The Kerala Story Day 6 collections 100 కోట్లకు చేరువగా ది కేరళ స్టోరి.. 6వ రోజు రికార్డు స్థాయిలో కలెక్షన్లు!

ది కేరళ స్టోరి (The Kerala Story) చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల జైత్రయాత్రను కొనసాగిస్తున్నది. వర్కింగ్ డేస్‌లో కూడా ఈ చిత్రం రోజు రోజకు వసూళ్లను పెంచుకొంటూ భారీ విజయం వైపు దూసుకెళ్తున్నది. వివాదాల నడము ఈ చిత్రం కలెక్షన్లు మొదటి రోజుకు మించి జోరందుకొన్నాయి. ఈ చిత్రం రెండో వారాంతంలో 100 కోట్లకుపైగా వసూళ్ల మైలురాయిని అధిగమించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ది కేరళ స్టోరి (The Kerala Story) చిత్రం 6వ రోజు ఎన్ని కోట్లు వసూలు చేసిందనే వివరాల్లోకి వెళితే..

వివాదాలతో ఫుల్ అటెన్షన్:ది కేరళ స్టోరి (The Kerala Story) చిత్రం భారతీయ మహిళలను బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చే ఐసీస్ (ISIS) కుట్రను బహిర్గతం చేసే కథా నేపథ్యంతో రూపొందింది. కేరళలో మత మార్పిడుల నేపథ్యంగా ఈ చిత్రాన్ని సుదిప్టో సేన్ రూపొందించగా.. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత, దర్శకుడు విపుల్ షా క్రియేటివ్ డైరెక్టర్‌గా వ్యవహరించడమే కాకుండా స్వీయ నిర్మాణం చేపట్టారు. విడుదలకు ముందే ఈ సినిమా అనేక వివాదాల్లో కూరుకుపోవడంతో పబ్లిక్‌లో అటెన్షన్ క్రియేట్ చేసింది.

Adah Sharmas The Kerala Story Day 6 collections worldwide

లాభాల్లోకి రావాలంటే 35 కోట్లు:ది కేరళ స్టోరి (The Kerala Story) చిత్రాన్ని విపుల్ షా 28 కోట్లతో తెరకెక్కించారు. ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్‌ను 30 కోట్లుగా అంచనా వేశారు. దేశవ్యాప్తంగా మెజారిటీ రాష్ట్రాల్లో సొంతంగా రిలీజ్ చేశారనే ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాదాపు ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. కనీసం 35 కోట్లు బాక్సాఫీస్ వద్ద రాబట్టాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు లెక్క కట్టారు. అయితే ఈ సినిమా 5వ రోజే లాభాల్లోకి ప్రవేశించడం విశేషంగా మారింది.

Adah Sharmas The Kerala Story Day 6 collections worldwide

రోజు రోజుకు పెరుగుతున్న కలెక్షన్లు:ది కేరళ స్టోరి (The Kerala Story) చిత్రం తొలి రోజు నుంచి భారీ కలెక్షన్లను నమోదు చేస్తున్నది. సాధారణంగా ఓపెనింగ్ తర్వాత కలెక్షన్లు తగ్గడం గమనిస్తుంటాం. కానీ ఈ సినిమా విషయంలో విడుదలైన తొలి రోజు నుంచి నేటి వరకు రోజు రోజుకు పెరుగుతూనే ఉండటం ట్రేడ్ వర్గాల్లో జోష్ పెంచింది. ది కశ్మీర్ ఫైల్స్ సినిమా మాదిరిగానే భారీ వసూళ్లను రాబడుతున్నది.

Adah Sharmas The Kerala Story Day 6 collections worldwide

5 రోజుల్లో 50 కోట్లకుపైగా :ది కేరళ స్టోరి (The Kerala Story) 5 రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే తొలి రోజు 8 కోట్ల రూపాయలకుపైగా, రెండో రోజు 11.5 కోట్లు, మూడో రోజు 17 కోట్లు, 4వ రోజు 10 కోట్ల, ఐదో రోజు 11 కోట్లకుపైగా కలెక్షన్లు సాధించింది. దాంతో ఈ చిత్రం 57 కోట్లు రాబట్టింది. చాలా వేగంగా 50 కోట్ల క్లబ్‌లో చేరిన మీడియం రేంజ్ సినిమాగా ఘనతను సొంతం చేసుకొన్నది.

Adah Sharmas The Kerala Story Day 6 collections worldwide

6వ రోజు భారీ లాభాలతో :ఇక ది కేరళ స్టోరి (The Kerala Story) చిత్రం 6వ రోజు రికార్డు వసూళ్లను నమోదు చేసింది. అందరి అంచనాల తలకిందులు చేస్తూ.. 12 కోట్ల రూపాయలను ఇండియన్ బాక్సాఫీస్ వద్ద నమోదు చేసింది. దాంతో ఈ చిత్రం సుమారుగా 69 కోట్ల రూపాయల గ్రాస్.. 40 కోట్లకుపైగా షేర్ వసూలు చేసింది. మరో రెండు, మూడు రోజుల్లో ఈ చిత్రం 100 కోట్ల క్లబ్‌లో చేరే పరిస్థితి కనిపిస్తున్నది. ఈ చిత్రాన్ని ఇంకా ఓవర్సీస్‌లో రిలీజ్ చేయకపోవడం గమనార్హం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X