The Kerala Story collections 12వ రోజు కూడా కోట్ల వర్షం.. ఎన్ని కోట్ల లాభమంటే?
ప్రముఖ నిర్మాత, దర్శకుడు విపుల్ షా క్రియేటివ్ డైరెక్టర్‌గా సుదీప్టో సేన్ దర్శకత్వంలో రూపొందిన ది కేరళ స్టోరి చిత్రం భారీ కలెక్షన్లను సాధిస్తున్నది. అదా శర్మ, యోగితా బిహాని, సోనియా బలానీ, సిద్ది ఇద్నానీ తదితరులు ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం బాక్సాపీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేస్తున్నది. ఈ చిత్రం 150 కోట్ల కలెక్షన్లను నమోదు చేసింది. అయితే తొలివారం కంటే రెండో వారంలో భారీ కలెక్షన్లు సాధిస్తున్నది. ఈ చిత్రం 12వ రోజున ఏ రేంజ్ కలెక్షన్లు సాధించిందనే విషయంలోకి వెళితే..
తొలి వారం కేరళ స్టోరి చిత్రం హిందీ వెర్షన్‌కు మాత్రమే పరిమితమైంది. అయితే రెండోవారం నుంచి తెలుగు వెర్షన్‌ను ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. అంతేకాకుండా ఓవర్సీస్‌లో రిలీజ్ చేశారు. తొలుత ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో ఈ సినిమాను ప్రదర్శిస్తుండగా.. భారీ ఆదరణ లభిస్తున్నది.

ది కేరళ స్టోరి (The Kerala Story) చిత్రం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో బాక్సాఫీస్ వద్ద టాప్ 10 చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ చిత్రం ఆస్ట్రేలియాలో 250k డాలర్లు అంటే 1.50 కోట్లు, న్యూజిలాండ్‌లో 55K డాలర్లు అంటే 35 లక్షల రూపాయలు వసూలు చేసింది.
తొలివారం ది కేరళ స్టోరి చిత్రం 82 కోట్ల మేర వసూళ్లను సాధించింది. ఇక 8వ రోజు 12.35 కోట్లు, 9వ రోజు 20 కోట్లు, 10వ రోజు 24 కోట్లు, 11వ రోజు 10.5 కోట్లు సాధించింది. ఇక 12వ రోజు ఈ చిత్రం 10 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 12 రోజుల్లో దాదాపు 160 కోట్ల రూపాయలు ప్రపంచవ్యాప్తంగా వసూలు చేసింది.
ది కేరళ స్టోరి చిత్రం తొలివారమే లాభాల్లోకి ప్రవేశించింది. ఈ చిత్రం 32 బ్రేక్ ఈవెన్ జర్నీతో బాక్సాఫీస్ యాత్రను మొదలుపెట్టింది. దాదాపు ఈ చిత్రం 50 కోట్ల మేర లాభాలతో ముందుకెళ్తున్నది.


Click it and Unblock the Notifications











