడుతున్నది. గతవారంలో ఈ చిత్రం 9.69 మిలియన్ డాలర్లు అంటే రూ.67.93 కోట్లు వసూలు చేసింది. రోజు రోజుకు ప్రేక్షకుల ఆదరణ పెరుగుతుండటంతో ఈ చిత్రం త్వరలోనే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

చైనాలో మామ్ చిత్రాన్ని మే 10న చైనాలో జీ స్టూడియోస్ ఇంటర్నేషనల్ విడుదల చేసింది. దాదాపు ఈ చిత్రాన్ని 38500 స్క్రీన్లలో రిలీజ్ చేయడం గమనార్హం. ఇటీవల అంధాదున్ సాధించిన వసూళ్లను మించి ఈ సినిమా కలెక్షన్లు సాధించడం గమనార్హం.

Actress Sridevi Mom racing towards 100 crores

ఇంగ్లీష్ వింగ్లీష్ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత శ్రీదేవి మరోసారి 2017లో మామ్ సినిమాలో నటించారు. ఈ సినిమాకు రవి ఉద్యవార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ఉత్తమ ప్రదర్శనకు గానూ మరణానంతరం శ్రీదేవికి జాతీయ ఉత్తమ నటి అవార్డు లభించింది. ఇటీవల దుబాయ్‌లో ప్రమాదవశాత్తూ శ్రీదేవి మరణించిన సంగతి తెలిసిందే.

మామ్ సాధిస్తున్న కలెక్షన్లపై జీ స్టూడియోస్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు మాట్లాడుతూ.. చైనాలో మామ్ సినిమా భారీ వసూళ్లను సాధిస్తున్నది. మరిన్ని వసూళ్లు సాధిస్తుందని, రికార్డు స్థాయిలో ఈ సినిమాకు ఆదరణ లభించడం సంతోషంగా ఉంది అని అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X