The Kerala Story day 1 collections ది కేరళ స్టోరికి ఊహించని కలెక్షన్లు.. తొలి రోజు ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?

భారతీయ సినిమా పరిశ్రమలో ఇటీవల కాలంలో అత్యంత వివాదాస్పద అంశాల మధ్య రిలీజైన చిత్రం ది కేరళ స్టోరి. లవ్ జిహద్ మాటున హిందూ అమ్మాయిలపై వల వేసి ఇస్లాం మతంలోకి మార్పిడి బ్యాక్ డ్రాప్‌గా ఈ సినిమా తెరకెక్కింది.

అదాశర్మ, యోగితా బిహాని, సోనియా బలానీ, సిద్ది ఇద్నానీ తదితరులు నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు సిదిప్టో సేన్ రూపొందించగా, ప్రముఖ నిర్మాత విపుల్ అమృత్‌లాల్ షా స్వీయ నిర్మాణంతోపాటు క్రియేటివ్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. మే 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తొలి రోజు ఏ రేంజ్ కలెక్షన్లు సాధించింది? బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ ఎంత రావాలనే వివరాల్లోకి వెళితే..

The Kerala Story: Here is the movie day 1 collections worldwide

బడ్జెట్, బ్రేక్ ఈవెన్ టార్గెట్: ది కేరళ స్టోరి చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో రూపొందించారు. బీ గ్రేడ్ యాక్టర్లతో రూపొందించినప్పటికీ.. నిర్మాణ అంశాలు బడ్జెట్‌ను పెంచేలా చేశాయి. ఈ సినిమాను సుమారు 28 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ సినిమా బిజినెస్ సుమారు 34 కోట్లుగా విలువ కట్టారు. ఈ సినిమా కనీసం 35 కోట్ల థియేట్రికల్ వసూళ్లు రాబడితే.. హిట్ ఖాతాలోకి చేరుతుంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

The Kerala Story: Here is the movie day 1 collections worldwide

థియేటర్ కౌంట్, అడ్వాన్స్ బుకింగ్: ది కేరళ స్టోరి సినిమా రిలీజ్‌కు ముందు వివాదాస్పదంగా మారడంతో మంచి బజ్ క్రియేట్ అయింది. దాంతో ఈ సినిమాపై మంచి క్రేజ్ ఏర్పడింది. దాంతో ఈ సినిమాను దాదాపు 2000 థియేటర్లలో దేశవ్యాప్తంగా రిలీజ్ చేశారు.దాదాపు 31 వేల టికెట్లు అమ్ముడుపోయాయి. అడ్వాన్స్ బుకింగ్ కూడా ఓ మోస్తారుగా జరగడం, కరెంట్ బుకింగ్‌కు మంచి స్పందన కనిపించడంతో తొలి రోజు ఓ రేంజ్ కలెక్షన్లు నమోదు అయ్యేలా చేసింది అని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.

The Kerala Story: Here is the movie day 1 collections worldwide

మల్టీ‌ప్లెక్స్‌లో కలెక్షన్ల హవా: ది కేరళ స్టోరి సినిమాకు సింగిల్ థియేటర్లలో కంటే మల్టీప్లెక్స్‌లో భారీ స్పందన కనిపించింది. మాస్ ఆడియెన్స్ కంటే క్లాస్ ఆడియెన్స్ ఈ సినిమాను చూసేందుకు మొగ్గు చూపారు. జాతీయ మల్టీ‌ప్లెక్స్‌లో 1.9 కోట్లు, పీవీఆర్‌లో 1 కోటి రూపాయలు, ఐనాక్స్‌లో 65 లక్షలు, సినీ పోలీస్‌లో 50 లక్షలు రాబట్టింది. తొలి రోజు కలెక్షన్లలో అధిక భాగం మల్టిప్లెక్స్ వాటానే ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

The Kerala Story: Here is the movie day 1 collections worldwide

తొలి రోజు కలెక్షన్లు ఎంతంటే?: ది కేరళ స్టోరి తొలి రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం తొలి రోజున హిందీ పరిశ్రమలో ది బెస్ట్ కలెక్షన్లను సాధించింది. ఇటీవల కాలంలో స్టార్ హీరోల సినిమాలతో పోటీ పడి వసూళ్లను రాబట్టింది. తొలి రోజున ఈ చిత్రం దేశవ్యాప్తంగా 7.5 కోట్లు వసూలు చేసింది. ఓవర్సీస్‌లో సుమారు 1 కోటి రూపాయలు వసూలు చేసింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా 8.5 కోట్లు రాబట్టింది.

The Kerala Story: Here is the movie day 1 collections worldwide

ది కేరళ స్టోరి లాభాల్లోకి రావాలంటే?: ది కేరళ స్టోరి చిత్రం సుమారు 35 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా బాక్సాఫీస్ జర్నీని ప్రారంభించింది. వివాదాలు ఈ సినిమాకు మంచి పాజిటివ్‌గా మారుతున్నది. దాంతో తొలి రోజు 8.5 కోట్లు వసూలు చేసింది. శని, ఆదివారాలు మరింత మెరుగైన వసూళ్లను నమోదు చేసే అవకాశం ఉంది. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ రోజు రోజుకు పెరుగుతున్నాయి. కాబట్టి భారీ లాభాలే నమోదు చేసే ఛాన్సెస్ ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X